మాజీ సర్పంచ్ దారుణ హత్య..

మాజీ సర్పంచ్ దారుణ హత్య.. నూతనకల్ మండలంలో ఉద్రిక్తత

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మిర్యాల మాజీ సర్పంచ్ చక్రయ్య గౌడ్(61) పై గొడ్డలితో దుండగుల దాడి చేశారు.

చక్రయ్య పొలం పనులు ముగించుకొని వస్తుండగా ముత్యాలమ్మ గుడి దగ్గరకు రాగానే ఒక్కసారిగా దాడి జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చక్రయ్యను సూర్యాపేట హాస్పిటల్ తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చక్రయ్య మృతి చెందాడు. పాత కక్షలు కారణమై ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుంగా మిర్యాల గ్రామంలో పికెటింగ్​ తో పాలు 144 సెక్షన్​ విధించారు.

Ck News Tv

Ck News Tv

Next Story