గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం...?
గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం...?

గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం...?
మునగాల మండలం పరిధిలో ఓ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నానికి పాల్ప సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ నెలలో జరగాల్సిన గురుకుల పాఠశాల ఎంట్రన్స్ పరీక్షకు సంబంధించి డ్యూటీల విషయంలో సదరు ఉపాధ్యాయుడికి (ఇంచార్జ్) వైస్ ప్రిన్సిపాల్ కు మధ్య వాదన చోటు చేసుకున్న నేపథ్యంలో ఉపాధ్యాయుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్టు తెలిసింది.
ప్రస్తుతానికి ఆ ఉపాధ్యాయుడు ఆరోగ్యం నిలకడగానే ఉంది. ప్రిన్సిపాల్ కు ఉపాధ్యాయులకు మధ్య తోటి ఉపాధ్యాయులు ఎటువంటి విభేదాలు లేకుండా సంధి కుదిరించినట్లు సమాచారం.
ఇదే పాఠశాలలో గతంలో కూడా ఒక బాబుని విపరీతంగా కొట్టిన సందర్భంలో తల్లిదండ్రులకు సైతం పాఠశాల ప్రిన్సిపాల్ తో వాగ్వివాదానికి దిగారు.
అసలే ప్రభుత్వం గురుకుల పాఠశాల పై పూర్తిస్థాయిలో నిఘా ఉంచిన నేపథ్యంలో ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ చేయపడుతుంది. ఇలా ఉపాధ్యాయుల మధ్య విభేదాలు తలెత్తడం వంటివి విద్యార్థులపై ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఎటువంటి విభేదాలు లేవు…: పాఠశాల వైస్ ప్రిన్సిపాల్
ఇదే విషయమై గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు నాకు ఎటువంటి విభేదాలు లేవు. త్వరలో జరగనున్న ఎంట్రెన్స్ ఎగ్జామ్ పై డ్యూటీ లో వేస్తున్నాను. కేవలం 12 మంది మాత్రమే డ్యూటీకి అవసరం. మా వద్ద 50 మందికి టీచర్లు పైగా ఉన్నారు. అందరికీ న్యాయం చేయడం సాధ్యం కాదు. కొంతమంది సీనియర్లను మాత్రమే పరిగణలోకి తీసుకుని వారికి మాత్రమే డ్యూటీలో వేస్తున్నాను. డ్యూటీలో వేసే క్రమంలో నాక్కూడా వేయవచ్చు కదా అని సదరు ఉపాధ్యాయుడు నన్ను అడిగారు.
కాకపోతే 12 మంది మాత్రమే అవసరం ఉన్నారని సదరు ఉపాధ్యాయుడికి చెప్పానని తెలిపారు. మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు. అందరం కలిసికట్టుగా పాఠశాల అభివృద్ధికి పాటుపడుతున్నాం అని అన్నారు.
