మంత్రి కాళ్లు కడిగి ఆ నీళ్లు నా నెత్తిన పోసుకుంటా.. జగదీష్ రెడ్డి

మంత్రి కాళ్లు కడిగి ఆ నీళ్లు నా నెత్తిన పోసుకుంటా.. జగదీష్ రెడ్డి

బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నూర్యాపేటలో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు.

ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సూర్యాపేటకు ఎస్ఆర్ఎస్పీ , దేవాదుల నీళ్లు తీసుకొస్తే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళ్లు కడిగి.. ఆ నీళ్లు నా నెత్తిన చల్లుకుంటా అని సంచలన ప్రకటన చేశారు.

ప్రభుత్వానివి మంత్రులవి అన్నీ చేతగాని మాటలు అని విమర్శించారు. పరిపాలన చేయడం చేతగాక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు.

దమ్ముంటే ముందు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలు ఆందోళన చెందుతున్నాయని అన్నారు.

రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఇలా అందరూ అసహనంతో ఉన్నారని తెలిపారు.రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

కాగా, జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పండ్ చేసిన సంగతి తెలిసిందే. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో ఆయన్ను ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు.

Updated On 18 March 2025 7:41 PM IST
Ck News Tv

Ck News Tv

Next Story