పంచాయతీ కార్యదర్శి సస్పెండ్..

పంచాయతీ కార్యదర్శి సస్పెండ్..
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం ఎంపీడీఓ బాణాల శ్రీనివాస్.. ఎంపీఓ నరేష్ తో పాటు( చెన్నాయి పాలెం) క్రింద తండా గ్రామ పంచాయతీ కార్యదర్శి బాల సైదాను సస్పెండ్ చేశారు.
అలాగే అక్కడ ప్రస్తుతం పనిచేస్తున్న గ్రామ కార్యదర్శి ప్రవీణ్ తో పాటు గతంలో పనిచేసిన విజయలక్ష్మి దేశం రాజ్ లను డీపీఓ ఆఫీసుకు అటాచ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఉత్తర్వులు జారీ చేశారు.
మఠంపల్లి మండలం కింది తండా గ్రామంలో ఓటర్ల జాబితాలో అధికారులు వార్డుల సక్రమంగా ఎంపిక చేయలేదని అలాగే పై తండాకు సంబంధించిన 40 ఓట్లను కింది తండా గ్రామంలో చేర్చారని కింది తండా గ్రామానికి చెందిన భూక్య బాబురావు నాయక్ ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లగా ఓటర్ల జాబితాను పరిశీలించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
కానీ ఎంపీడీఓ ఎంపీఓ గ్రామ పంచాయతీ కార్యదర్శి అంతా సక్రమంగానే ఉందని అధికారులకు రిపోర్ట్ చేసి అలాగే ఓటర్ల జాబితా ఎంపిక చేయడంతో మళ్లీ ఆ గ్రామానికి చెందిన భూక్య బాబురావు నాయక్ అనే వ్యక్తి ఓటర్ల జాబితాను మార్పు చేయకుండా అలాగే ఫైనల్ లిస్ట్ చేశారని ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేయగా
దీనిని పరిగణనలోకి తీసుకున్న ఎలక్షన్ కమిషనర్ సీరియస్ తీసుకుని విచారణ చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు ఆదేశించడంతో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మఠంపల్లి మండలం ఎంపీడీవో ఎంపీఓ కింది తండా గ్రామ పంచాయతీ కార్యదర్శి ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదే విషయమై సూర్యాపేట జిల్లా పంచాయతీ అధికారి నారాయణరెడ్డి ను వివరణ కోరగా మఠంపల్లి మండలంలోని క్రింది తండా గ్రామంలో ఓటర్ల జాబితా ఫైనల్ లో డ్రాప్టింగ్ విషయంలో మిస్ మ్యాచ్ చేశారని గుర్తించి ఎంపీడీఓ ఎంపీఓ గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసినది వాస్తవమేనని వీరితో పాటు మరో ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను డీపీఓ ఆఫీస్ కి అటాచ్ చేశామని తెలిపారు.
