✕
పెద్దగట్టు జాతరలో తొక్కిసలాట

x
పెద్దగట్టు జాతరలో తొక్కిసలాట
తెలంగాణలో పెద్దగట్టు జరుగుతోంది. ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న ఈ జాతరలో ఈ రోజు అపశ్రుతి చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితం అక్కడ స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది
మర్రిచెట్టుకు సమీపంలో పోలీస్ పాయింట్ దగ్గర మున్సిపల్ చెత్త ట్రాక్టర్ రావడంతో భక్తులు ఒకరినొకరు నెట్టుకున్నారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. కానీ చిన్నారులు మాత్రం ఇబ్బంది పడ్డారని స్థానికులు చెబుతున్నారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, భద్రతా సిబ్బంది పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకుని వచ్చారు.

Ck News Tv
Next Story