
అంబేద్కర్ జయంతి వేడుకల్లో జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి
“ములుగు జిల్లా సీకే ప్రతినిధి భార్గవ్”
భారతదేశ ఔన్నత్యాన్ని,
ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవాపితం చేసిన
మహోన్నత కీర్తి శిఖరం..
భారత రాజ్యాంగ రూపకర్త..
సమసమాజ స్వాప్నికుడు,
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి..
భారత స్వాతంత్ర్య తొలి న్యాయశాఖ మంత్రి..
ఆర్థిక వేత్త, రాజకీయ వేత్త న్యాయ వాది,..
ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత,
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామంలో ఎల్లాస్వామి అధ్యక్షతన నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలకు జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి ముఖ్య అతిధిగ హాజరై వారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు..
అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకున్నారు..
ఈ సందర్బంగా జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి మాట్లాడుతూ డా”బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన సమసమాజ స్వప్నికుడు అన్నారు,
ఎన్నో అవమాలను భరించి చదువుకొని భారతదేశనికి గొప్ప రాజ్యాంగాన్ని రచించారు అన్నారు, ఈ తరం యువత అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకోవలని అన్నారు
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మార్వో ముల్కనూర్ శ్రీనివాస్, స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు, స్థానిక ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్, తాడ్వాయి మండల అధ్యక్షులు దండుగుల మల్లయ్య రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోపనపోయిన కొమురయ్య సీనియర్ నాయకులు సిద్ధబోయిన వసంతరావు పీరీల చలమయ్య కడివేండీ సత్యం గ్రామ కమిటీ అధ్యక్షులు పీర్ల నరేష్ గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు…