అంబేద్కర్ నే విమర్శించిన గొప్ప ముఖ్యమంత్రి మన కేసీఆర్

అంబేద్కర్ నే విమర్శించిన గొప్ప ముఖ్యమంత్రి మన కేసీఆర్
చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికే భారీ విగ్రహం ఏర్పాటు
-దేశం గర్వించదగ్గ ముఖ్యమంత్రులు ఎన్.టి.ఆర్, వైఎస్ఆర్ లు మాత్రమే
ఆ జాబితాలోకి రావాలని తపన పడుతున్న కేసీఆర్ కల నెరవేరదు
జగన్నాథపురం అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో మాజీ ఎంపీ పొంగులేటి చింతకాని : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ నే విమర్శించిన గొప్ప ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. చింతకాని మండలం జగన్నాథపురంలో శుక్రవారం జరిగిన అంబేడ్కర్ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విగ్రహా ఆవిష్కరణ. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పొంగులేటి మాట్లాడుతూ రాజ్యాంగంలో లోసుగులు ఉన్నాయ్… దానిని సవరించాలని కేసీఆర్ ఆనాడు చెప్పడంతో అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ఆ తప్పిదాన్ని కప్పించుకునేందుకు ఈ రోజు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దానిని ఆవిష్కరించారని తెలిపారు. చరిత్రలో నిలిచిపోవాలనే తపనతో కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు ప్రతిఒక్కరూ గమనిస్తున్నారన్నారు. దేశం గర్వించదగ్గ ముఖ్యమంత్రులుగా ఎన్.టీ.ఆర్. వైఎస్ఆర్లు మాత్రమేనని చరిత్ర ఉన్నంత కాలం వారి పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. వారి జాబితాలోకి రావాలనుకునే కేసీఆర్ తపన ఎన్నటికీ నెరవేరదని ఎద్దేవా చేశారు. ఈ దేశంలో కోట్లాది మంది గుండెల్లో అంబేద్కర్ ఉంటారని, ఆయన విగ్రహాలే ఎక్కువగా కనిపిస్తాయని అంతటి మహానీయుడు మన అంబేద్కర్ అని కొనియాడారు. ప్రతిఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుకు కృషిచేసిన యూత్ బాధ్యులు కిరణ్ సహా పలువురిని ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పొంగులేటితో పాటు మద్దినేని బేబి స్వర్ణకుమారి, మువ్వా విజయబాబు, బొర్రా రాజశేఖర్, డాక్టర్ కోటా రాంబాబు, కన్నెబోయిన సీతారామయ్య, కిలారు మనోహార్, మందడపు శ్రీను, గుడిపాటి ఆనందరావు, బాబుల్ రెడ్డి, ఆలస్యం నాగయ్య, రాయబారపు వీరాంజనేయులు, గోగుల శ్రీను, దామకొండ వెంకన్న, మందడపు తిరుమలరావు, రైట్ ఛాయిస్ మెండెం కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు.