
అంబేత్కర్ 132వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఏడవల్లి కృష్ణ
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి.
ఏప్రిల్ 14,
కొత్తగూడెం నియోజకవర్గం పోస్టాఫీసు సెంటర్ నందు డాక్టర్ బి.అర్ అంబేత్కర్ 132వ జయంతి వేడుకల్లో పాల్గొని అంబేత్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ కార్యక్రమము అనంతరం ఏడవల్లి మాట్లాడుతూ అంబేత్కర్ ఒక ప్రముఖ భారతీయ నాయ్యవాధి, ఆర్ధిక శాస్త్రవేత్త, రాజకీయ నేత,సంఘ సంస్కర్త, ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు,స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి,ఇతను కొలబియ విశ్వవిద్యాలయం నుండి పి.హేచ్.డి లండన్ విశ్వవిద్యాలయం నుండి డి. యస్.సి పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవం సంపాదించాడు, నాయ్య,సామాజిక,ఆర్ధిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు,మొదట్లో న్యాయవాది గా ,అధ్యాపకుడిగా,ఆర్ధికవేత్తగా, పని చేశాడు
తరువాత భారతదేశ స్వాతంత్ర్య పత్రికలను ప్రచురణ,దళితుల సామాజిక రాజకీయ హక్కులు భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపకన కోసం కృషి చేశాడు 1956లో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు సామూహికంగా బౌద్ధం లోకి మత మార్పిడి చేసుకున్నారు,
భారతదేశ చరిత్రలో చిరస్మణీయుడు గా నిలిచిన నాయకుడు,ఇతను చేసిన విశేష కృషికి అంబేత్కర్ పుట్టిన రోజును అంబేత్కర్ జయంతి గా జరుపుకుంటారునీ టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ తెలిపారు
ఈ కార్యక్రమములో: సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య,లక్ష్మిదేవిపల్లి మండల అధ్యక్షులు సకినాల వెంకటేశ్వరావు,చుంచుపల్లి మండల అధ్యక్షులు అంతోటి పాల్,బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుబ్బా రెడ్డి,గుంటి జెగన్ మోహన్ రావు,కలిపాక సత్యనారాయణ, ఐ ఎన్ టి యు సి నాయకులు జెలిల్,లక్ష్మిదేవిపల్లి మండల యస్సీ సెల్ అధ్యక్షులు కొప్పుల రమేష్,వెలెటి వెంకటేశ్వర్లు, చంద్రగిరి సత్యనారాయణ, రామ్ నాయక్, చంద్రకళ,పట్టణ నాయకులు భూక్యా శ్రీనివాస్,యూత్ నాయకులు శనగ లక్ష్మణ్,మొద్దు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు