AdilabadTelangana

“అటువంటి అత్తకోడళ్ళను నేడు చూడగలమా..?

"అటువంటి అత్తకోడళ్ళను నేడు చూడగలమా..?

“అటువంటి అత్తకోడళ్ళను నేడు చూడగలమా..?

మారా అనుభవం మధురంగా.. నయోమి ఎలా చూడగలిగింది…?” పూర్తివివరాల్లో…కొద్దినిముషాలు కేటాయించి తెలుసుకో మిత్రమా…తొందరపాటు నిర్ణయాలు నిన్ను కష్టాలపాలు చేయవచ్చు… అలోచించి ముందుకెళ్ళు.. న్యాయాధిపతులు ఏలుతున్న దినాలలో ఎలీమెలెకు, అతని భార్య నయోమి, తన ఇద్దరు కుమారులు బేత్లెహేము అనే ప్రాంతాన్ని విడిచి త్వరగా సంపాదించాలనే ధనపెక్షతో మోయాబు దేశానికి బయలుదేరారు. బేత్లేహేము అంటే రొట్టెల గృహమని అర్ధం. అటువంటి ఇంటిని విడిచి, అన్యదేశమైన మోయాబు దేశానికి వలసగా వెళ్ళారు. అక్కడ ఎలీమెలెకు అనగా “నయోమి భర్త మరణించాడు”. తన ఇద్దరు కుమారులకు ఆదే దేశనికి చెందిన ప్రాంతంకాని ప్రాంతం దేశం కానీ దేశం సంప్రదాయం కానీ సంప్రదాయానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలతో బంధుత్వం కుదుర్చుకొని నయోమి తన ఒంటరి మహిళగా భర్తలేనిదై, బరువు బాధ్యతలు మోస్తూ ఇద్దరు కుమారులకు అన్య దేశపు స్త్రీలతో వివాహం జరిపించింది. వివాహాలు అయిన తర్వాత కనీసం తన కుమారు ఇద్దరు కొడండ్లు సుఖసంతోషాలతో వర్దిల్లుతూ, నయోమి వృధ్యాప్యంలో మంచి చూసుకుంటారని ఎన్నో కలలు కన్నది. కానీ కాలం తనకు కలిసిరాలేదు అనుకున్నది ఒకటి అయితే అయింది మరొకటి. ఇద్దరు కుమారులకు వివాహం జరిగిన కొద్దికాలానికే ఆ ఇద్దరు కుమారులు కూడ మరణించారు.

భరించలేని గొప్ప ఆవేదన, దుఃఖం మనసులోపెట్టుకొని కుమిలిపోయింది. తనతోపాటు యవ్వన ప్రయంలోనే ముద్దుముచ్చట్లు తీరాకముందే భర్తల్ని కోల్పోయిన ఇద్దరు కోడండ్ల జీవితంకూడా ఏమిచేయాలో అర్ధంకాని పరిస్థితి. ఒకటి కుటుంబంలో ముగ్గురు పురుషుల్ని కోలిపోయిన స్త్రీలుగా గుండెల్లో ఎంతో దుఃఖం ఉన్నప్పటికీ ఒకరికి ఒకరు ఓదార్చుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. ‘‘కాగా ఆ స్త్రీ తాను కనిన యిద్దరు కుమారులును తన పెనిమిటియు లేనిదాయెను. వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్లుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి’’. ఈ క్రమములో యవ్వన స్త్రీల మనసును అర్ధం చేసుకున్న నయోమి తన ఇద్దరు కోడండ్ల జీవితం ఒంటరిగానే గడపడం ఆమెకు ఇష్టంలేక, ఒక తల్లిలా అలోచించి “నయోమి తన ఇద్దరి కోడళ్లతో మీ స్వగృహాలకు వెళ్లుమని చెప్పగా” ఒక కోడలు తన అత్తగారైన నయోమిని మాటలు విని తన జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికి ఆమెను వదిలిపెట్టి తన తల్లిదండ్రులు ఇంటికి ఒక కోడలు వెళ్ళిపోయింది. మరో కోడలు రూతు తనతో కలిసి జీవించడానికి ఇష్టపడింది.. ఎందుకంటే మా దేశానికి వచ్చి తన తన భర్తను పోగొట్టుకున్న తన అత్తగారైన నయోమి మనసును అర్ధంచేసుంది..

అందువల్ల నయోమి రూతును తీసుకుని బేత్లెహేముకు తిరిగి వచ్చింది. అప్పుడు ఆ “ఊరివారు ఈమె నయోమి” గదా! అని అన్నారు. అప్పుడు నయోమి ఇలా అంటుంది.‘‘. సర్వశక్తుడు నాకు చాలా దు:ఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనండి” నేను సమృద్ధిగలదాననై వెళ్లితిని, దేవుడు నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేల? దేవుడు నామీద విరుద్ధముగ సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను’’.
“నయోమి అనే పేరుకు మధురం అని, మారా అంటే చేదు అని అర్థం.” అన్య దేశానికి వెళ్ళి దేవునిచే క్రమశిక్షణ చేయబడి తిరిగి రిక్తురాలిగా స్వదేశానికి వచ్చింది. మనలో కొందరికి తాము ఎంచుకున్న మార్గం వారి దృష్టికి మంచిగా కనబడుతుంది. అందులో కొనసాగడం లాభకరం అనుకుంటారు. అయితే అది దేవుని చిత్తానికి వ్యతిరేకమై ఉండొచ్చునేమో! ‘‘ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును’’ అని బైబిల్లో చెప్పబడింది. నయోమి భర్తకు బంధువైన బోయజుతో రూతుకు వివాహం జరిగింది. దేవుడు ఆ దంపతులను ఆశీర్వదించి కుమారుణ్ణి ఇచ్చాడు. “భర్తను, కుమారులను కోల్పోయి ఎడారిలా మారిన నయోమి జీవితాన్ని దేవుడు కరుణించడంతో నిత్యం పారే జలపాతంలా మారింది.”

‘‘అప్పుడు స్త్రీలు – ఈ దినమున నీకు బంధువుడు లేకుండచేయని దేవుడు స్తుతినొందును గాక. నిన్ను ప్రేమించి యేడుగురు కుమారులకంటె నీ కెక్కువగా నున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ` ఆ బిడ్డను తీసికొని కౌగిటనుంచుకుని వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు – నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రియైన యెష్షయి యొక్క తండ్రి’’ నయోమి మనవడైన ఓబేదు దావీదుకు తాత. యేసుక్రీస్తు వంశావళి గమనిస్తే అందులో ఓబేదు పేరు ఉండడం హర్షించదగ్గ విషయం. “మారాలాంటి జీవితాలను దేవుడు మధురంగా మార్చగల శక్తిగలవాడు.” అంత మాత్రమే కాదు; చక్కగా క్రమశిక్షణ చేస్తాడని నయోమి జీవిత అనుభవాల ద్వారా అర్థమవుతుంది.. కొన్నిసార్లు మనం కూడ మన ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడికో విదేశాల్లో వెళ్లి డబ్బులు సంపాదించాలని ఆరాటపడుతుంటాం… కానీ అక్కడి పరిస్థితులు సహకరించక ఊహించని దుఃఖన్ని కొని తెచ్చుకున్నట్లు పలుమార్లు అనేకుల ద్వారా చూస్తుంటాం. బాగుపడేవాడు ఎక్కడ ఉన్న బాగుపడుతాడు.. అనాలోచనతో సమస్యలు కొనితెచ్చుకోవద్దు మిత్రమా… జీవితంలో కలిగిన దానితో సంతృప్తి చెందడం చాలా సంతోషాన్ని ఇస్తుంది..

-డాక్టర్ పీటర్ నాయక్ లకావత్, మోటివేషనల్ స్పీకర్

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected