
ముత్తి రెడ్డి గుడెంలో అదుపుతప్పి పల్టీ కొట్టిన తుపాన్….
తప్పిన పెను ప్రమాదం..
సి కె న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్)మే 24
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలోని మోత్కూరు రాయగిరి ప్రధాన రహదారిపై హైదరాబాద్ నుండి తోర్రురు వెళుతునున్న AP07W7846 వెహికిల్ నంబర్ గల తుపాన్ అదుపు తప్పి పల్టీ కొట్టింది.
డ్రైవర్ చాకచక్యం ప్రదర్శించండంతో ప్రమాదం తప్పింది.తుపాన్ లో డ్రైవర్ తో సహా 11 మంది ప్రయాణిస్తుండగా ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి.
గాయాలైన వారిని ముత్తిరెడ్డిగూడెంలో ప్రథమ చికిత్స ఆలయంలో ప్రథమ చికిత్స అందించి అనంతరం అంబులెన్స్ లో భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
సైకిల్ అడ్డంగా రావడం వల్ల ప్రమాదం
ఘటన విషయాలపై డ్రైవర్ ని సమాచారం అడగ్గా హైదరాబాద్ నుండి వస్తున్న సమయంలో ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి అతి సమీపంలో ఉన్న ఢాబాల వద్ద ఒక వ్యక్తి సైకిల్ నడిపించుకుంటు
తమకు ముందు ఎదురు రావడంతో వాహనాన్నీ ఆపడానికి ప్రయత్నం చేసే సమయంలో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది అని తెలిపారు..