Telangana

అధికారుల వేతనం కన్నా..చెత్త బండ్ల కార్మికులకు అవాక్కయ్యే వేతనం

అధికారుల వేతనం కన్నా..చెత్త బండ్ల కార్మికులకు అవాక్కయ్యే వేతనం ఎక్కువండోయ్???


రంగారెడ్డి జిల్లా స్టేట్ బ్యూరో 13ఏప్రిల్:తెలుగురాస్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కంటే అధిక వేతనంలో తెలంగాణ రాష్ట్రంలోని అధికారులు కంటే ఎక్కువగా సంపాదిస్తున్న చెత్త బండ్ల కార్మికులు?సాధారణంగా పక్క తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ పరిధిలోని నగరంలో అన్ని డివిజన్ల పర్యవేక్షణ అధికారులలో ముఖ్యంగా కమిషనర్ తో మొదలై అదనపు కమిషనర్,
డిప్యూటీ కమిషనర్,
హెల్త్ ఆఫీసర్,
శానిటరి సూపర్వైజర్,
శానిటరి ఇన్స్పెక్టర్,
మేస్త్రి ల ఆధ్వర్యంలో
ఏ డివిజన్లకు ఆ డివిజన్లకు శానిటరి ఇన్స్పెక్టర్ మరియు మేస్త్రిల పర్యవేక్షణలో రోడ్లలో,వీధిల్లో లేదా కాలనీల్లో చెత్త పారిశుధ్య కార్మికుల ద్వారా చెత్తను తీసుకొని పోతుండడం డైలీ దినచర్య.వీరికి ఉన్నతాధికారి శానిటరి సూపర్వైజర్ (ఎస్.ఎస్).వీరికి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఏదేని కార్మికుల సమస్యలున్నను లేదా డివిజనల్లో చెత్త,కాలువలను శుభ్ర పరచడం వీరి కన్నుసన్నులలోనే జరుగుతుందడం ఆనవాయితి.అంతేకాకుండా పారిశుధ్య కార్మికులలో కొందరు పర్మినెంట్ ఉద్యోగులు-కాంటాక్ట్ పద్దతిన విధులు నిర్వహించే పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వమే నెలకు వేతనాలు అందిస్తున్నది.
తెలంగాణ రాష్ట్రంలో విధి విధానాలు వేరు???అసలు విషయంలోకి వస్తే???మా దృష్టికొచ్చిన ఎల్.బి.నగర్ నియోజకవర్గంలోని “నాగోలు” డివిజను పరిధిలోని వాస్తవాలను తెలియజేయాలనే సంకల్పించాము??జోనల్ కమిషనర్ ఆధ్వర్యంలోని డీసి,ఎస్.ఈ,ఈ.ఈ,ఏ.ఈ విభాగంలోని అధికారుల పర్యవేక్షణలోని డివిజనల్లో పలు అభివృద్ధిపై చూయిస్తున్న శ్రద్ద.. ప్రజల ప్రధాన సమస్యలపై తెలుసుకొనే ఆలోచన ఎందుకు చేయడం లేదని పలువురి ప్రశ్నలు ఎన్నో?ఎన్నెన్నో??? ఒక్కో వార్డుల్లో ఒక్కో ఏ.ఈ ని అనుసంధానం చేసి వీరి పరిధిలో ఒక సాధారణ సూపర్వైజరుని నియమించి వీరి క్రింద కాంటాక్ట్ బేసికన మహిళలు/పురుషుల ద్వారా రోడ్లు,కాలనీలను శుభ్రం చేయించడం వీరి కర్తవ్యం.వీరికి చెత్త బండి తీయువారి పర్యవేక్షణ అదనపు బాధ్యతలు?ఏవేని కంప్లైంట్స్ ఉన్నను సమాచారమందించే పారిశుధ్య సూపర్వైజర్? వాస్తవ విషయానికొస్తే చెత్త బండి తీసుకొనివెళ్లేవారు డే బై డే నాగోలు డివిజన్ పరిధిలోకి వచ్చి వెళ్ళేవారి దినచర్య??ఇంతే కాదండోయ్?? ఈ చెత్త బండిలో చెత్తను తీసుకొనే వెళ్లే అతనితో,భార్య,అప్పుడప్పుడు వీరి కుటుంబ సభ్యులు చెత్త బండితో వస్తుంటారు???వీరి పరిధిలో దాదాపుగా ఒక వేయి ఇల్లు నివాసాలు??వీరి పరిధిలో హాస్పిటల్స్,ఓల్దేజ్ హోమ్స్ ఇతర మొదలగు ఉన్నవి.వీరు వచ్చేది సరిగా ఎవ్వరికి తెల్వదు?విజిల్ వినిపించి వినపించకపోవడంతో వీరు వచ్చేది తెలియని పరిస్థితి??ఈ విషయాన్ని నాగోలు కార్పొరేటరుకి,వారి పీ.ఏ కు తెలపగా వారు చెప్పడంతో ఈ మధ్య విజిల్ వేస్తుండడం విశేషం??అయ్యినను తీరుమారని చెత్త బండి అతను రెండు రోజులు,మూడు రోజులు అయ్యినను రాకపోవడంతో కార్పొరేటర్ పి.ఏ కు తెలపగా నాలుగో రోజు చెత్త బండి కాలనీలోకి వచ్చి ఇంటింటికి వచ్చి చెత్త తీసుకోకుండా చెత్త బండిలో కూర్చున్న వీరి భార్య బండిలోకి అందిస్తే తప్ప తీసుకోని మనస్తత్వం ఆమెది??పైగా కాలనీలో నివాసం ఉంటున్న కుటుంబాలు ఒక్కో ఇంటి వారు వంద రూపాయలు తీసుకొంటూ..వేయి కుటుంబాలు దాదాపు లక్ష దండుకొంటున్న దండుపాళ్యంలా వీరి సంపాదన ఉందంటే ఆశ్చర్యం కల్గిస్తున్న విషయమే?? ఓల్డ్ ఏజ్ హోమ్ లలో అయిదు వేలు డిమాండు చేస్తున్నారని మాకొచ్చిన సమాచారం???ఇంక హాస్పిటల్స్ లో ఇంకెంత డిమాండ్ చేస్తున్నారో ఒక్కసారి దర్యాప్తు చేస్తే ఇంకెన్ని విషయాలు బట్టబయలు అవుతాయో ఆలోచన చేస్తే ఒక సామాన్య చెత్త బండి తీసుకొని వెళ్లే అతడు,వీరి కుటుంబ సభ్యులు కలసి స్వంతంగా చెత్త బండి నడుపుతున్నారంటే వీరి సంపాదన ఎంతో ఒక్కసారి పరిశీలన చేస్తే అవాక్కు అవ్వక తప్పదు??? ఇంతే కాదండోయ్ ఈ చెత్త బండి తరువాత ఆటో కూడా నడుపుతూ పైకి అమాయకుడిగా కనిపిస్తున్న ఇతడు హుందాతనంతో రాజసంతో బాగానే దండుకుంటున్నాడని మాకొచ్చిన సమాచారం??ఇప్పటికైనా సిఎం,ప్రభుత్వ సలహాదారుడు,కలెక్టర్,అధికారులు,కార్పొరేటర్,రాజకీయ పార్టీలు స్పందించి ఇలాంటివి పునావృతం కాకుండా..తగు చర్యలు తీసుకొని..దోమలను నివారించే ప్రయత్నం చేయాలని..చెత్త బండి వసూళ్లను నియంత్రణ చేసి ఆంధ్రప్రదేశ్ లా అమలయ్యే విధంగా ప్రణాళికతో కార్యాచరణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected