
అధిష్టానం ఆశీస్సులతో పినపాకకు మకాం మార్చనున్న సూర్య
సికే న్యూస్ ప్రతినిధి
కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ములుగు ఎమ్మెల్యే సీతక్క తనయుడు త్వరలో పినపాకకు మకాం మారుస్తున్నారని విశ్వసనీయ సమాచారం…
మణుగూరు పట్టణంలో ఒక ఇంటిని అద్దెకి తీసుకున్నారని త్వరలోనే కుటుంబ సమేతంగా మణుగూరులో అడుగుపెడుతున్నాడని సూర్య ప్రధాన అనుచరులు మాట్లాడుకుంటున్నారు..
ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న వేళ సీతక్క కొడుకు సూర్య మణుగూరుకి మకాం మార్చడంతో పినపాక రాజకీయాలు వేడెక్కుతున్నాయి..
గత కొద్ది కాలంగా పినపాక నియోజకవర్గంలో శుభ-ఆశుభ కార్యక్రమంలో పాల్గొంటూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తున్నాడు..
తల్లి సూచనతో..
తన తల్లి ఎమ్మెల్యే సీతక్క సూచనతోనే మకాం మారుస్తున్నారని రానున్న రోజుల్లో నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని,సీనియర్ కాంగ్రెస్ నాయకులను ఎప్పుడు కలుస్తూ వారికి మరియు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సీతక్క సూచించారని విశ్వసనీయ సమాచారం
పలు వేదికల పైన సూర్య మాట్లాడుతూ ప్రజాభిమానం పొందిన నాయకులకు అధిష్టానం సహకరిస్తుందని వెల్లడించారు.. నియోజకవర్గంలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు తరచుగా సూర్య విషయంపై సీతక్కతో సంప్రదింపులు జరుపుతున్నారని సూర్యకి అండగా నిలుస్తామని కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు సీతక్కకు బలంగా తెలియజేశారని విశ్వసనీయ సమాచారం ఇటీవల అశ్వాపురం మండల అధ్యక్షుడు ఓరుగంటి బిక్షం వివాహానికి సైతం సూర్యతో పాటు సీతక్క పాల్గొని కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు..