HyderabadTelangana

అనంచిన్ని’కి విశిష్ట పురస్కారం అవార్డు

అనంచిన్ని'కి విశిష్ట పురస్కారం అవార్డు

జర్నలిస్టు యోధుడికి తెలుగు తల్లి అవార్డు

సికే న్యూస్ ప్రతినిధి హైదరాబాద్.

‘అనంచిన్ని’కి అవార్డు
★ పరిశోధన పాత్రికేయునికి విశిష్ట పురస్కారం
★ హాజరుకానున్న మాజీ ఉపరాష్ట్రపతి

తెలుగు జర్నలిజంలో పరిశోధన పాత్రికేయానికి కొత్త దారులు చూపిన ప్రముఖ పరిశోధన పాత్రికేయునికి ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఉగాది పురస్కారం ప్రకటించింది. మే 2న గుంటూరులో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అతిథులుగా సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి. లక్ష్మీనారాయణ, ఆంద్రప్రదేశ్ ప్రెస్ అకాడెమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఐ అండ్ పి ఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి, గుంటూరు జిల్లా కలెక్టర్ యం. వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు, మరియు ఆత్మీయ అతిథులుగా డా కేర్ హోమియోపతి మరియు ఆటిజమ్ సెంటర్ అధినేత డా. ఎ. ఎమ్. రెడ్డి, స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ శామ్యూల్ రెడ్డి, యూ బ్లడ్ ఫౌండర్ యలమంచిలి జగదీష్ బాబు, రామినేని ఫౌండేషన్ కన్వీనర్ పాతూరి నాగభూషణం తదితరులు హాజరవుతున్నారు.

బాక్స్:
‌అక్షరం రాయడం పైకి కనిపించేంత చిన్న విషయం కాదు. అక్షరం అంటే ఒక ఆలోచన. ఆవేశం. చైతన్యం. యజ్ఞం. ఆలంబన. ఆత్మ పరిశీలన.‌ మనసులో నుంచి వచ్చే ఆలోచనలను ఒడిసిపట్టి, అక్షరాలుగా కూర్చి, పేర్చి పాఠకులకు అందించడంలో పడే ప్రయాస అంతా ఇంతా కాదు. అలాంటి అక్షర ప్రయాణాన్నే జీవిత పరమావధిగా మార్చుకొని, మలచుకొని సాగడం సాహసమే అవుతుంది. అందులోనూ పరిశోధనాత్మక జర్నలిజం అనేది భిన్నమైనదే కాదు… విభిన్నమైనది. విచిత్రమైనది. అక్షర విప్లవానికి నాంది పలికేది. ప్రతి అక్షరం ప్రయాసతో కూడుకున్నదే అయినా పరిశోధనాత్మక జర్నలిజం అక్షరాలు నిరంతర పురిటి నొప్పుల నుంచి వచ్చే కొత్త తరం ఆవిష్కరణలు. అలాంటి ఆవిష్కరణలు అలవోకగా అందించే, సందించే ఏకైక జర్నలిస్టు అనంచిన్ని వెంకటేశ్వర రావు. అలుపెరగని అక్షర ప్రయాణంలో సత్కారాలెన్నో చూశాడు. ఆటు పోట్ల తో రాటు దేలాడు. అవమానించాలనుకున్న వారికి బుద్ధి చెప్పాడు. ఆయన అక్షరాలను భరించలేని పాలకులు అనంచిన్ని అక్షరాలను చీకట్లోకి తోసేశారు. సుమారు ఎనభై రోజులు ఖైదు చేశారు. అయినా అనంచిన్ని అక్షరం వెరవలేదు. మరింత పదును పెంచుకొని వేటలో ఒక అడుగు వెనక్కి పడిన పులిగా బెబ్బులిలా ముందుకు దూకింది. నేటి సమాజానికి దిక్సూచిగా, రేపటి తరానికి దివిటీగా నిరంతరం వెలుగు పంచేదే అనంచిన్ని… ఆ పదమే సంక్షేమ జర్నలిజానికి పెన్నిది.

ఏకైక యోధుడు:
తన తాత ఈదేశ స్వాతంత్ర్యం కోసం ఉరికంభానికి నవ్వుతూ వేలాడాడు. తండ్రి రజాకార్లతో పోరాడి కాళ్ళ నరాలు తెగకోసే దాకా పోరాడాడు. వాళ్ళ వంశ వారసత్వంలో పుట్టిన అనంచిన్ని వెంకటేశ్వరరావు ఓ నిశ్శబ్ద విప్లవ శాంతి.. కలం కెరటం. ఆపే దమ్మున్నోడు పుట్టలేదు. ఇక పుట్టడు. తనదైన పరిశోధనలతో వేలాది కుంభకోణాలను అలవోకగా రాశాడు. డబ్బుకు, కేసులకు, జైళ్ళకు, కిడ్నాపులకు, చావులకి భయపడని ఏకైక యోధుడు.

చెస్ క్రీడతో ప్రస్థానం..:
1987లో రాష్ట్ర చెస్ జూనియర్ ఛాంపియన్ గా ప్రస్థానం మొదలెట్టిన అనంచిన్ని వెంకటేశ్వరరావును ఖమ్మం ఈనాడు క్రీడా ప్రతినిధి రాజపుత్ అర్జున్ సింగ్ ‘చదరంగంలో దృవతారలు వీరే’ అంటూ వెలుగులోకి తెచ్చాడు. అది నిజం చేశాడు. తెలంగాణ తొలి ప్రధాన కార్యదర్శిగా కేవలం పది నెలల్లో 383 టోర్నమెంట్స్ నిర్హహించటం నమ్మశక్యం కాని ఓ అద్భుతం.

ఆరోపణల మధ్య ఆశాకిరణం:
తాను నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు తపించే వ్యక్తి. ఎదిగే వ్యక్తిపై గత 38 ఏళ్ళుగా ఎన్నో ఆరోపణలు..అయినా చలించకుండా నవ్వుతూ ముందుకు సాగుతున్న అరుదైన వ్యక్తిత్వం. ఇది భావి తరాలకు ఆదర్శం. ఇది అజాత శత్రువు గురించి చరిత్రలో ఓ పేజీ మాత్రమే..!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected