అనాథ ను అక్కున చేర్చుకున్న వద్దిరాజు రవిచంద్ర.
అనాథ ను అక్కున చేర్చుకున్న వద్దిరాజు రవిచంద్ర.

అనాథ ను అక్కున చేర్చుకున్న వద్దిరాజు రవిచంద్ర.
అన్ని తానై వద్దిరాజు పెద్దదిక్కయ్యాడు…
అంగరంగ వైభవోపేతంగా వివాహం జరిపించిన ఎంపీ వద్దిరాజు దంపతులు.
అందరూ ఉన్న ఎందరో అనాధాలుగా మిగిలిపోయే వాళ్ళను సమాజంలో మనం చూస్తుంటాం.రక్త సంబంధికులే బద్ధ శత్రువులుగా మారి విచక్షణ కోల్పోయి ఆస్తి,అంతస్థుల కొరకు విడిపోయే వాళ్ళను కూడా చూసుంటాం.నాలుగేళ్ళ వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి,అనాధగా మిగిలిన నాలుగేళ్ళ బాలుడిని దగ్గర కు తీసుకుని,అక్కున చేర్చుకుని వారి ఇంట్లో ఓ వ్యక్తిలా పెంచి పెద్ద చేసిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర,విజయలక్ష్మి దంపతుల ఉదార స్వభావానికి ఇప్పుడు అందరూ ఫిదా అవుతున్నారు.
మహబూబాద్ జిల్లా ఇనాగుర్తి గ్రామానికి చెందిన ఆకుల సత్యం హోమ్ గార్డ్ గా పనిచేవాడు.ఆకుల సత్యం,నాగమ్మ దంపతుల ఏకైనా సంతానమే మనం చెప్పుకునే అనాథ రాజు.తల్లిదండ్రుల అకాల మరణంతో బాల్య దశ నుంచి రాజు ను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అక్కున చేర్చుకుని పెద్దదిక్కయ్యాడు.రాజును పెంచి పెద్దచేయడమే కాకుండా,మంచి భవిష్యత్ ఇచ్చి…ఇప్పుడు ఓ ఇంటి వాడిని చేసిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఋణం రాజు ఏవిధంగా తీర్చుకోగలడని,రాజు వివాహం కు వచ్చిన ప్రతి ఒక్కరూ చర్చించుకున్నారు.
ఖమ్మం నగరంలోని గురువారం టీఎన్జీవో ఫంక్షన్ హల్ లో గురువారం జరిగిన రాజు వివాహం కు అటెండయ్యి,తల్లిదండ్రుల బాధ్యతను తీసుకుని…రాజు దంపతులను వద్దిరాజు రవిచంద్ర,విజయలక్ష్మి దంపతులు ఆశీర్వదించడంతో రాజు ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
రాజు, ప్రతిభ వధూవరులను
వద్దిరాజు కిషన్ ,శశిరేఖ దేవేందర్,ఇందిరమ్మ, వెంకటేశ్వర్లు,ఉమా మహేశ్వరీ,కమలమ్మ, వద్దిరాజు మోహన్, వాసవి, పెద్ద వెంకటేశ్వర్లు,పద్మ,మరియు డాక్టర్ గంగుల గంగా భవాని,వద్దిరాజు నిఖిల్ చంద్ర, వద్దిరాజు శ్రీనివాస్,సంగిశెట్టి రాంమూర్తి,పద్మ దంపతులు శీలం సత్యనారాయణ,లక్మీ కుటుంబ సభ్యులు నిండు మనసుతో నూతన వధూవరులను ఆశీర్వదించారు.