అమ్మో వేసవి !

అమ్మో వేసవి !
“ములుగు జిల్లా సి కె న్యూస్ ప్రతినిధి భార్గవ్”
ములుగు జిల్లా వెంకటాపురం మండలం లో మేజర్ గ్రామపంచాయతీ సిబ్బంది తీసుకున్న ముందస్తు చర్యలు పట్ల ఆగని ప్రశంసలు, డబ్బు లేనిదే అడుగు ముందుకు కదలని ఈ సమాజంలో, మండుటెండలో దాహంతో దప్పికతో సొమ్మసిల్లిపోతున్న వారికి రెండు నీటి చుక్కల సహాయం చేస్తుందా,,!ఈ సమాజం,,,? వెంకటాపురం మండలంలో జరుగుతున్న వెంకటేశ్వర స్వామి కల్యాణ వేడుకను వీక్షించడానికి దూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నటువంటి భక్తులకు, మరియు మండల ప్రజలకు కనీసం వేసవిలో త్రాగునీటి సమస్య ఉండకూడదు అని అంతేకాకుండా ఈ విషయం పట్ల సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ బడ్జెట్ తరఫున కాకుండా ప్రజల శ్రేయస్సు కోసం మనసున్న దాతలు వేసవిలో చలివేంద్రాల విషయం పట్ల ముందుకు వచ్చి ప్రతి గ్రామాల్లోను ప్రతి మండలంలోను ప్రతి ప్రభుత్వ ఆఫీసుల,ముందు కూడా చలివేంద్రాలు నియమించాలని సర్పంచ్ గారు కోరారు, ప్రతి వేసవిలో దాహంతో కోల్పోతున్న ప్రయాణికుల ప్రాణాల సంఖ్యను తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు, మేజర్ గ్రామపంచాయతీ ప్రజా ప్రతినిధి “సర్పంచ్ యామిలి” “కార్యదర్శి” “ఉప సర్పంచ్” మరియు “వార్డ్ నెంబర్స్”ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు,,,