
అమ్మ ఛారిటీస్, మరియు జె.కె. ఫౌండేషన్, ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు పంపిణీ.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ఏప్రిల్ 09,
ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అమ్మ ఛారిటీస్, భద్రాచలం మరియు జె.కె. ఫౌండేషన్, సారపాక సంస్థలు సంయుక్తంగా మహిళకు భరోసా ప్రాజెక్టు ద్వారా పేద కుటుంబాలకు చెందిన మహిళలకు వైజాగ్ నగరానికి చెందిన సన్ గ్రీన్ సంస్థ సహకారంతో కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది.
అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఐ టి సి – పి ఎస్ పి డి కాంట్రాక్టర్ పాకాల. దుర్గా ప్రసాద్ హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా మహిళలకు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా పాకాల దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ మహిళకు భరోసా అనే ఒక చక్కని కార్యక్రమం చేపట్టినందుకు నిర్వాహకులను అభినందించారు.అలాగే లబ్ధిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆర్ధికంగా స్థిరపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ చారిటీస్ ఫౌండర్ జర్నలిస్ట్ శేషగిరి నాయుడు, జె.కె. ఫౌండేషన్ ఫౌండర్ పప్పుల జయ, అమ్మ చారిటీస్, భద్రాచలం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ పూసం.
రవి కుమారి, జె.కె. ఫౌండేషన్ కో ఆర్డినేటర్ తాళ్లూరి మారుతి రాణి ప్రకృతి హరిత దీక్ష వ్యవస్థాపకులు నూర్వి రాజశేఖర్,శ్రీకరి బోటిక్స్ రాజేశ్వరి,ధన్వంతరీ వసుంధర తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రకృతి హరిత దీక్ష వ్యవస్థాపకులు రాజశేఖర్ వివిధ మొక్కలు పంపిణీ చేసారు.
అనంతరం రోటరీ క్లబ్ గవర్నర్ డాక్టర్ బూసిరెడ్డి. శంకర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఫంక్షన్ హాల్ ఆవరణలో ఒక మొక్కను నాటడం జరిగింది. అమ్మ ఛారిటీస్ ఫౌండర్ జర్నలిస్ట్ శేషగిరి నాయుడు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలిపారు.