
అవయవదాత కుమార్ స్వామికి కన్నీటి నివాళి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సి కె న్యూస్ మే 3
దేవుడిచ్చిన దేహం మట్టిలో మమేకం కాకముందే తన అవయవాలు అవసరమైన పేదలకు అందాలని అనుకున్నాడు ఆ మహానుభావుడుతాను లోకం విడిచినా పదిమంది నిర్భాగ్యుల మదిలో నిలవాలి అనుకొని ఆలోచన చేసిన తన మెదడే తన మంచితనాన్ని తట్టులేకపోయిందో ఏమో విధి వక్రించింది బ్రెయిన్ డెడ్ కారణంగా ఆకస్మిక మృతి చెందాడు
అశ్వాపురం మండలానికి చెందిన ప్రముఖ టీవీ మెకానిక్,న్యూ ఫ్యాన్సీ నిర్వాహుకులు కుమార్ స్వామి ప్రతీ కుటుంబం బుల్లితెరను వీకిస్తూ నవ్వులు పంచుకునే దిశగా జీవన భృతిని కలిగిన కుమార స్వామి ప్రముఖ టీవీ మెకానిక్ గా ప్రతి ఒక్కరికీ సుపరచితులు అందరితో కలివిడిగా ఉండే కుమార్ స్వామి గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో హైదరాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆకస్మికంగా మృతి చెందారు.
కాగా కుమార్ స్వామి తాను మృతి చెందిన తర్వాత తన శరీర అవయవాలు వృధా కాకూడదని ఉద్దేశంతో తన యుక్త వయస్సులోనే అవయవదానం కై కుటుంబ సభ్యులకు వివరించిన విశిష్టత కుమార స్వామిది, ఆయన మృతి వార్త ప్రతి ఒకరిని కంటతడి పెట్టించింది.
విషన్న వదనాలతో అశ్రు నయనాల నడుమ ప్రతి ఒక్కరూ ఆయన మృతి పై సంతాపం తెలిపారు,కుమార్ స్వామి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని,వారి కుటుంబానికి అశ్వాపురం మండల ప్రజలు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు