
అవినీతి సొమ్ముతో కోట్లకు పడగలేత్తిన BRS పార్టీ మంత్రులు, ఎమ్మెల్యే లపై విచారణ జరపాలి. కోట్ల రూపాయల అవినీతి సంపదను దోచుకుంటున్న ప్రతీ BRS పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల పై విచారణ జర్పలని తెలంగాణ బీజేపీ పార్టీ సూర్యాపేట జిల్ల గిరిజన మోర్చ అధ్యక్షులు శ్రీ ధారవత్ బాల్ సన్ నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ BRS పార్టీ అరాచక పాలనపై ద్వజమెత్తారు.
BRS పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉంటున్న ప్రతీ నాయకులపై ED, CBI తో విచారణ జరపాలని చెబుతూ, అవినీతి సొమ్మును సంపాదించి రెండు నుంచి మూడు వేల ఎకరాలను కర్ణాటక రాష్ట్రంలో కొంటున్నారని ఆరోపించారు.
ఒక పక్క తెలంగాణలో 30లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసిన TSPSC సిబ్బందిపై, చైర్మన్ ను బర్తరఫ్ చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు.
తెలంగాణ BRS పార్టీ ప్రభుత్వానికి వెంటనే ప్రజలు బుది చెప్పి కల్వకుంట్ల కుటుంబ పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గా, మంత్రులు గా ఎన్నిక కాకముందు ఎన్నిక ఐన తర్వత ఎన్నెన్ని ఆస్తులు సంపాదించారు అనే దానిపై CBI ఎంక్వయిరీ చేయించి అవినీతికి పాలుపడ్డ నాయకులు, అధికారులను జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. అది జరిగినప్పుడే బంగారు తెలంగాణకు బాటలు పడతాయి అని అన్నారు BJP సూర్యాపేట జిల్లా గిరిజన మొర్చా అధ్యక్షులు శ్రీ ధారవత బాల్ సన్ నాయక్.