
ఆగని మెడికల్ మాఫియా దందా
మెడికల్ షాపులను తనిఖీ చేయని డ్రాగ్ అధికారులు…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సి కె న్యూస్ ఏప్రిల్ 28
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అశ్వపురం మండలంలో మెడికల్ దందా ఆగడం లేదు.ఇక్కడ మెడికల్ షాపుల వ్యాపారం దందా కొన్ని కోట్ల రూపాయలలో జరుగుతోంది.చిన్న నొప్పి అని మెడికల్ షాప్ కి వెళ్ళితే జేబులను గుల్ల చేస్తున్నారు.ఈమెడికల్ షాపుల దందా వెనుక పెద్ద మెడికల్ మాఫియా ఉందనే ప్రచారం మణుగూరు అశ్వాపురంలో జోరుగా వినపడుతోంది.ఇరవై మూడు రకాల తక్కువ డోస్ ఉన్న కంపినీ మందులను తెచ్చి పేద ప్రజలకు అంటగడుతూ డబ్బులను సొమ్ము చేసుకుంటున్నారు.
మెడికల్ షాపుల యజమానులు విచ్చలవిడిగా పేద ప్రజలను దోచుకుంటున్న సంబంధించిన అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు,ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మండలంలో మెడికల్ షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుంటే అధికారులు మాత్రం వాటిని అడ్డ్డుకట్ట వేయడంలో పూర్తిగా విఫలమౌతున్నారు.కొందరు మెడికల్ షాపుల యజమానులు డబ్బే ముఖ్యమని వ్యవహరిస్తూ ఒక మెడిసిన్ దేనికి వాడుతారో తెలియకుండానే ఇష్టమొచ్చిన రీతిలో మందులను అమ్ముతున్నారు.
ఆమెడిసిన్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే దానికి ఎవరు భాద్యులని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు కొందరు వ్యక్తులకైతే ఏఅర్హత లేకున్నా దర్జాగా మెడికల్ షాపును ఏర్పాటు చేసి దండిగా వ్యాపారం చేస్తున్నారని టాక్.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రతి 10 మందిలో 8 మందికి గ్యాస్ట్రాలజీ సమస్య ఉంటోందని కొందరు వైద్య నిప్పులు చెప్పుతున్నారు.
కొందరు వ్యక్తులు వైద్య నిపుణుల పర్యవేక్షణతో గ్యాస్ట్రాలజీకి సంబంధించి ఫాంటాసిడ్ హెచ్పీ మెడిసిన్ వాడుతుంటే మరికొందరు వ్యక్తులు డాక్టర్ దెగ్గరకు వెళ్లే స్థోమత లేక మెడికల్ షాపుల యజమానుల సలహాతో గ్యాస్ట్రాలజీకి సంబంధించిన మందులను వాడుతున్నారని కొంత సమాచారం.
అయితే ఆదివారం మణుగూరులోని అంబేత్కర్ సెంటర్లో ఓ ఘటన చోటు చేసుకుంది.ఒక వ్యక్తి గ్యాస్ట్రాలజీ సమస్య ఉందని దగ్గరలో ఉన్న ఓ మెడికల్ షాప్ కి వెళ్ళితే ఆమెడికల్ షాప్ వారు ఫాంటాసిడ్ హెచ్పీకి బదులు ఫాంటప్ హెచ్పీ మెడిసిన్ ఇచ్చారు.ఫాంటాసిడ్ హెచ్పీ మెడిసిన్ లేదా అని అడుగుతే రెండు ఒక్కటే..కాకపోతే కంపినీ వేరే అని సమాధానం చెప్పారు.
అంటే మణుగూరులో ఏం జరుగుతుంది అంటే డాక్టర్ రాసిన మందులు దొరకడం లేదు.అలాంటి సేమ్ మందులు అంటే వేరే కంపినీ మందులు తీసుకువచ్చి అంటగడుతున్నారు.కానీ ఇక్కడ దందా ఏంటంటే డాక్టర్ రాసిన మందులకు ఒకే ధర,మెడికల్ షాపుల యజమానులు ఇచ్చే వేరే కంపినీ మందులు కూడా ఒక్కటే ధర.మెడికల్ షాపుల యజమానులు వేరే రాష్ట్రాల నుంచి తక్కవ ధరకు మందులు తెచ్చి మణుగూరులో ఎక్కవ ధరకు అమ్ముతున్నరనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం మణుగూరులో ఈరకమైన మెడికల్ దందా జరుగుతోందని తెలుస్తోంది.
డ్రగ్ అధికారులు మెడికల్ షాపులయజమానుల కనుసన్నల్లోనే నడుస్తున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పటికైనా ఈ అక్రమ దందా ను అరికట్టాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు