Telangana

ఆడపిల్లలను కడుపులోనే ఖతం చేసే దుర్మార్గులను శిక్షించండి

ఆడపిల్లలను కడుపులోనే ఖతం చేసే దుర్మార్గులను శిక్షించండి
జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్

ఆడపిల్ల పుట్టొద్దా! అసలు బతకొద్దా!?

నిత్యం వేల సంఖ్యలో అబార్షన్లు?
‘ఆడపిల్ల పుట్టొద్దా! అసలు

బతకొద్దా!?

`కడుపులో పడడమే ఆడపిల్ల

చేసుకున్న నేరమా?

` విచ్చలవిడిగా కొనసాగుతున్న బ్రూణ హత్యలపై కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న కన్నీటి లేఖ

‘కొంతమంది దుర్మార్గులు జైలుకెళ్లొచ్చినా ఆపని వ్యాపారం?

‘లక్షలకు లక్షలు వసూలు?

‘అబార్షన్ వికటించి, ఎందరో మహిళల ప్రాణాలు బలి ?

గర్భిణీ మహిళల జీవితాలను చిన్నబిన్నం చేస్తున్నది ఎవరు ?

‘పురిటిలోనే ఆడపిల్లలను ఆగం

చేస్తున్నారు?

బృణ హత్యలు…ఇంకా ఎంత కాలం విందాం…ఎంత కాలం చెప్పుకుందాం… ఇంకా ఏ ఆటవిక సమాజంలో బతుకుతున్నాం….? రాజుల కాలం నుంచి వింటూనే వున్నాం… ఇంకా భ్రూణ హత్యలు చేస్తూనే వున్నాం… ఇంకెంత కాలం… ఆడ.. మగ తేడాలు…! ఆడపిల్ల పుట్టడమే నేరమా? ఆడపిల్ల కడుపులో పడడమే శాపమా? ఆడ పిల్ల పుట్టొదా? పుట్టినా బతుకొద్దా? బతికి రేపటి తరానికి దారి చూపొద్దా… ఈ ప్రపంచానికి మానవ మనుగడను అందించించొద్దా?
అని అభ్యుదయ వాది ,ప్రజాతంత్ర ఉద్యమకారుడు కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పౌర సమాజాన్ని ప్రశ్నిస్తూ నేడు ఒక బహిరంగ లేఖ పంపారు.

ఒక జీవినిచంపే హక్కు ఎవరికీ లేదు? మూగ జీవాలను చంపడమే నేరమైన మన సమాజంలో కళ్లు తెరవని పసిగుడ్డును కర్కషంగా అత్యంత ఫాషవికంగా చిద్రం చేయడానికి మనసెలా వస్తోంది? ఒక ఆడపిల్లను చంపడం అంటే అమ్మను చంపడం కాదా? అమ్మలేకుండా ఈ సృష్టి వుంటుందా? ఈ సృష్టిలో అమ్మలేకుండా ఏ జీవైనా పురుడుపోసుకుంటుందా? అని నాగరిక సమాజాన్ని కామ్రేడ్
జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న ప్రశ్నించారు.

సృష్టికి మూలమైన అమ్మనే పురిటిలోనే నులిమి, నలిపి చంపడం పాపం కాదా? ఆపదలు వస్తే అమ్మా అనికొలుస్తాము…అడ్డంకులు ఎదురైతే దేవతలకు పూజలు చేస్తాము.. కాని ఆడపిల్ల మన ఇంట్లో పుడుతుంటే వద్దనుకుంటాము? మగ సంతామనే కావాలి…ఎంత మంది మగాళ్లు పుట్టిన ఫరవాలేదు…కాని ఆడపిల్ల మాత్రం వద్దనుకునే సమాజం, తనను తానే నాశనంచేసుకుంటోంది…. అని ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేశారు.

బృహత్యలు చట్టరిత్యా నేరం మాత్రమే కాదు …పెద్ద పాపం కూడా అని పేర్కొన్న ప్రధానేస్తం
జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న

………..

మన దేశంలో గర్భస్ధ లింగనిర్ధారణ పరీక్షలు చట్టరిత్యా నేరం. పిసి.పిఎన్ఎటి. ఆక్ట్ 1994 ప్రకారం గర్భధారణ, పూర్వ గర్భస్థ పిండ నిర్ధారణ పరీక్షలు చేసే వారికి, చేయించుకునే వారికి కూడా శిక్షలున్నాయి. మూడు సంవత్సరాలు కఠిన కారాగారా శిక్ష, రూ.50వేలు జరిమానా విధిస్తారు. ఇవే కాకుంగా లింగనిర్ధారణ పరీక్షల విషయంలో వరకట్న వ్యతిరేక శాసనాలు…నిశేద చట్టం 1961 ప్రకారం లింగనిర్ధారణ పరీక్షలు నేరం. అమాయక ప్రజల
బలహీనతలను ఆసరాగా చేసుకొని, ప్రాణాలు నిలపాల్సిన డాక్టర్స్, నర్సులు, ఆయమ్మల చేతులతో ప్రాణాలు తీస్తున్నారనీ ప్రతిక్షణం ప్రజాహితాన్ని కాంక్షించే ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న కన్నీరు పెట్టుకున్నారు.

ఆడ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఓ వైపు పెద్ద ఎత్తున పెట్టుబడిపెట్టి పెద్ద పెద్ద ఆసుపత్రులు ఏర్పాటు చేసుకున్న వాళ్లు, మరో వైపు వైద్యం సరిగ్గా తెలియకపోయినా డాక్టర్లుగా చెలమణీ అయ్యేవాళ్లు ఓ రాకెట్గా ఏర్పాడి ఈ దుర్మాగర్గం నెరుపుతున్నారనీ.. మహిళా పక్షపాతి ,స్త్రీ జన చైతన్య శీల్పీ, కామ్రేడ్
జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న ఆరోపించారు.

ప్రజల బలహీనతలతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ కోట్లాది రూపాయల ప్రాణం ఖరీదు వ్యాపారంసాగిస్తున్నారు. నేరాలకు

పాల్పడుతున్నారు. కోట్లాది రూపాయల వైద్యం దందా భృణహత్యల పేరిట కొనసాగుతుందంటే, అమ్మ కడుపులోనే ఆడపిల్లల హత్యల వ్యాపారం మాఫియాగా మారి నడుస్తోందంటే వైద్య వృత్తి ఎంత
దిగజారిపోయిందో అర్ధం చేసుకోవచ్చునని నూతన ప్రజాతంత్ర సామ్యవాద సమాజ స్వప్నికుడు కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారు.

లింగనిర్ధారణ పరీక్షలు చేయడమే నేరమైనప్పుడు తప్పని పరిస్థితుల్లో చేయొచ్చన్న చిన్న లొసుగును కూడా వాడుకుంటూ ఇలా ఆడపిల్లల జీవితాలు పిండ దశలోనే పిసికేస్తున్నారు..పాపాలు మూటగట్టుకుంటున్నారు.
ఇప్పటికే ఇద్దరమ్మాయిలున్నావారు ఆ ఇద్దరితో ఆ జంట సరిపెట్టేకుంటే బాగుండేది. కాని కొడుకు కావాలి. పున్నామన నరకం నుంచి బైట పడేయాలన్న మూఢ నమ్మకం మన దేశంలో ఎంతో మంది జీవితాలను అర్ధాంతరంగా తనువు చాలించేలా చేస్తోంది. మరోసారి గర్భం దాల్చిన అమ్మాయికి లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించి దాంతో మళ్లీ ఆడపిల్ల అని తేలితే… అప్పటికే సమయం కూడా మించిపోయినా ఆ పిండంవుంచుకోకూడదని ఆ కుటుంబం భావించింది? కాసుల కక్కుర్తి కోసం ఎలాంటి ఆబార్లన్లైనా చేయగలిగిగే వాళ్లు కూడా మన దేశంలో వైద్యం సేవా తూర్పుగోదావరి నుండి మారిపోయి మాఫీగా తయారై నేడు అమ్మ కడుపులోనే ఆడపిల్లలను హత్యలు చేసే కిరాతకులుగా కొంతమంది స్వార్థపర డాక్టర్లు
తయారయ్యారు.
అని అనుదినం జనస్వరమై ప్రజా సమస్యలపై ప్రతిక్షణం తనదైన రీతిలో స్పందించే సామాజిక ప్రజాతంత్ర ఉద్యమకారుడు
జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.

వైద్య వృత్తిని అడ్డం పెట్టుకొని అడ్డమైన పనులు చేస్తున్న కొంతమంది డాక్టర్లపై నర్సులపై బ్రోకర్లపై క్రిమినల్ కేసులు నమోదై వున్నాయి. అనేక సార్లు వారు జైలుజీవితం కూడా అనుభవించిన… అయినా సరే ఇలాంటి భ్రూణ హత్యలు చేయడం ఆపడం లేదనీ సంఘసంస్కర్త సామాజిక ఉద్యమకారుడు
జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.

కొన్ని సార్లు ఈ ఆఫరేషన్ వికటించి, తల్లి ప్రాణాలు కూడా కోల్పోయేందుకు కారణం కావడం జరుగుతూనే వుంది. నిపుణురాలుకానివారు, వైద్య విద్యతో సంబంధం లేకపోయినా అనేకమంది బ్రోకర్స్ అనేక ఆసుపత్రులతో సంబంధాలు పెట్టుకుని ఇలా ఇటువంటి కేసులు ఆయా ఆసుపత్రులకు పంపించడం మేలుజరిగితే ఆయా కుటుంబాలనుంచి లక్షలు వసూలు చేయడం అలవాటు చేసుకున్నారు. ఒక వేళ ఏదైనా ఆపరేషన్లో తేడా జరిగి, మహిళల ప్రాణాలు కోల్పోతే వారికి నష్ట పరిహారం చెల్లించి మరీ కేసులు నమోదు కాకుండా

చూసుకుంటున్నారు. నిత్యం వేల సంఖ్యలో అబార్షన్లు చేసుకుంటూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు.. అని ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు.
ప్రైవేటు ఆసుపత్రులతో కలిసి వాటాలు పంచుకుంటున్నారు. ఏటా కొన్ని కోట్ల రూపాయాల నేరమైనదందాను సాగిస్తున్నారు.
అని సుభాషన్న తెలిపారు.

ఇటీవల వరంగల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన వివరాల్లోకి వెళితే ఓ మహిళకు సదరు నేరస్థురాలైన వైద్యురాలు ఆపరేషన్ చేసి పిండాన్ని తీసే ప్రయత్నం చేశారు? ఏం జరిగిందో గాని రక్త స్రావం ఎక్కువ కావడంతో ఆమెను వరంగల్ లోని ఓ పేరు మోసిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఎంతో రక్తం పోయిన మహిళకు ఆ ఆసుపత్రిలో వైద్యం చేస్తున్న క్రమంలో గుండెకు సంబంధించిన సమస్య ఎదురైంది?దాంతో వెంటనే తేరుకున్న ఆ ఆసుపత్రినుంచి ఆ మహిళను మరో ఆసుపత్రికి తరలించారు. కాకపోతే అక్కడ చికిత్స అందుతున్న సమయంలోనే ఆ మహిళ ప్రాణాలుపోయాయి. దాంతో గుట్టు చప్పుడు కాకుండా ఆ మహిళను పంపించేసి ఆసుపత్రులు, వైద్యురాలి ముసుగులో వున్న కిలేడి చేతులు దులుపుకున్నారు… ఒక నిండు ప్రాణం బలి తీసుకున్నారు. మొగ్గలోనే ఓ పసి ప్రాణాన్ని తుంచేశారు…ఇద్దరు అమ్మాయిలను అనాధలను చేశారు…?ఇప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిలకు దిక్కెవరు? ఓ అమాయపు జంట ఆశలను ఆసరాగా చేసుకొని ఇప్పటికే ఇద్దరు పిల్లలున్న తల్లికి నిర్లక్ష్యంగా వైద్యం చేసి, పిండాన్ని తీసేసే క్రమంలో ఆమె ప్రాణం తీశారు. ఇద్దరు అమ్మాయిలు అనాధలను చేశారు.. వారి ఆలనా,పాలనా ఎవరు చూస్తారు? వారి జీవితాలకు ఎవరు భరోసా కల్పిస్తారు.. అని ప్రజా నేస్తం
జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న కన్నీరు పెట్టుకున్నారు.

సహజంగా ఇలాంటి సందర్భంలో ఏ డాక్టరైనా కడుపు తీయించుకోవడం నేరమన్న సంగతైనా చెప్పాలి.
ప్రాణాలు నిలిపే
సంగతైనా చెప్పాలి. ఒక ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదని వారిలో వైద్య వృత్తిలో వుంటూ కాసులకు కక్కుర్తి పడే వాళ్లు తయారు కావడంతో ఇలాంటి దుర్మార్గాలు దర్జాగా సాగుతున్నాయి. ఎక్కడో ఒకటి వెలుగులోకి వస్తున్నా, వాటిని కరెన్సీ కట్టల మాటున

దాచేస్తున్నాయి. వైద్య శాఖ ఏం
చేస్తోంది? నిద్ర పోతోందా?
ఇలా భ్రూణ హత్యలు విచ్చలవిడిగా జరుగుతుంటుంటే, అమాయాకుల ప్రాణాలు తోడేస్తుంటే, కడుపులోనే పిండాలను చిదిమేస్తుంటే ఏం చేస్తున్నారు. అని వైద్యశాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు.

ఇప్పటికైనా దోషులను గుర్తించండి. తప్పు చేసిన వారిని పట్టుకోండి. నేరం చేసిన వారిపై కేసులు నమోదు చేయండి. అన్యాయం పాలైనా ఆ కుటుంబాన్ని ఆదుకోండి. భవిష్యత్తులో భ్రూణ హత్యలు చేయడానికి ఏ డాక్టరైనా భయపడేలా చర్యలు తీసుకోండి…హెచ్చరికలు జారీ చేయండి. ఇంతటి దుర్మార్గానికికారణమైన ఆసుపత్రుల లైసెన్సులు

రద్దు చేయండి? వైద్యలు లైసెన్సులు కూడా సస్పెండ్ చేయండి? ఆసుపత్రులమీద నిరంతర నిఘా ఏర్పాటు చేయండి.. అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు.
ఆడపిల్లను బతికించండి…!
ఆడపిల్లలను ఎదగనివ్వండి ఆడపిల్లలను కడుపులోనే ఖతం చేసే దుర్మార్గులను కఠినంగా శిక్షించండి అని ప్రభుత్వాలను ప్రజా అభ్యుదయవాది కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ బహిరంగ లేఖ లో 9848540078 డిమాండ్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected