
ఆదివాసి కార్యదర్శి పై దాడి చేసిన బిఆర్ఎస్ నాయకులు ప్తె కేసులు నమోదు చేయాలి: భారతీయ జనతా పార్టీ వెంకటాపురం
సి కే న్యూస్ ములుగు జిల్లా నూగుర్ వెంకటాపురం మండలం ప్రతినిధి ప్రశాంత్.
మే10.
వెంకటాపురంమండలం లో బీజేపి మండల కమిటీ సమావేశంలో బీజేపి గిరిజన మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకూరి సతీష్ కుమార్,ఎంపీపీ మాట్లాడుతూ ములుగులో జూనియర్ పంచాయతీ కార్యదర్సుల నిరసన కార్య్రమం ముగించుకొని ఇంటికి వెళ్తున్న ఆదివాసీ కార్యదర్శులపై కొంతమంది బిఆర్ఎస్ నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు,
తెలంగాణ వస్తే బ్రతుకులు మారతాయి అని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో తెలంగాణ రాకముందు కాంట్రాక్ట్ ఉద్యోగులు లేకుండా చేస్తానన్న కెసిఆర్ నిరుద్యోగులు పరీక్షలు వ్రాసి ఒప్పందం ప్రకారం ఉద్యోగం లో చేరిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఒప్పంద కాలం ముగియటంతో అసెంబ్లీ సాక్షిగా రెగ్యులర్ చేస్తానని ప్రకటనలు చేసినా ముఖ్యమంత్రి నేటికీ రెగ్యులర్ చేయకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో సమ్మెకు పిలుపునిచ్చిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సంఘీభావం తెలపడానికి వచ్చినవారు ప్రభుత్వముపై విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు చేసేది పొయ్యి అమాయక ఆదివాసీ కార్యదర్శుల పై బిఆర్ఎస్ పార్టీ పదవుళ్ళల్లో ఉన్న గుండాలు, కార్లో ఇంటికి వెళ్తున్న వ్యక్తులను అడ్డుకొని బయటికి లాగి ఇష్టమొచ్చినట్టు కొట్టడం దారణం అన్నారు,
అధికార మదంతో,అమాయక ఆదివాసీ కార్యదర్శుల పై రౌడీయిజం చేసి కొట్టిన బిఆర్ ఎస్ నాయకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల నాయకులు రామేల్ల రాజశేఖర్, హేమ సుందర్,ఈశ్వరావు తదితరులు పాల్గొన్నారు