
ఆదుకోవాల్సిన ప్రభుత్వం ధర్నా చేస్తే ఎలా
చిత్తశుద్ధి ఉంటే ఆ సబ్సిడీ ధరలు ప్రభుత్వం భరించాలి
బిఆర్ఎస్ ప్రభుత్వ ఆందోళనలు సిగ్గుచేటు
టిపిసిసి సభ్యులు నాగా సీతారాములు
సి కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
మార్చి 03 కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధర పెంచితే అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని, ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి దొంగే దొంగ దొంగా అని అరుస్తున్నట్టు ఉందని ప్రభుత్వ ధర్నాలతో పొలిటికల్ మైలేజ్ రాదని టిపిసిసి సభ్యులు నాగా సీతారాములు ఎద్దేవా చేశారు. కేంద్రం విధించిన భారాన్ని తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం రోడ్డెక్కి ఆందోళనలు చేయడం సిగ్గుమాలిన పని అంటూ నాగా సీతారాములు అన్నారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు సిలిండర్లను పెట్టుకొని ఆందోళనలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చేతగాని తీరును స్పష్టం చేస్తుందని అన్నారు. అప్పట్లో కేంద్రం సిలిండర్ ధర పెంచితే వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ పెను భారాన్ని మోసి ప్రజలకు సిలిండర్ ధర తగ్గించి ఇచ్చిన సంఘటన ఒకసారి అదికార పార్టి నాయకులు గుర్తు చేసుకోవాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం లోపల ఒక్కటే.. బయట వేరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. ప్రజలకు భారాన్ని తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మసలుకోవాలే తప్ప ఇలా బహిరంగంగా ఆందోళనలు చేపట్టి ఏం ఉద్ధరించారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవలంబిస్తున్న తీరును రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎండగడతారని ఆయన అన్నారు. అధికార పార్టీ పొలిటికల్ మైలేజీ కోసం డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు సిలిండర్ ధర తగ్గించాలని.. చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వమే ఆ సబ్సిడీ ధరలు భరించాలని డిమాండ్ చేశారు.