
Telangana: తలసానిపై రేవంత్ వ్యాఖ్యలకు భగ్గుమన్న గొల్ల కురుమలు..ఇందిరాపార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యాదవ సంఘాలు భగ్గుమన్నాయి.
ఈ మేరకు గురువారం గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా ముందుగా ఇందిరాపార్క్ వద్ద ఆందోళన చేపట్టిన యాదవ జేఏసీ ర్యాలీగా గాంధీభవన్ కు బయలుదేరారు. ఈ క్రమంలో గొల్లకురుమలను ఇందిరాపార్క్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీనితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో యాదవ సంఘాల సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పాలని యాదవ జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఒక యాదవుల గాంధీభవన్ ముట్టడితో పోలీసులు అప్రమత్తమయ్యారు. గాంధీభవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బారిగేడ్లు ఏర్పాటు చేసి ఎవరినీ కూడా అటు వైపుగా రాకుండా చూస్తున్నారు. అయితే ఇందిరాపార్క్ వద్దే పోలీసులు గొల్లకురుమలను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనితో గాంధీభవన్ (Gandhibhavan) వద్ద ఉన్న బలగాలు అప్రమత్తమయ్యాయి.
కాగా కేసీఆర్ కాళ్లు పిసికినంత సులభం కాదు తనను పిసకడమంటే అని తలసానిపై రేవంత్ మండిపడ్డారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ చాలా కాలం దున్నపోతుల కాశారని..ఆ సమయంలో పెండ పిసికి పిసికి..ఇప్పుడు పిసికేస్తానని మాట్లాడుతున్నాడని రేవంత్ (Revanth Reddy) మండిపడ్డారు. పాన్ పరాగ్ తినే తలసాని తన గురించి మాట్లాడుతున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ చెప్పులు మోసినా కూడా తలసాని తనలాగా అధ్యక్షుడు కాలేడని రేవంత్ అన్నారు. దున్నపోతులను కాసిన తలసాని..వాటితో తిరిగి ఆయన కూడా దున్నపోతు అనుకుంటున్నారని రేవంత్ (Revanth Reddy) ఎద్దేవా చేశారు.
అరటి పండ్ల బండి వద్ద పాన్ పరాగ్ లు నమలడం మానుకోవాలని తలసానికి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సూచించారు. ఇలాంటి వ్యక్తి తనను విమర్శించడం ఏంటని అన్నారు. ప్రజాప్రతినిధులుగా యువతకు ఆదర్శంగా ఉండాలని తలసానికి రేవంత్ సూచించారు.
మంత్రిగా తన బాధ్యతలని తలసాని గుర్తుంచుకోవాలని రేవంత్ (Revanth Reddy) అన్నారు.
అయితే రేవంత్ వ్యాఖ్యలు తమ జాతిని కించపరిచేలా ఉన్నాయని యాదవ సంఘాలు మండిపడుతున్నాయి. దీనిపై రేవంత్ క్షమాపణ చెప్పాలని రేవంత్ కు రెండుసార్లు డెడ్ లైన్ విధించారు. కానీ రేవంత్ రెడ్డి స్పందించకపోవడంతో గాంధీభవన్ ముట్టడికి గొల్లకురుమలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం ఇందిరాపార్క్ వద్ద హైటెన్షన్ నెలకొంది.