
ఈతకు వెళ్లి అన్నదమ్ముల మృతి
హన్మకొండ :ప్రతినిధి
హన్మకొండ: మే 25
హన్మకొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ధర్మసాగర్ మండలం రాంపూర్ లోని చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు అన్నదమ్ములు గురువారం రోజు మృతి చెందారు. చెరువులో మునిగిపోయిన పిల్లలను స్థానికులు బయటకు తీశారు. అప్పటికే పిల్లలు చనిపోవడంతో వారి తల్లిదండ్రులతోపాటు గ్రామస్థులు సైతం కన్నీరు మున్నీరయ్యారు.
మృతులు ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన గొర్రె రిషి(11), రిత్విక్(9)గా గుర్తించారు. రాంపూర్ గ్రామంలో బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లినట్లు తెలుస్తోంది. మే 24వ తేదీ బుధవారం బంధువుల పెళ్లికి వెళ్లగా ఈరోజు సాయంత్రం చెరువులోకి స్నానానికి వెళ్లిన అన్నదమ్ములు చెరువులో పడి మృతి చెందినట్లు తెలిసింది….