ఈత సరదా విషాదం కాకూడదు

– – – ఈత సరదా విషాదం కాకూడదు.
– – – తల్లిదండ్రులు తమ పిల్లలను జలాశయాల, చెరువులు,కాలువలు, కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్త లు తీసుకోవాలి.
– – – పోలీసువారి ఆద్వర్యం లో గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు జలాశయాల వద్ద హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలి.
వేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో ఎంతో మంది పిల్లలు యువకులు ఎండ వేడి నుంచి సేద తీరటానికి, ఈత నేర్చుకోవడానికి జలాశయాల వద్దకు ఈతకు వెళ్లే అవకాశం ఉన్నందున ఇట్టి క్రమంలో ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణ నష్టం జరుగుతుండటం వలన అందరూ ఇట్టి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈత సరదా విషాదం కాకూడదు జిల్లా ఎస్పీ శ్రీ ఎగ్గిడి భాస్కర్ గారు సూచించారు. ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని ఈత ను నేర్చుకునే వారు వారి తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకోవాలని సూచించారు. ముఖ్యముగా తల్లిదండ్రులు తమ పిల్లలను జలాశయాల వద్దకు చెరువుల వద్దకు కాలువల వద్దకు కుంటలు వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అదేవిధంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధుల జలాశయాల వద్ద హెచ్చరిక సూచికలను ఏర్పాటు చేసి రానున్న కాలంలో ఎటువంటి ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.