
పేపర్ లీకులకు భాద్యత ఎవరు ?
లీకుల పై ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా?
యూత్ కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ పై తీవ్ర ఆగ్రహం
వరంగల్ జిల్లాలో మరో హిందీ పేపర్ లీక్ పై ధ్వజం
వైరా టీపీసీసీ సభ్యులు ధరావత్ రామ్మూర్తి నాయక్
సి కె న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 04,
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నిరుద్యోగుల, విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని, ఇదేమని ప్రశ్నించే వారిని ద్రోహులుగా చూస్తున్నారని రామ్మూర్తి నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలుకు పంపుతున్నారని యూత్ కాంగ్రెస్ నాయకులని రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా జైల్లో పెట్టిందని విమర్శించారు. టిపిఎస్సిపి పేపర్ లీకేజీ ఘటన తర్వాత వికారాబాద్ జిల్లాలో పదవ తరగతి పరీక్షా పత్రం లీకేజీ అయిందని, దీనిపై పదవ తరగతి బోర్డు ముందు ఆందోళన చేసిన యూత్ కాంగ్రెస్ విషయంలో తప్పిదాలను సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిందని ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా మళ్ళీ వరంగల్ జిల్లాలో పదవ తరగతి హింది ప్రశ్న పత్రం లీకేజీ అయ్యిందని అన్నారు. అసలు ఈ ప్రభుత్వం లీకుల ప్రభుత్వం అని అన్నారు. వరుస లీకులతో ప్రజల జీవితాలతో, విద్యార్థుల, నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. వరుస లీకేజీలపై బాధ్యత వహించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అరెస్టు చేసినంత మాత్రాన తమ పోరు ఆగదని యూత్ కాంగ్రెస్ నాయకులను 7 రోజులపాటు రిమాండ్ కు తరలించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కుట్రకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.