ఉపాధ్యాయుడు పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి

విద్యార్థునులను అసభ్య పదజాలంతో దూషించిన ఉపాధ్యాయుడు పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి
-సేవాలాల్ సేన జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ రాథోడ్
సి కె న్యూస్ ప్రతినిధి జూలూరుపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని జడ్.పి.ఎస్.ఎస్. పాపకొల్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు ఎస్.ఏ. ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న ఎస్ రామారావు గిరిజన విద్యార్థునులను అసభ్య పదజాలంతో దూషించి, బాలికలని కూడా చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తించి,వారిని భయాందోళనకు గురి చేయడం బాధాకరమని,చదువు,సంస్కారం, క్రమశిక్షణ నేర్పించి మంచి మార్గాన్ని చూపించవలసిన ఉపాధ్యాయుడే కూతురు స్థానంలో ఉన్నటువంటి బాలికలతో దురుసుగా ప్రవర్తించి, వారిని మానసికంగా మనోవేదనకు గురి చేయడం గోరాతి ఘోరమని అలాంటి బుద్ధి సంస్కారం లేనటువంటి ఉపాధ్యాయుడిని తక్షణమే సస్పెండ్ చేసి,చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, లేనియెడల గిరిజన సంఘం ఆధ్వర్యంలో భారీ ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ రాథోడ్ హెచ్చరించరు