KhammamPoliticsTelangana

ఉపేందర్ కుటుంబానికి అండగా కాంగ్రెస్ పార్టీ

ఉపేందర్ కుటుంబానికి అండగా కాంగ్రెస్ పార్టీ

భరోసా ఇచ్చిన మహిళ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి

సి‌కే న్యూస్ ప్రతినిధి పాలేరు

కూసుమంచి మండలం, నాయకన్ గూడెం కు చెందిన రైతు పోలెబోయిన ఉపేందర్ తండ్రి వెంకన్న భూ వివాదం లో గ్రామ సర్పంచ్ వేధింపులు తాల లేక హాత్మ హత్య యత్ననికి పాల్బడి ఖమ్మం లోని సుజాత ఆసుపత్రి లో ప్రాణాపాయ స్థితిలో వైద్యం పొందుతున్నాడు.
విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి ఆసుపత్రి కి వెళ్లి ఉపేందర్ ను పరామర్శించి వైద్యుల ను ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని ఉపేందర్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ సందర్భం గా మాధవీ రెడ్డి మాట్లాడుతూ తెరాస (బి ఆర్ ఎస్) అధికారం లోకి వచ్చాక సామాన్య ప్రజల, రైతుల పైన వేధింపులు ఎక్కువ అయ్యాయని తెరాస నాయకులు అధికార మదం తో సామాన్య మధ్య తరగతి ప్రజలు స్వేచ్ఛ గా బ్రతకటమే కష్టం అయిందాన్నారు. ఉపేందర్ ఒక చిన్న రైతు అని 2 సంవత్సరాల నుంచి తన భూమిని కాపాడుకోవటానికి స్థానికి సర్పంచ్ తో న్యాయపోరాటం చేసి చివరకు తట్టుకోలేని పరిస్థితి లో ఆత్మ హత్యకు ప్రయత్నించి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితి లో ఉన్నాడని, ఇప్పటికి అయినా స్థానిక mla అధికారులు స్పందించి ఉపేందర్ కుటుంబానికి న్యాయం చేసి ఆ కుటుంబాన్ని సర్పంచ్ వేధింపుల నుంచి కాపాడి వారికి న్యాయం చెయ్యాలని, లేని పక్షం లో ఉపేందర్ కుటుంబానికి అండగా కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటానికి సిద్ధం అవుతుందని హెచ్చరించారు. మాధవీ రెడ్డి గారి తో పాటు కూసుమంచి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బండారుపల్లి శ్రీనివాస రావు, యువజన కాంగ్రెస్ మండల నాయకుడు బానోత్ కిరణ్ నాయక్, కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు బత్తుల అంజయ్య తదితరులు ఉపేందర్ ను పరామర్శించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected