
ఎంజీఎం సూపరింటెండెంట్ ను వెంటనే అరెస్ట్ చేయాలి
వరంగల్:
ఎస్సి ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మెంబర్ నునావత్ జవహర్ లాల్.
ఇటివల నాచిన పల్లి గ్రామానికి చెందిన కాసు రాములు… ఆక్సిడెంట్ లో కాలు గాయమై.. ఎంజీఎం లో జాయిన్ అవ్వగా.. అనుభవం లేని స్టాఫ్ నర్స్ ల ద్వారా చికిత్స ను అందించి.. ఇంజక్షన్ ఇవ్వడంతో..మరణించారు… ఈ ఘటన పై.. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరగా.. ఎంజీఎం సూపరింటెండెంట్ కులం పేరుతో దూషించడం మూలంగా… గుగులోతు తిరుపతి ఎంజీఎం సూపరింటెండెంట్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. అనంతరం సోమవారం.. నాడు సూపరింటెండెంట్ చంద్ర శేఖర్ గారూ.. గుగులోతు తిరుపతి, అజ్మీరా వెంకట్, మాళోతు విజయ్ అండ్ అదర్స్ లపై..353 సెక్షన్ కింద కేసు పెట్టడం ఎంత వరకు సమంజసం అని అన్నారు.
ఎంజీఎం ఎన్నో ఘటనలు జరిగాయి.. సుపరిండెంట్ నిర్లక్ష్యం మూలంగా ఎన్నో ప్రాణాలు గాలిలో కలిశాయి.
సుపరిండేంట్ ను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాలని ఎస్సి ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మెంబర్ నునావత్ జవహర్ లాల్ డిమాండ్ చేశారు.ఈ కార్య క్రమం లో ఎల్ ఎచ్ పి ఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జాటోతు కిషన్ నాయక్, జీ బి ఎస్ ఎస్ ఎస్ అద్యక్షులు బాలాజీ నాయక్, సునిల్ నాయక్, ఫణి నాయక్, వినెష్ నాయక్, వెంకట్ నాయక్ శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.