
ధర్మపురి ఎన్నిక ఫలితాలు రోజుకో మలుపు
ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగుల గొట్టిన అధికారులు
జగిత్యాల జిల్లా :
ధర్మపురి ఎన్నిక ఫలితాలు రోజుకో మలుపు
ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కోర్టుకెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థి అడ్లురి లక్ష్మన్ కుమార్
కలెక్టర్ యాస్మిన్ బాషా ఆధ్వర్యం లో అన్ని పార్టీల అభ్యర్థుల సమక్షంలో నూకపల్లిలోని వీఆర్కే ఇంజినీరింగ్ కాలేజ్ లోని స్ట్రాంగ్ రూంలకు వేసిన లాక్ ను పపగలగొట్టి ఓపెన్ చేసిన ఎలక్షన్ అధికారి, కలెక్టర్ యస్మీన్ భాషా
ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగుల గొట్టిన అధికారులు
జగిత్యాల జిల్లాలోని ధర్మపురి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను అధికారులు తెరిచారు. ఏప్రిల్ 23వ తేదీ ఆదివారం ఉదయం 11గంటలకు మల్యాల మండలం నూకపల్లి VRK కాలేజీలోని ఈవీఎం స్ట్రాంగ్ రూముల తాళాలను అధికారులు పగులగొట్టారు.
ధర్మపురి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తాళాలు మిస్ అవ్వడంతో హైకోర్టు ఆదేశాలతో స్ట్రాంగ్ రూమ్ తాళాలను అధికారులు పగులగొట్టారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష,ఎన్నికల అబ్జర్వర్ అవినాష్ కుమార్ అధ్వర్యంలో రికౌంటింగ్ విచారణ కొనసాగుతోంది.
ధర్మపురి ఎన్నికల్లో పోలైన ఓట్లకు.. ప్రకటించిన ఓట్ల మధ్య వ్యత్యాసం ఉందని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
హైకోర్ట్ ఆదేశాలతో ఎన్నికల అధికారులు డాక్యుమెంట్లు స్కానింగ్ చేసి నివేదిక ఇవ్వనున్నారు. ఈనెల 26న హైకోర్టుకు నివేదిక అందించే అవకాశం ఉంది. అయితే అధికారుల నివేదికలో 17 సి డాక్యుమెంట్లు ఫామ్ కీలకం కానున్నాయి.
17సీ ఫామ్ లో నమోదు చేసి ఓట్ల సంఖ్య ఈవీఎంలో నమోదైన ఓట్లతో ట్యాలీ కావాల్సి ఉంది. టోటల్ ఓట్లతో పాటుగా పోలైన ఓట్లు, అభ్యర్థులకు వచ్చిన వివరాలన్నీ 17సి డాక్యుమెంట్లో ఉంటాయి.