Telangana

ఎస్సై, కానిస్టేబుల్ ఫలితాలు విడుదల

ఎస్సై, కానిస్టేబుల్ ఫలితాలు విడుదల

ఎస్సై, కానిస్టేబుల్ ఫలితాలు విడుదల

TS: కానిస్టేబుల్, SI తుది రాతపరీక్ష ఫలితాలను TSLPRB విడుదల చేసింది. సివిల్, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 98,218 మంది ఎంపికయ్యారు. ఐటీ, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులకు 4564 మంది ఎంపికయ్యారు. సివిల్ ఎస్ఐ పోస్టులకు 43,708 మంది ఎంపికయ్యారు. అభ్యర్థులు ఫలితాల కోసం tslprb.in సైట్ చెక్ చేసుకోవచ్చు. OMR ఒరిజినల్ షీట్లు ఈరోజు రాత్రి నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉండనున్నాయి.

పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రిలిమ్స్, ఈవెంట్స్, తుది రాత పరీక్షలు నిర్వహించారు. ఇక మిగిలింది ఫలితాల విడుదలే. ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఫలితాలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు టీఎస్ఎల్‌పీఆర్‌బీ ప్రకటించింది. అయితే ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ తుది రాత పరీక్షల్లో 84.06 శాతం మంది అర్హత సాధించినట్లు టీఎస్ఎల్‌పీఆర్‌బీ వెల్లడించింది. ఈ పోస్టులకు సంబంధించి తుది రాత పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను టీఎస్ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో నేటి రాత్రి నుంచి అందుబాటులో ఉంచనున్నారు.

అభ్యర్థుల మార్కులు నేటి రాత్రి నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని టీఎస్ఎల్‌పీఆర్‌బీ వెల్లడించింది. ఫైనల్ కీ, ఓఎంఆర్ షీట్లు వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు అవకాశం కల్పించారు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు రూ. 2 వేలు, ఇతర కమ్యూనిటీలు, నాన్ లోకల్ అభ్యర్థులు రూ. 3 వేలు చెల్లించి రీ కౌంటింగ్, రీవెరిఫికేషన్ చేసుకోవచ్చని సూచించారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ప్రక్రియ జూన్ 1వ తేదీ ఉదయం 8 గంటల నుంచి జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ సివిల్, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్, ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 98,218(90.90 శాతం), ఎస్‌సీటీ ఎస్ఐ సివిల్ పోస్టులకు 43,708(75.56 శాతం), ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ ఐటీ అండ్ సీవో ఉద్యోగాలకు 4,564(74.84 శాతం), ఎస్‌సీటీ ఎస్ఐ ఐటీ అండ్ సీవో పోస్టులకు 729(23.40 శాతం), ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ డ్రైవర్, డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలకు 1,779 (89.53 శాతం), ఎస్‌సీటీ ఏఎస్ఐ ఎఫ్‌పీబీ ఉద్యోగాలకు 1,153(77.54 శాతం), ఎస్‌సీటీ ఎస్ఐ పీటీవో ఉద్యోగాలకు 463(79.97 శాతం), ఎస్‌సీటీ పీసీ మెకానిక్ పోస్టులకు 238(82.07 శాతం) మంది అర్హత సాధించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected