
ఎస్సై కి మద్దతుగా జగిత్యాలలో కొనసాగుతున్న బంద్
జగిత్యాలజిల్లా :మే 13
జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్ కేసు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. అదే సమయంలో అనిల్ సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జగిత్యాల బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.
జగిత్యాల బస్సు డిపో ముందు విశ్వహిందూ పరిషత్ ఆందోళన చేపట్టారు. దీంతో బస్సు డిపోకి ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి. ఎస్సై అనిల్ పై సస్పెన్షన్ ఎత్తివేసి ఎస్సై అనిల్ కు, తన భార్యకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐ అనిల్ స్పందించారు.
బంద్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన శుక్రవారం విడుదల చేశారు. కొందరు రాజకీయ నేతలు, కొన్ని వర్గాలు తమ ప్రయోజనాల కోసమే బంద్ చేస్తున్నాయని అనిల్ ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, చట్టంపై తనకు నమ్మకం ఉందని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం సస్పెన్షన్ అంశాన్ని పరిష్కరిస్తామని అనిల్ తెలిపారు.
*నాకోసం బంద్ లు పాటించి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు *మీ ఎస్ఐ అనిల్ కుమార్
న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది.
నా విషయంలో ఎవరు రాద్దాంతం చేయద్దు..ఎస్సై అనిల్..
జగిత్యాల రూరల్ ఎస్సై గా పనిచేసిన అనీల్ గత రెండు రోజుల క్రితం ఆర్టీసీ బస్సులో జరిగిన గొడవ వ్యవహారంలో సస్పెండ్ కాగా కొన్ని రాజకీయ పార్టీలు,కొన్ని సంఘాలు, సంస్థలు అనిల్ ఎస్సై కి మద్దతుగా ఎస్సై సస్పెన్షన్ రద్దు చేయాలని శనివారం జగిత్యాల బందుకు పిలుపునివ్వగా ఇది తెలిసిన ఎస్సై అనిల్ తనకు ఆ బందుకు ఎలాంటి సంబంధం లేదని కొందరు రాజకీయ స్వార్థం కోస ప్రయత్నాలు చేస్తున్నారని వారిని ఎవరునమ్మవద్దని నేను చట్టానికి, పోలీసు క్రమశిక్షణ కు రాజ్యాంగానికి లోబడే ఉంటానని వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు తనకు న్యాయవ్యవస్థ పై పోలీస్ ఉన్నతాధికారులపై నమ్మకం ఉందని ఎవరు అనవసరంగా నా విషయంలో బందులు చేయవద్దని కోరారు.
ఈ వీడియో బయటకు రావడంతో బందుకు పిలుపునిచ్చిన కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, సంస్థలు ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు తమ స్వార్థప్రయోజనాల కోసం వాడుకుందామనుకున్నవారికి ఎస్సై అనిల్ వ్యవహారం కొరకరాని కొయ్యలా మారిందని పలువురు చర్చించుకుంటున్నారు