
ఒక ముఖ్యమంత్రి ధర్నాలు చేయండి అని చెప్పడం సిగ్గుచేటు :-బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్..
పటాన్ చెరువులో ఈ రోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ మాట్లాడుతూ సిలిండర్ ధర పెరిగిందని అధికారంలో ఉన్న పార్టీ ధర్నా చేయడం సిగ్గుచేటు ఒక సామాన్యుడు మాత్రం ఎలా ఆలోచిస్తున్నాడు అంటే..సిలిండర్ ధర పెరిగింది కేవలం 50 /రూపాయలు మాత్రమే.. ఒక్క సిలిండర్ మూడు నెలలు వస్తుంది . అంటే భారం నెలకు 17/-రూపాయలు..ప్రతి రోజు ఒక కూలీ సుమారు 20 km ప్రయాణం చేస్తాడు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు బస్సు చార్జ్ 15 / – రూపాయలు ఉండేది కాని తెలంగాణ ప్రభుత్వం పెంచిన బస్సు టికెట్ల ధర వలన ఇప్పుడు 30 / -రూపాయలు అయ్యింది.పెంచక ముందు నెల ఖర్చు 450 / – రూపాయలు ఇప్పుడు 900 /- రూపాయలు అవుతున్నది..అలానే చదువు కుంటున్న విద్యార్థుల బస్ పాస్ నెలకి 200/- రూపాయలు ఉండేది . ఇప్పుడు 800 / – రూపాయలు చేసిండు.ఇక కరెంటు నెలకు 120 / -రూపాయలు వచ్చేది ఇప్పుడు 300 / – రూపాయలు వస్తున్నది..కేంద్రం పెంచిన గ్యాస్ ధర వలన మనకు భారం కి 50/- రూపాయలు మాత్రమే . కాని KCR పెంచిన ధరల వలన 3 నెలలకు సామాన్యులకు భారం 4000 /- రూపాయలు అయ్యింది.గ్యాస్ ధర రేపు తగ్గచ్చు కాని బస్సు చార్జ్ కరెంటు చార్జ్ లు ఎన్నడు తగ్గవు కదా..సామాన్యుడి పై భారం గ్యాస్ రేట్ ల వలన నా లేక పెరిగిన బస్సు, కరెంటుమద్యం రెట్ల వలన ఇబ్బంది పడుతున్నారో ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఒకవేళ మీకు నిజంగా తెలంగాణ బీద ప్రజలపై ప్రేమ ఉంటే గ్యాస్ పై రాష్ట్ర 55% టాక్స్ లో నుండి రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలని కోరారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా బి.ఆర్.ఎస్ పార్టీని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని అన్నారు.