ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?”

ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?”

ఈస్టర్ అనేది యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజు. ప్రపంచానికి గొప్ప సవాలుగా మారిన రోజే ఈస్టర్. అయితే దీనికంటే ముందుగా యావత్ క్రైస్తవ ప్రపంచం అయన సిలువ వేయబడిన రోజు గుడ్ ఫ్రైడే కు ముందుగా 40 రోజులు ఉపవాసం ఉండి అయన శ్రమల దీనలను ధ్యానిస్తూ ప్రతి చర్చిలో ప్రార్ధనలు జరుపుతారు. శుభశుక్రవారం రోజున గుడ్ ఫ్రైడే అనగా యావత్ మానవాళి పాపవిమోచన కొరకు యేసుక్రీస్తు కల్వరి సిలువలో ఘోరంగా అవమానించబడి తాను ఏ తప్పుచేయనప్పటికి సిలువలో హింసించబడుతాడు. ఉదయం 9గంటలనుండి 12గంటల వరకు విచారణలో పలునిందలు ఎదురుకుంటాడు. అక్రమం, అన్యాయం, మోసంలో జీవిస్తూ జైలు శిక్షను అనుభవిస్తున్న బరబ్బాను విడుదలచేయాలి యేసుక్రీస్తును సిలువ వేయాలని మెజారిటీ ప్రజలు న్యాయమూర్తిగా ఉన్న పొంతిపిలాతు ఎదుట కేకలువేస్తారు. అప్పటికి యేసుక్రీస్తులో ఏ తప్పులేదని పొంతిపిలాతుకు తెలుసు. మరియు పొంతిపిలాతు భార్యకూడా యేసుక్రీస్తు ఏ తప్పుచేయని గొప్ప దైవ కుమారుడు ఆయనను అనోవసరంగా చేయని తప్పుకు శిక్షించడానికి ఎట్టిపరిస్థితిలో సహసం చేయకూడదని ముందుగానే హెచ్చరిస్తుంది. కానీ మత నాయకులు రాజకీయ నాయకులు ప్రజల్లో క్రీస్తుకున్న బలాన్ని తగ్గించాలి అంటే కచ్చితంగా యేసుక్రీస్తును తొలిగించుకోవాలని పన్నిన కుట్రలో వారి కేకలేగెలిచాయి. కాబట్టి ఒక నిర్ధాషిని అన్యాయంగా శిక్షించాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి ఈ పాపం నామీద నా పిల్లలమీద ఉండకూడదని చేతులు కూడుక్కొని యేసుక్రీస్తును సిలువ మరణానికి 12గంటలకు అప్పగిస్తాడు. అయితే 12నుండి 3గంటల వరకు సిలువలో పలికిన 7మాటలే చివరి మాటలుగా ప్రముఖ్యమైనవిగా గుడ్ ఫ్రైడే రోజు ధ్యానిస్తారు.
Do you know who is Jesus? యేసు క్రీస్తు ఎవరో మీకు తెలుసా?
ఈ లోకములో జన్మించిన మానవులు కొంతకాలం తమకు నచ్చినట్లు జీవిస్తున్నారు. ఏదో ఒక రోజు మరణిస్తున్నారు. పుట్టుట గిట్టుట కొరకే అని అనుకుంటూ జీవిస్తున్నారు.
(1) మానవులు ఎందుకు మరణిస్తున్నారు? మొదటి మానవుడైన ఆదాము పాపము చేయుట వలన ఈ లోకానికి పాపమును, పాపము ద్వారా మరణమును అందరికి సంప్రాప్తమాయెను.
రోమా 5:12 (2) పాపము అంటే ఏమిటి? ఆజ్ఞాతిక్రమమే పాపము అంటే దేవుని మాట వినకపోవడమే పాపము. 1 యోహాను 3:4
(3) మానవులు ఎలాంటి పాపములు కలిగియున్నారు?
పాపములోనే నా తల్లి గర్భము ధరించెను అనగా ప్రతి మానవుడు జన్మతోనే పాపముతో జన్మిస్తున్నాడు. పుట్టిన నాటినుండి క్రియల వలన పాపము చేస్తున్నాడు. ఇది కర్మ పాపము ఈ విధముగా మానవుడు జన్మ, కర్మ పాపములు కలిగియున్నాడు.
(4) ఈ ప్రపంచంలో పుట్టిన వారందరూ మరణిస్తారా?
మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళవశం కాకుండా తన్ను తాను రక్షించుకొన గలవాడు ఎవడు? ఎవరూ లేరు కీర్తన 89:48 (5) నరులు తామంతట తామే పాపము నుండి శుద్ధులు కాగలరా? శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? యోబు 15:4 తన్ను తాను శుద్ధునిగా చేసు కొనలేడు.
(6) ప్రతి మానవునికి మరణించిన తరువాత తీర్పు ఉందా? మానవులు ఈ లోకములో జీవించియున్నంత కాలము చేసిన ప్రతి పనికి, మాట్లాడిన ప్రతి మాటకు తీర్పు ఉంది. ప్రతి ఒక్కరు ‘‘యేసు క్రీస్తు’’ న్యాయపీఠము ఎదుట నిలబడవలెను.
మనుష్యులొక్కసారే మృతి పొందవలెను. అటుతరువాత తీర్పు జరుగును. హెబ్రీయులకు 9:27 (7) మానవులను పాపము, మరణము, పాతాళము, తీర్పు నుండి రక్షించడం ఎలా? మానవుడు పాపము చేయుట వలన మరణము వచ్చినది. మరణము అంటే ప్రాణము పోవుట. ప్రాణము అనగా ప్రతి జీవికి రక్తమే ప్రాణము (ఆదికాండము 9:4. రక్తము చిందిస్తే పాపక్షమాపణ కలుగుతుంది. కాని ప్రతి మానవుని రక్తము పాపముతోనే వుంది. మరి లోక సామెతగా చూచిన మురికి నీరు మురికి వస్త్రములను శుభ్రం చేయలేదు. అలాగునే మానవుని రక్తము మానవుల పాపం తీసివేయలేదు. పరిశుద్ధమైన, నిష్కలంకమైన రక్తం కావాలి. 8) యేసు క్రీస్తు ఎవరు?
ఆయన అదృశ్య దేవుని స్వరూపియైన సర్వసృష్టికి అది సంభూతుడై యుండెను. కొలొస్సియులకు 1:15 కాలము సంపూర్ణమైనప్పుడు కన్యకయైన మరియ గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా ‘‘జన్మ పాపము’’, ‘‘కర్మ పాపము’’ కూడా లేదు. 1 పేతురు 2:22. ఈ పుణ్య కార్యము చేయుటకు మానవుడిగా వచ్చిన దేవాది దేవుడే ‘‘యేసు క్రీస్తు’’ లోకము ‘‘యేసు క్రీస్తు’’ ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు.
(9) మానవులకు పాప క్షమాపణ ఏవిధముగా కలుగుతుంది? ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అని యేసు ప్రభువు వచ్చెను. మత్తయి 26:28 మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ‘‘యేసు క్రీస్తు’’ రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. 1యోహాను 1:7, 9. అప్పుడు పాప విమోచన అనగా ఆత్మ రక్షణను పొందగలము.
(10) మానవునికి గల మరణ భయము ఎవరు తొలగిస్తారు? సిలువలో శ్రమపడి రక్తము చిందించి మరణించి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచిన ‘‘యేసు క్రీస్తు’’ మాత్రమే మరణ భయము తొలగించగలడు. ఓ మరణమా నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? అని మరణపు ముల్లు పాపమును జయించిన జయశాలి యేసు క్రీస్తు మాత్రమే విజయం ఇవ్వగలడు. 2 కొరింథీ 5:10
(11) మానవుల తీర్పు నుండి, పాతాళము నుండి ఎవరు రక్షిస్తారు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ‘‘యేసు క్రీస్తు’’ను అనుగ్రహించెను. దేవుడు మనం పొందవలసిన తీర్పు నుండి, పాతాళము నుండి రక్షించెను. యోహాను 3:6`20.
(12) రక్షణ కావాలంటే ఏమి చేయాలి? నీ హృదయంలో రక్షణ కావాలని కోరుకుంటే చాలు. ఆయన రక్షిస్తాడు. కీర్తన 12:5 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. మత్తయి 11:28) అని యేసు ప్రభువు పిలచుచున్నాడు.
(13) రక్షింపబడితే లాభము ఏమిటి? ఎవరైతే ఈ లోకములో జీవించియుండగా ‘‘యేసుక్రీస్తు’’ను నమ్మి బాప్తీస్మము పొందుతారో వారు రక్షింపబడుదురు. వారికి పరలోక రాజ్యము (స్వర్గము, మోక్షము) దేవునితో యుగయుగములు జీవించుట మరి ఎన్నటికిని మరణము ఉండదు. సంతోషముగా జీవించవచ్చు. (14) రక్షింపబడకపోతే నష్టము ఏమిటి?
ఎవరైతే ఈ లోకములో జీవించియుండగా ‘‘యేసుక్రీస్తు’’ను నమ్మక నాకు సంబంధిచిన దేవుడు కాదు. అనుకుంటూ తమ పాపములలోనే ఉండి మరణిస్తారో వారికి నరకం (పాతాళము, అగ్నిగుండము, రెండవ మరణము) ఉంది. నరకములో యుగయుగములు మంటలో కాలూతూ, వేదనలు బాధలు, శ్రమలు అనుభవిస్తూ దాహమని కేకలు వేస్తూ నిత్య శిక్షను అనుభవించాలి.
అయితే ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. రోమా 8:1 అని వాక్యం సెలవిస్తుంది.
ఇది మతం కాదు రక్షణ మార్గము. బలవంతంలేదు. నిర్ణయము మీదే. మీరు మరణించిన తరువాత తీర్పు వుంది. అందులో అందులో నీవు అడగవచ్చు ‘‘యేసు క్రీస్తు ఎవరో నాకు తెలియదు’’ తెలిసివుంటే నమ్ముకొనే వాడిని కదా అని అంటావు. అందుకే సకల జనుల సాక్షార్థమై సర్వలోకమంతటను ఈ రాజ్య సువార్త ప్రకటింపబడుతుంది. మత్తయి 24:14.
రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరివంటివారు. యాకొబు 4:14
ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పొగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము. ఆలోచించి సరైన నిర్ణయము తీసుకొనగలవు. మత్తయి 16:26. మరణము నుండి రక్షించుట యేసు క్రీస్తు వశములో ఉన్నది. కనుక ‘‘యేసు క్రీస్తు మాట విని యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము (అమృతము) పొందును.
“యేసు పునరుత్థానము”: 1 కొరింథీ 15
తండ్రీ కొడుకులు కారులో ప్రయాణిస్తున్నారు. అకస్మాత్తుగా ఒక కందిరీగ కారులో ప్రవేశించింది. కొడుకు భయపడి కేకలు పెడుతున్నాడు. తండ్రి ఒక్కసారిగా ఆ కందిరీగను అరచేతిలో పట్టుకొని విడిచిపెట్టాడు. ఆ కందిరీగ మరలా కారులో తిరుగుతుంటే కొడుకు కేకలు పెట్టడం ప్రారంభించాడు. అప్పుడు తండ్రి తన చేతిని చూపించి, “ఇదుగో, ఈ కందిరీగ ముల్లు నా చేతిలో విరిగింది. నిన్నది యికపై కుట్టలేదు” అని చెప్పాడు. 1 కొరింథీ 15:55-56: “ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. పునరుత్థానమును గుర్చిన ప్రవచనాలు: కీర్తనలు 16:10 ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు. యోహాను 2:19: యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను. ఆఫ్రికాలో “ఒక ముస్లిం వ్యక్తి యేసునందు విశ్వాసముంచినప్పుడు ‘ఎందుకలా చేసావని తన స్నేహితులు ప్రశ్నించారు. దానికి అతడు, ‘ఒక దారిన పోతున్నప్పుడు రెండు దారులు ఎదురయ్యాయి. ఒక దారి చివరన చనిపోయిన వాడు ఒకడు మరియు వేరొక దారిన బ్రతికున్నవాడు ఒకడు ఉన్నాడు. అప్పుడు నువ్వు ఏ దారిన వెళతావు?”
“ఒక పార్కులో పెద్ద చెట్టు ఉంది. దాని మొదలులో ఒక ప్రాకే మొక్క మొలిచి ఆ చెట్టును అల్లుకుంటూ పైకి ప్రాకుతూ ఉంది. చివరికి అది పూర్తిగా చెట్టును చంపివేసే స్థితికి వచ్చింది. పార్కులో పనివారు ఆ ప్రాకే మొక్క మొదలును నరికారు. ఆ మొక్క ఆ చెట్టు చుట్టూ అలుముకొనే ఉంది కానీ ఇప్పుడది చచ్చినది కనుక ఆ చెట్టుకు అపాయం లేదు. పాపం క్రిస్తుచే ఓడించబడింది. దానిని మరలా మన జీవితాలలో పెంచి
పోషించకూడదు.”
-రచన: బిషప్. డాక్టర్. పీటర్ నాయక్ లకావత్.