
కదం తొక్కిన కార్యదర్శులు
పంచాయతీ కార్యదర్శులు..
–రెగ్యులరైజేషన్ గురించి IDOC వరకు భారీ ర్యాలీ
-రేపటి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపు.
సికే న్యూస్ ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం : దేశస్థాయిలో తెలంగాణ పల్లెలకు గుర్తింపు తెచ్చుటలో అహర్నిశలు కష్టపడుతూ పని భారాన్ని సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న కార్యదర్శులను ప్రొబేషనరీ కాలం పూర్తయినా కూడా రెగ్యులర్ చేయకపోవడం పై ఆందోళన వ్యక్తం చేశారు
గత 13వ తారీకు కమిషనర్,కలెక్టర్లకు, డిపిఓ లకు సమ్మె నోటీసులు అందించిన నేటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో కార్యదర్శులు అందరూ రేపటి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా 13వ తారీకు నుంచి తమ తమ మండలాల్లో వినూత్నంగా నిరసనలు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు వంశీ మాట్లాడుతూ తమను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి కార్యక్రమాలు చేయడం లేదని ప్రభుత్వానికి తమను రెగ్యులరైజ్ చేయడం గురించి తెలియజేయడం కొరకే సమ్మెకు దిగడం జరిగినది అని తెలియజేయడం జరిగినది. ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న ఎటువంటి అలవెన్స్ తమకు ఇవ్వడం లేదని మరియు మహిళల పట్ల మెటర్నటీ లీవ్ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు అని తెలియజేయడం జరిగినది
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరూ జూనియర్ మరియు ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు సతీష్, సంపత్, నరేష్, పాషా, ప్రశాంత్, నర్మదా, సంజీవ, విజయ, ఉదయ్, రాణదీర్, సురేష్, రమేష్, టౌఫిక్, విజయ్, సాయి తదితరులు పాల్గొన్నారు.