
కర్ణాటక నుంచే బిజెపి పతనం ఆరంభం
పొదెం వీరయ్య.
*కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సందర్భంగా భద్రాచలం కాంగ్రెస్ లో పండగ వాతావరణం..
సీ కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,( సాయి కౌశిక్ ),
మే 13,
*కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడం సందర్భంగా….
భద్రాచలం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు “సరేళ్ళ నరేష్ ” ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించడం జరిగింది.
ఈ విజయోత్సవ వేడుకలలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య పాల్గొని క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ సెంటర్ కు చేరుకొని అక్కడ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి విజయోత్సవ వేడుకలను ప్రారంభించడం జరిగింది.
భారి స్థాయిలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకుంటూ కాంగ్రెస్ శ్రేణులు ఒక పండగ లాగా జరుపుకున్నారు..
ఈ సందర్భంగా శాసనసభ్యులు వీరయ్య మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసినటు వంటి అక్కడి ప్రజానీకానికి పాదాభివందనం చేస్తున్నానని, బిజెపి ప్రభుత్వం డబ్బుతో అధికారం అదంతో ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండి కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడ్డారని. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కరుణాకర్ లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణమని.
త్వరలో జరగబోయే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మోగిస్తుందని,దానికి ఉదాహరణగ కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం ఒకటి చాలని ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సరెళ్ళ నరేష్,టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతరేల రవికుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు భోగల శ్రీనివాసరెడ్డి,తాండ్ర నరసింహారావు,అడబాల వెంకటేశ్వరరావు,బలుసు నాగ సతీష్,బత్తుల తిరుపతయ్య, పులిగుండాల సర్పంచ్ సోడే చలపతి,సరేళ్ళ వెంకటేష్, యూత్ కాంగ్రెస్ డివిజన్ డివిజన్ అధ్యక్షులు చింతరేల సుధీర్, యూత్ కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడారి ప్రదీప్,రాంప్రసాద్ మాదాపూర్ రాజు మహిళా కాంగ్రెస్ నాయకులు వసంతాల రాజేశ్వరి,పందాల సరిత, తుమ్మల,రాణి పుట్ట జానకీరాణి,ఒంపోలు దేవకి, తదితరులు పాల్గొన్నారు.