
*కాంగ్రెస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా కో-కోఆర్డినేటర్ గా నవీన్ రాథోడ్*
సి.కే న్యూస్ ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సోషల్ మీడియా కో-కోఆర్డినేటర్ గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పాపకోల్లు గ్రామానికి చెందిన నవీన్ రాథోడ్ నూతనంగా నియమితులయ్యారు. ఈ నియామకాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ పెట్టం గారు అధికారికంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా నవీన్ రాథోడ్ మాట్లాడుతూ తనపై అపార నమ్మకంతో ఎంతో ఉన్నతమైన బాధితులు అప్పగించిన రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ పెట్టడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే టిపిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి గారికి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క గారికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భద్రాచలం శాసనసభ్యులు పోదేం వీరయ్య గారికి మరియు జూలూరుపాడు మండల అధ్యక్షులు మంగీలాల్ నాయక్ గారికి, నున్నా కృష్ణయ్య గారికి ధన్యవాదాలు తెలియజేశారు.