
కురవి ఎంపిపికి ఎంత కష్టం..
ఉదయం యంపిపి గా అభివృద్ధి కార్యక్రమాలలో..
మద్యాహ్నం నుండి తాలుమిరపకాయలు ఏరే కూలీగా బతుకుపోరులో..!!
ఉద్యమకారుని కుటుంబానికి యంపిపి పదవి దక్కినా పాయిదా లేదు..
ఎకరం భూమి అప్పులకిందే అమ్ముడుపోయింది..
పదిగుంటలభూమి.. లక్షల్లో అప్పు భారంగా మిగిలిపోయింది..
పదవిలో ఉన్నందుకు తప్పని పర్యటనలు.. బ్రతుకుబండి లాగేందుకు కూలీనాలీపనులు..
ఇంత కష్టంలోనూ వారిది మచ్చలేని నిజాయితీ.. ఎమ్మెల్యే రెడ్యానాయక్ పై ఏ..మాత్రం తగ్గని నిలువెత్తు భక్తి..
కురవి యంపిపి గుగులోత్ పద్మావతిరవినాయక్ జీవితం.. పెదవులపై నవ్వులు.. గుండెలనిండా బాదలు..
తెలంగాణ సాదన ఉద్యమప్రారంభం నుంచి నేటిదాకా గులాబీజెండాను గుండెల్లో పాతుకున్న ఈ..కుటుంబానికి గుప్పెడు దైర్యం కావాలి.. ఆర్ధిక కష్టాలు తీరిపోయే సాయం అందాలి..
పార్టీ కోసం పనిచేసే ప్రతికార్యకర్తను పార్టీ ఆదుకుంటుందని, అండగా ఉంటుందనే సందేశాన్ని ఆత్మీయసమ్మేళనం ద్వారా అందించేందుకు భారాస పూనుకున్న ఈ..సమయంలో ఓ..యంపిపిగా ఉండి దినసరికూలీగా పనులు చేసుకుంటున్న ఈ..కుటుంబానికి భారాస అదిష్టానం భరోసా ఇవ్వాలి..
ముఖ్యమంత్రి కేసీఆర్ తో, మంత్రి, పార్టీవర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తో కలిసి నడిచిన తెలంగాణ ఉద్యమకారుడు, బిఆర్ఎస్వీ జిల్లాఅద్యక్షులు గుగులోత్ రవి, కురవి యంపిపి పద్మావతిరవినాయక్ దంపతులకు ఆత్మీయ ఓదార్పు, ఆర్థికభరోసా భారాస నుండి అందాలని వారి కష్టం చూస్తే పొంగుతున్న కన్నీళ్ళ సాక్షిగా కోరుకుందాం..!!