
కేయూలో పీపుల్స్ మార్చ్
విద్యార్థులతో మాట్లాడిన సీఎల్పీ నేత
కష్టాలు, సమస్యలు చెప్పుకున్న విద్యార్థుల
లక్ష్యాలను లక్షలకు అమ్ముకుంటున్న ప్రభుత్వం
ఉద్యోగాలను అమ్ముకుంటున్న బీఆర్ఎస్
లక్ష్యాలను చేరుకుని ప్రత్యేక తెలంగాణ
టీ.ఎస్.పీ.ఎ.స్సీ. రద్దుకు రాష్ట్రపతికి లేఖ రాస్తా
వరంగల్ జిల్లాలో పారుతున్న నీళ్లన్నీ దేవాదుల ఫేజ్ 1, కాకతీయ కాలువ నుంచే
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నుంచి ఒక్క ఒకరాకు నీళ్లు రాలేదు
పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలు తెసుకుంటున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను.. తమ కష్టాలు, బాధలు తెసుకులనేందుకు ఒక్కసారి కాకతీయ యూనివర్సిటీకి రావాలని ఆహ్వానించారు. విద్యార్థుల ఆహ్వానం మేరకు వారి ఇబ్బందులు ప్రత్యక్షంగా వారితో మాట్లాడి తెలుసుకునేందుకు యూనివర్సిటీకి భట్టి విక్రమార్క వెళ్లారు. యూనివర్సిటీల ప్రైవేటీకరణ, గ్రూప్ పేపర్ల లీకేజీ, రిజర్వేషన్ల ఇబ్బందులను సమస్యలనుయ సీఎల్పీ నేత దృష్టికి విద్యార్థులు తీసుకువచ్చారు.
సూర్యపేటకు చెందిన రాజశేఖర్ మాట్లాడుతూ.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే.. వారి కోటా వారికి ఇవ్వాల్సిందే. అదే విధానాన్ని చట్టసభల్లో కూడా కేసీఆర్ అమలు చేయాలని చెప్పారు.
మరో విద్యార్థి డోంగ్రూ కచ్రూ మాట్లాడుతూ.. మా విద్యార్థుల లక్ష్యాన్ని కేసీఆర్ ప్రభుత్వం లక్షలకు అమ్ముకుంటోందని ఆవేదనగా చెప్పారు. రూ.5 భోజనం తింటూ.. చదువుకుని ఉద్యోగాలకు ప్రిపేరవుతున్నాం. కానీ ఉద్యోగాలను అమ్ముకుని బతుకున్నారు. రోస్టర్ పాయింట్లు చూస్తేంటే మాకు దడ పుడ్తోంది.. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాల్సిందే.. కానీ పురుషుల కోటా మాత్రం కచ్చితంగా అమలు చేయాలి.
తెలంగాణకుకావాల్సింది.. కుటుంబ రాజ్యం.. మత రాజ్యం కాదు.. ప్రజాస్వామ్య రాజ్యాం కావాలని చెప్పారు.
విద్యార్థి రాకేష్ మాట్లాడుతూ.. లైబ్రరీలో పుస్తకాలు లేవు, భోజనం బాగుండం లేదు.. రెగ్యులర్ ఫ్యాకల్టీ లేదు.. అవుట్ సోర్సింగ్ ప్యాకల్టీతో తరగతులు చెప్పిస్తున్నారు. గురుకుల పోస్టుల భర్తీలో పురుష అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో కాకతీయ యూనివర్సిటీ ఒక పెద్ద వర్సిటీగా, ఎన్నో ఉద్యమాలకు, భావజాలాలకు, సామాజిక మార్పులకు వేదికగా నిలిచింది. ఇలాంటి పవిత్ర ప్రాంతంలో నిలబడి మాట్లాడ్డం ఒక అదృష్టంగా నేను భావిస్తున్నా. తెలంగాణలో ఇలాంటి రోజు వస్తుందని నేను ఊహించలేదు. ఇలాంటి రోజెప్పు రావద్దనే సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది. రాష్ట్ర సంపద నాలుగుకోట్ల మందికి పంచబడి, ప్రతి ఒక్కరూ ఆత్మ గౌరవంతో జీవించాలని సోనియమ్మ ఆలోచన చేసింది. సకల సమస్యలకు పరిష్కారం తెలంగాణ ఏర్పాటు మాత్రమే అనుకున్నాం. కానీ ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే ఇప్పుడే సమస్యలు, ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి.
నేను పాదయాత్రగా నడిచి వచ్చిన ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్ర ఆశలు., ఆకాంక్షలు నెరవేరలేదు. ఈ ప్రభుత్వాన్ని వదిలించుకోవాలన్న కోపం, బాధ ప్రజల్లో స్పష్టంగా కనిపించింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమమంతా భూమి కోసం, భుక్తి కోసం.. విముక్త కోసమే సాగింది. దేశమంతా స్వాతంత్రపోరాటం సాగుతున్న సమయంలో హైదరాబాద్ ప్రాంతంలో భూమి కోసం పోరాటం చేశాము. దున్నేవాడిదే భూమి అంటూ భూ ఉద్యమాలు చేశాము. దేశానికి స్వాతంత్రం వచ్చిన ఏడాదికి అంటే 17 సెప్టెంబర్ 1948లో మనకు స్వాతంత్రం వచ్చింది.
ఆరోజుల్లో ఉత్పాదకత అంతా భూమి మీదే ఉండదేది. ఆ భూమి కొద్దిమంది చేతుల్లో ఉండి.. బానిసత్వం, వెట్టిచాకిరి ఉండేది. దీంతో తెలంగాణ ప్రాంతంలో సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు టెన్నెన్సీ యాక్ట్ తీసుకువచ్చిన పేదలకు భూమిపై హక్కును కల్పించింది. తరువాత భూ సంస్కరణలు అమలు చేసి భూ పంపిణీ చేసింది చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అప్పటికీ తృప్తి చెందని తెలంగాణ సమాజం తొలిదశ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేసింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రిపై నక్సలైట్లు దాడులు జరిగాయి. తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వారితో చర్చలు జరిపి.. కోనురు రంగారావు కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సులను అమలు చేసి.. మరింత సమర్థవంతంగా భూ పంపిణీ చేసింది.
మా రాష్ట్రం మాకొస్తే మా నీళ్లు, నీధులు, నియామకాలు, ఆత్మ గౌరవం వస్తుందన్న ఆలోచనతో మలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చింది. దీనిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించింది. శ్రీమతి సోనియాగాంధీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా తెలంగాణ ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రతి ఉద్యమానికి చట్టబద్ధ ఫలితాలు వచ్చాయి. ఒక్క తెలంగాణ ఏర్పాటు విషయంలో మాత్రం.. ప్రజలు 70.. నుంచి 80 ఏళ్ల వెనక్కి నెట్టివేయబడ్డారు. ధరణిపేరుతో కాంగ్రెస్ పంచిన భూములను కేసీఆర్ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది.
నీళ్లు లేవు.. నిధులు లేవు.. నియమకాలు లేకుండా చేశారు. తెలంగాణకు సింగరేణి ఉద్యోగాల గని.. ఉమ్మడి రాష్ట్రంలోనే లక్ష 20 వేల ఉద్యోగాలున్న సింగరేణిలో ప్రస్తుతం 42 వేల ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. బొగ్గుగనులు ప్రైవేటుకు ఇవ్వడం, అక్కడ కూడా అవుట్ సోర్సింగ్ లో బయటి వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడంతో స్థానికులకు ఉద్యోగాలు లేకుండా పోయాయి.
ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వరంగ సంస్థల్లోని ఖాళీలను ప్రభుత్వం నింపడం లేదు.కొలువుల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆ లక్ష్యాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం దెబ్బతీసింఇది. నీళ్లు, నిధలు, నియాకమాలు, ఆత్మగౌరవం, తెలంగాణ లక్ష్యాలు నెరవేరేవరకూ విద్యార్థథి లోకం పోరాటినికి సిద్ధం కావాలి.
సమాజానికి ఉపయోగపడే మేధస్సు కలిగిన మానవవనరులు విద్యార్థలని గుర్తించాలి. విద్యార్థుల భావజాలాలు, ఆలోచనలు, సమాజ మార్పుకు దోహదపడే ఎన్నో చట్టాలు వచ్చేందుకు దోహదపడ్డాయి. రాష్ట్రంలోని 11 వర్సిటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినవే. ఈ తొమ్మిదిన్నర ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటి వర్సిటీని ఎందుకు ఏర్పాటు చేయలేదు. ఉన్న ప్రభుత్వ వర్సిటీలను నిర్వీర్యం చేసే కుట్రను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోంది.
కేసీఆర్ ఇంకా కొనసాగితే వర్సిటీ భూములను కూడా అమ్మేస్తాడు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి అదనంగా ఒక్క ఎకరాకు సాగునీరు పారలేదు. వరంగల్ జిల్లాలో సాగుకు అందుతున్న నీళ్లన్ని కాకతీయ కాలువ, దేవాదుల ఎత్తిపోత పథకం ఫేజ్ 1 నుంచేనని నేను సవాల్ చేసి చెబుతున్నా. తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం లేకుండా 70 ఏళ్లనాటి ఫ్యూడల్ వ్యవస్థను పునరుద్ధరించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోంది. త్వరలో టీ.ఎస్.పీ.ఎ.ఎస్సీ రద్దుకు రాష్ట్రపతికి లేఖ రాస్తాను.