Telangana

కేసీఆర్ కు కొత్త పేరు పెట్టిన వైఎస్ షర్మిల..ఏంటో తెలుసా?

కేసీఆర్ కు కొత్త పేరు పెట్టిన వైఎస్ షర్మిల..ఏంటో తెలుసా?

కేసీఆర్ కు కొత్త పేరు పెట్టిన వైఎస్ షర్మిల..ఏంటో తెలుసా?

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల (Ys Sharmila) దూకుడు పెంచారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3800 కిలోమీటర్లకు పైగా ప్రజాప్రస్థానం పాదయాత్ర చేశారు.
ఇక ఆ తరువాత నుంచి కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ఇటీవల TSPSC పేపర్ లీక్ పై కూడా షర్మిల (Ys Sharmila) తన గళాన్ని వినిపిస్తూ వస్తున్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని కేసీఆర్ కు వ్యతిరేకంగా యుద్ధం మొదలుపెట్టారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ..ప్రజల సమస్యలపై గొంతెత్తుతున్నారు. ఇక తాజాగా సీఎం కేసీఆర్ పై షర్మిల (Ys Sharmila) వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయ్యాక తన పేరును కమీషన్ల చంద్రశేఖర్ రావుగా మార్చుకున్నారు. కమీషన్ల కోసమే ప్రాణహిత – చేవెళ్ల, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులను రీ డిజైన్ చేశారని షర్మిల ఎద్దేవా చేశారు. పోనీ రీ డిజైన్ చేసి సాగునీరు ఇస్తున్నారా అంటే దిక్కు లేదు. పాలమూరు ప్రాజెక్ట్ తో ఒక్క ఎకరాకు నీళ్లు పారించలేదు. ఏ ప్రాజెక్టు అయినా మెగా కృష్ణారెడ్డికే కట్టబెట్టి, కమీషన్లు దోచుకుంటున్నారని షర్మిల (Ys Sharmila) విమర్శించారు.

కమీషన్లకు కక్కుర్తిపడి వైయస్ఆర్ కలల ప్రాజెక్టులను కేసీఆర్ ఖూనీ చేశారు. జూరాల ద్వారా ఉమ్మడి పాలమూరులో 12లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని పాలమూరు-రంగారెడ్డి పథకానికి వైయస్ఆర్ రూపకల్పన చేస్తే.. దీనిని రీడిజైన్ చేసి, కమీషన్లు దోచుకుని, ప్రాజెక్టును మాత్రం పూర్తి చేయలేదు. వైయస్ఆర్ గారు రూ.38వేల కోట్లతో డా.బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించి, 16లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని భావిస్తే.. కేసీఆర్ దీనిని కాళేశ్వరంగా రీడిజైన్ చేసి, రూ.లక్ష కోట్లు కుమ్మరించి ప్రాజెక్టు కడితే.. మూడేండ్లకే మునిగింది. 18 లక్షల ఎకరాలకు అని చెప్పి, రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చామని చెప్పడానికి సిగ్గనిపించడం లేదా..? 2 లక్షల ఎకరాలకు లక్ష కోట్లు ఖర్చు పెట్టడానికి కేసీఆర్ కి బుద్ది ,ఇంగితం ఉండాలే కదా అని షర్మిల (Ys Sharmila) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 48 నెలల్లోపూర్తి చేస్తామని చెప్పి, తొమ్మిదేండ్లయినా కేసీఆర్ పూర్తి చేయడం లేదు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 42 రోజుల పాటు నల్లబ్యాడ్జీలతో పాదయాత్ర చేసి, నిరసన తెలిపాం. 24 గంటల పాటు నిరాహార దీక్ష చేశాం. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేంతవరకు, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మించేంత వరకు YSR తెలంగాణ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని షర్మిల (Ys Sharmila) వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ని కాపీ కొడుతున్న బీజేపీ .. ఆ ఫార్ములాయే నచ్చిందా?

తెలంగాణ ఏర్పడ్డాక ప్రారంభించిన తొలి ప్రాజెక్టును కేసీఆర్ తొమ్మిదేండ్లయినా పూర్తి చేయలేదు. YSR గారు భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, SLBC ద్వారా లక్షల ఎకరాల్లో పాలమూరు ప్రజలకు నీళ్లు అందిస్తే.. కేసీఆర్ మాత్రం ‘పాలమూరు-రంగారెడ్డి’ని పడావు పెట్టారని షర్మిల ఆరోపణలు చేశారు. కేసీఆర్ కమీషన్లు దోచుకొని, కమీషన్ల చంద్రశేఖర్ రావుగా మారారు కానీ ఈ ప్రాజెక్టును మాత్రం పూర్తి చేయలేదు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామన్న మతతత్వ బీజేపీ ప్రభుత్వం సైతం మోసం చేసింది.

YSR తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును, లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ను పూర్తి చేస్తాం అని షర్మిల హామీనిచ్చారు. ‘లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్’ నిర్మాణంపై కేసీఆర్ మొండివైఖరిని నిరసిస్తూ షాద్ నగర్ పట్టణంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్న షర్మిల (Ys Sharmila) ఈ వ్యాఖ్యలు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected