
కేసీఆర్… నీమాటలన్నీ కోతలే….
వారంలో ఇస్తానన్న పంట నష్టపరిహారం ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు?
ఏ రైతును కదిలించినా కన్నీళ్లే వస్తున్నయ్
8 ఏళ్లలో పంట నష్టపోయిన ఏ ఒక్క రైతు కుటుంబాన్నైనా ఆదుకున్నవా?
నిర్ణీత సమయంలో కొనుగోలు కేంద్రాలను తెరిచినట్లయితే సగం మంది రైతులకు నష్టం జరగకపోయేది కదా
ఆ కేంద్రాలు తెరవకపోవడంవల్లే కోతలను చాలామంది రైతులు నిలిపివేశారు
కేంద్రం విపత్తుల కింద తెలంగాణకు కేటాయించిన రూ. 3 వేల కోట్లు ఏమైనయ్?
నీ సమగ్ర పంటల బీమా విధానం ఏమైంది?
ఫసల్ బీమా పరిహారం ఎందుకు అమలు చేస్తే రైతులకు ఈ దుస్థితి ఉండేది కాదు కదా?
నీ వల్ల రైతులు బిచ్చగాళ్లలెక్క ప్రతిసారి అడుక్కోవాలా?
నీ కొడుకు, బిడ్డ సంపాదనలో ఒక్క శాతం ఖర్చు పెట్టినా రైతులకు సాయం అందేది కదా?
పంజాబ్ రైతులకిచ్చిన చెక్కులు చెల్లలేదు..
తెలంగాణ రైతుల వద్ద కూడా అన్నీ కోతలేనా?
కనీస మద్దతు ధరకు తోడుగా ఏనాడైనా వరికి రూ.500 బోనస్ ఇచ్చినవా?
పండించిన ధాన్యం నేనే కొంటానంటవ్? కొనుగోలు కేంద్రాలు ప్రారంభించవు?
తక్షణమే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లించాలి
లేనిపక్షంలో బీజేపీ పక్షాన రైతులకు పరిహారం అందేదాకా పోరాడతాం
సీఎం తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్
కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల్లో పంట నష్టపోయిన గ్రామాల్లో పర్యటించిన బండి సంజయ్
కన్నీటి పర్యంతమైన రైతులను ఓదారుస్తూ భరోసా ఇచ్చిన సంజయ్
‘‘కేసీఆర్…. ఒక్కసారైనా రైతుల వద్దకు రా. యాడ చూసినా పంట నష్టపోయి రైతులు ఏడుస్తున్నరు. ఏ రైతును కదిలించినా కన్నీళ్లే వస్తున్నయ్. గత నెలలో పంట నష్టపోయిన రైతులకు ఇంతవరకు ఎందుకు పరిహారం ఇవ్వలేదో సమాధానం చెప్పాలి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమర్ డిమాండ్ చేశారు. 8 ఏళ్లలో పంట నష్టపోయిన ఏ ఒక్క రైతు కుటుంబాన్నైనా ఆదుకున్నవా? అని ప్రశ్నించారు.
నిర్ణీత సమయంలో కొనుగోలు కేంద్రాలను తెరిచినట్లయితే సగం మంది రైతులకు నష్టం జరగకపోయేది కదా అని పేర్కొన్నారు. ఆయా కేంద్రాలు తెరవకపోవడంవల్లే కోతలను చాలామంది రైతులు నిలిపివేశారని చెప్పారు. ప్రక్రుతి విపత్తుల కింద తెలంగాణకు కేంద్రం కేటాయించిన రూ. 3 వేల కోట్లు ఏమైనయ్? వేటికి ఖర్చు చేశారో ఆ వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ కుమార్ లతో కలిసి ఈరోజు కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల్లోని పకీర్ పేట, చామనపల్లి, వేదురుగట్ట గ్రామాల్లో పర్యటించారు.
• వడగండ్ల వానతో నష్టపోయిన పంట పొలాలను పరిశలించారు. రైతులను కలిసి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఏ రైతును కదిలించినా కన్నీళ్లే. అప్పు చేసి ఎకరానికి రూ.30 వేల పెట్టుబడి పెడితే తీరా పంట చేతికొచ్చే సమయంలో వడగండ్ల వాన వచ్చి మా బతుకులను నాశనం చేసిందని భోరున విలపించారు. అన్నం పెట్టే చేతులు అడుక్కునే దుస్థితికి చేరుకున్నామని వాపోయారు.
• ‘‘పోయినసారి పంట నష్టపోయాం… ఈసారైనా పంట వస్తే అప్పులు తీర్చాలనుకున్నాం… ఈసారి కూడా దేవుడు మా పంటను పొట్టన పెట్టుకున్నడు.. చావే శరణ్యం’’ అంటూ పలువురు రైతులను బండి సంజయ్ ను పట్టుకుని ఏడ్చారు. వాళ్ల కన్నీళ్లను తుడిచిన బండి సంజయ్ మీకు పరిహారం అందేవరకు ప్రభుత్వంపై పోరాడతానని భరోసా ఇచ్చారు. మీరేం బాధకండి… బీజేపీ మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు….
• కరీంనగర్ జిల్లాలో వడగండ్ల వానతో రైతులు పూర్తిగా పంట నష్టపోయారు. ఇయాళ పంట పొలాలకు పోయి రైతును కదిలిస్తే దు:ఖ మొస్తోంది. ఏ రైతును చూసినా కన్నీళ్లే వస్తున్నయ్. పోయినసారి పంట నష్టపోయారు. ఈసారైనా పంట చేతికొస్తే ఆ నష్టాన్ని పూడ్చుకుని అప్పు తీర్చాలని రైతులు తపన పడ్డారు. తీరా చూస్తే మళ్లీ వడగండ్ల వానతో పంట పూర్తిగా నష్టపోయారు.
• నిర్ణీత సమాయానికి కొనుగోలు కేంద్రాలు తీర్చినట్లయితే ఇంత భారీ నష్టం జరిగేది కాదు.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంవల్ల రైతులు కోతలు పూర్తి చేయలేకపోయారు.
• గతనెలలోనే సీఎం కేసీఆర్ ఇదే జిల్లాలోని రామడుగు వచ్చిండు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇస్తానన్నడు. ఈ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే గత నెలలో 23 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని నివేదిక ఇఛ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 288 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు నయాపైసా రైతులకు సాయం అందలేదు. తీరా చూస్తే 8 వేల ఎకరాలకే పంట నష్టం ఇవ్వాలని నివేదిక రడీ చేశారట.. అయినా ఏ ఒక్కరి ఖాతాలో పైసా కూడా పడలేదు.
• కేసీఆర్ ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేరు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డ దాఖలాల్లేవు. ఇయాళ రైతులు బిచ్చమెత్తుకోవాల్నా? నీ మూర్ఖత్వ పాలనలో 4 ఏళ్లలో 70 వేల మంది రైతులు చనిపోయారు.
• 288 కోట్ల రూపాయల సాయం చేస్తానని చెప్పిన నిధులన్నీ కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ కింది కేటాయించినవే కదా…. ఆ డబ్బులు రైతులకు ఇవ్వడానికి నీకున్న అభ్యంతరమేంది?
• మళ్లీ ఈసారి కూడా రైతులు వడగండ్ల వానకు నష్టపోయారు. ఈసారి 24 వేల ఎకరాల పంట నష్టం జరిగింది ఈ జిల్లాలోనే… ఇట్లయితే రైతులు కోలుకునేదెలా?
• అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వనట్లుంది నీ పాలన. 8 ఏళ్లలో నష్టపోయిన ఒక్క రైతు కుటుంబాన్ని అయినా ఆదుకున్నవా?
• ప్రక్రుతి వైపరీత్యాల కోసం కేంద్రం రాష్ట్రానికి రూ. 3 వేల కోట్ల రూపాయలిచ్చినవ్. ఆ డబ్బులేం చేసినవో వివరాలు విడుదల చేసే దమ్ముందా?
• ఈడ కోతలు కోస్తివి… పారిపోతివి. పంజాబ్ పోయి రైతులకు చెక్కులిస్తివి..అవి కూడా చెల్లకపాయే…
• నీ కొడుకు, బిడ్డ దందాలకిచ్చే చెక్కులు చెల్లుతాయి. మీరు దోచుకున్న సొమ్ములో ఒక్క శాతం ఇస్తే రైతులకు పూర్తి సాయం అందుతుంది..
• రుణమాఫీ చేయలేదు. రుణాలివ్వడం లేదు. కౌలు రైతుల గోస చూస్తే దు:ఖమొస్తుంది. అప్పులు చేసి కౌలు చేస్తే పంట నష్టపోయారు. అటు అప్పు కట్టలేక.. ఇంట్ల తినడానికి తిండిలేక ఏడుస్తున్నరు.
• ఫ్రీ యూరియా ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. రుణమాఫీ చేస్తానన్నడు. రైతును రాజును చేస్తానన్నడు. భూకంపం స్రుష్టిస్తానన్నడు. అవన్నీ గాలికిపోయినయ్.
• పంట నష్టపోతున్నరు. ఇండ్లు కూలిపోతున్నయ్. పశువులు చచ్చిపోతున్నయ్. కానీ ఏ ఒక్క రైతును ఆదుకున్న దాఖాలాల్లేవు. రైతులు ఎవరిని కదిలించినా కన్నీళ్లే వస్తున్నయ్.
• కేసీఆర్ మాత్రం సర్వేలు, నివేదికల పేరుతో, మంత్రుల, ఎమ్మెల్యేల పర్యటనల పేరుతో కాలయాపన చేయడం తప్ప గత 8 ఏళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమిటి? మాట్లాడితే కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని ఏడుస్తున్నరు. నువ్వు సాయం చేస్తున్న నిధులన్నీ కేంద్రం కేటాయించినవే… మరి నువ్వు రాష్ట్ర ప్రభుత్వం తరుపున చేసిన సాయం ఏమిటి?
• వరికి కేంద్రం మద్దతు ధర ఇస్తుంది. నీ ముఖానికి ఏనాడైనా రూ.500 బోనస్ ప్రకటించినవా? లేదు… వడ్లు కొనుగోలు కేంద్రాలు సమయానికి తెరిచే తెలివి లేదు. పంట చేతికి వచ్చినప్పటి నుండి బ్యాంకులో డబ్బులు పడే దాకా రైతులను అరిగోస పెడుతున్నరు.
• పోయిన నెల వడగండ్లతో నష్టపోయిన రైతులకు ఎందుకు పరిహారం ఇవ్వలేదో సీఎం సమాధానం చెప్పాలి. అట్లాగే ఈసారి కూడా నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.20 వేలు తక్షణమే ఇవ్వాలి.
• బీజేపీని ఓడించడానికి కర్నాటక, బెంగాల్ పోయి వేల కోట్ల రూపాయలు కేసీఆర్ ఇస్తున్నడు. ఇతర పార్టీ నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకోవడానికి ప్రత్యేక విమానాలు పంపుతున్నడు. రైతులకు సాయం చేయడానికి నీకున్న ఇబ్బందేమిటి? నువ్వేమీ తట్టమోసి సంపాదించిన పైసలు కావు కదా…
• మందిని ముంచడానికి, బీజేపీని ఓడించడానికి వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైన నువ్వు రైతు కంట కన్నీరు తుడిచేందుకు ఎందుకు డబ్బులివ్వడం లేదు?
• నిత్యం రాజకీయాలేనా? రైతుల వద్దకు వచ్చి చూడు.. ఆ బాధేందో తెలుస్తది. ఇకనైనా సర్వేలు, నివేదికల పేరుతో కాలయాపన చేయకుండా పంట నష్టపరిహారం ఇవ్వాలి.
• రైతులెవరూ నిరాశపడొద్దు. మీకు న్యాయం జరిగే వరకు బీజేపీ మీకు అండగా ఉంటది. తక్షణమే పరిహారం ప్రకటించకపోతే బీజేపీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం.
• సీఎం నోటి నుండి ఏ మాట వచ్చినా శాసనం కావాలి. కానీ నువ్వు మాత్రం ఎన్ని హామీలిచ్చినా ఒక్కటీ అమలు చేయని దుర్మార్గుడివి. నీ జీవితం మొత్తం మోదీని తిట్టడానికే తప్ప రైతులను ఆదుకున్న దాఖలాల్లేవు. మాటలు కోటలు దాటుతయ్… చేతలు మాత్రం గడప దాటదు. కోట శ్రీనివాసరావు అహ నా పెళ్లంట సినిమాలో మాదిరిగా కోడిని చూపించి అన్నం తిన్నట్లే ఉంది తప్ప నయా పైసా రైతులకు సాయం చేసిన దాఖలాల్లేవ్.
• రైతులను ఆదుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు… వడ్ల కొనుగోలు కేంద్రాలు తొందరగా తెరిచి ఉంటే రైతులకు మేలు జరిగేది కదా? అది చేయకుండా కేంద్రాన్ని తిట్టడమే పనిగా పెట్టుకోవడం సిగ్గు చేటు.
• కేంద్రం సహా ఎవరు సాయం చేయాలని భావించినా అధికారుల నుండి ప్రతిపాదనలు రావాలి. కానీ ఆ ప్రతిపాదనలు పంపకుండా కేంద్ర సాయం కోరడం సరికాదు. కేంద్ర బ్రుందం పర్యటించే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతా అన్నారు