
కోడిపందాల జోరులో ఆగమవుతున్న యువత..
సకల సౌకర్యాలు కలిగిస్తున్న నిర్వాహకులు…
కొంపలు కూలుస్తున్న కోడిపందాల నిర్వాహకులు
లక్షల్లో చేతులు మారుతున్న కోడిపందాలు.
అధికారుల చర్యలు శూన్యం ..?
సీ కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
మే 18,
తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన మారాయి గూడెంలో కోడి పందాలు విచ్చలవిడిగా మారాయి గత కొంతకాలంగా పలు పత్రికల్లో కథనాలు వస్తున్న కోడి పందాలు నిర్వాహకులపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. అధికారులు అండదండలు లేకపోతే వీరిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అని ప్రజా సంఘాలు ప్రజలు విమర్శిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కోడిపందాలు పేకాట ఆడకూడదని నిబంధనలు ఉన్న సరిహద్దు ప్రాంతాలను అడ్డాలుగా చేసుకొని నిర్వాహకులు జూదగాలకు సకల సౌకర్యాలు కల్పిస్తూ వారికి మద్యం మాంసం బిర్యానీ ఇలా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ లక్షలు గడిస్తున్నారు. కోడిపందాల నిర్వాహకులు పందాలు నిర్వహించేది సరిహద్దు ప్రాంతమైన ఈ నిర్వాహకులు మొత్తం కూడా తెలంగాణకు చెందిన భద్రాచలం వాసులే వీరు పలు రకాల ఆటలతో లక్షల రూపాయల దండుకుంటారు.
కోడి పందాలు పేకాట గుండాట లోనా బయట పెద్ద బజారు చిన్న బజార్ లాంటి ఆటలాడిస్తారు. జూదగాలు మద్యం మత్తులో లక్షల పోగొట్టుకుంటున్నారు ఇంత జరుగుతున్న అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని పలువురు విమర్శిస్తున్నారు.
ఇలాంటి ఆటలను అరికట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తుంటే జూదగాలు వారి ఇంట్లో నుంచి బంగారం టూవీలర్లు సెల్ ఫోన్లు ఇలా ఏది ఉంటే అది తాకట్టు పెట్టి కోడి పందాలు పేకాటలో డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలవుతున్నారు.
లక్షల రూపాయల కోడిపందాలు కాస్తున్న జూదగాలని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నదని మహిళలు ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి ఇకనైనా ఇలాంటి కోడిపందాలు పేకాట నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.