
కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెదిరింపులను ఖండించిన బత్తుల సోమయ్య
ఖమ్మం ఆదివారం 5వ తారీఖు సాయంత్రం ఐదు గంటలకు మీడియా మిత్రులతో
తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య మాట్లాడుతూ…
ఇది ప్రజాస్వామ్యమా రౌడీ రాజ్యమా? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రౌడీల్లా బెదిరింపులు ఏమిటి?
ఇందుకేనా ఉద్యమాలు చేసి, త్యాగాలు చేసి బలిదానాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నది?
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకటి గుర్తుంచుకోవాలి!
డాక్టర్ చెరుకు సుధాకర్
తెలంగాణ ప్రాంతంలో సమైక్య రాష్ట్ర పాలకుల రాక్షస నయీం ముఠా సహాయంతో ప్రశ్నించే గొంతుకలను అతి కిరాతకంగా హత్యలు చేయిస్తూ, పౌర హక్కులను ఉల్లంఘిస్తూ నిర్బంధ పాలన సాగిస్తున్న సమయంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు నడిపిన ధీశాలి *డాక్టర్ చెరుకు సుధాకర్ *
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతున్న డాక్టర్ చెరుకు సుధాకర్ మీద పీడీ యాక్ట్ పెట్టి జైల్లో నిర్బంధించినా, వెనకడుగు వేయకుండా తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు పోరాడిన గొప్ప పోరాట యోధుడు *డాక్టర్ చెరుకు సుధాకర్ గారు*. ఇంత చరిత్ర ఉన్న వ్యక్తినా నీవు చంపుతానని బెదిరించేది!
నీవు MP నని, డబ్బులున్నవని విర్రవీగుతున్నావు. చంపాలనుకుంటే ప్రధానమంత్రి పదవిలో ఉన్న ఇందిరా గాంధీ ని, రాజీవ్ గాంధీ ని చంపలేదా? అట్లాగే నీ గూండాలతో, రౌడీలతో డా. చెరుకు సుధాకర్ ని చంపాలని చూస్తున్నావేమో… ఆ తర్వాత రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది.
నీవంటి వందిమాగదులు గాని, నీవు గాని రాష్ట్రంలో తిరగగలరా? ఆలోచించు..
భారతదేశంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం ఏ పార్టీలో లేదు. నీవు ఏ విధంగా మాట్లాడుతున్నావో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు.
రాజకీయంగా ఒకరిపై ఒకరు ఎన్ని విమర్శలు అయినా చేసుకోండి కోమటి వెంకటరెడ్డి గారు.. భౌతికంగా నిర్మూలిస్తానని మీరు కుటుంబ సభ్యులకు ఫోన్లు ద్వారా వార్నింగ్ ఇవ్వడం, నీతిమాలిన భాష వాడడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం వీధి గుండాల్లా వ్యవహరించమని ఎంపీగా మీరు రెచ్చగొడుతున్నట్టా..??
ఈ విధంగా రోడ్డు ఎక్కితే ప్రజల్లో మీ పరువు పోదా? *చట్టం, ప్రభుత్వం, తెలంగాణ సమాజం మిమ్ములను అసహ్యించుకోదా?* మీ బెదిరింపులను, మీ భాషను తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము.
ఈ కార్యక్రమంలో *రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తుల్జా రెడ్డి*
*మీడియా ఇంచార్జ్ ఆనంతుల మధు*
*అధికార ప్రతినిధి పొనుగోటి సంపత్* మరియు ఖమ్మం జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, మెరుగు పుల్లయ్య, షేక్ అఫ్జల్, చావా రమేష్, కోయ వెంకట్ నారాయణ, అంగడి బిక్షం, తోట వెంకట నారాయణ, అశోక్ సింగ్, ఉల్లోజు వెంకన్న, వర్తియా రాజేష్, కల్వకుంట్ల లత, ఉజ్వల, రామాంజనేయులు, గార్ల శేఖర్, డిజిటల్ శ్యామ్, అంబాల రామారావు, మోదుగు సూర్యకిరణ్, వడ్డే బోయిన వెంకటేశ్వర్లు తదితర ఉద్యమకారులు తీవ్రంగా ఖండించారు..