
ఎంపీ నామ ప్రత్యేక చొరవతో మూడు ప్రత్యేక అంబులెన్స్ లలో క్షతగాత్రులను నిమ్స్ కు తరలింపు…
రాత్రి 12 గంటల అయిన ఇంకా నిమ్స్ హాస్పిటల్ లో ఉండి క్షతగాత్రులకు అందుతున్న వైద్యం గురించి దగ్గర ఉండి ఎంపీ నామ పర్యవేక్షణ
నిమ్స్ డైరెక్టర్ బీరప్పతో నామ భేటీ
నామ ప్రత్యేక శ్రద్ద తీసుకుని, నిమ్స్ డాక్టర్లతో మాట్లాడి, మెరుగైన చికిత్స
క్షతగాత్రుల కుటుంబాలకు నామ భరోసా
హైదరాబాద్ : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు
అగ్ని ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు తేజావత్ భాస్కర్, ఆంగోత్ రవి కుమార్, వెంటిలేటర్ పై ఉన్న
సందీప్ ను బిఆర్ఎస్ లోక్ సభ పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామ నాగేశ్వర రావు మెరుగైన వైద్యం నిమిత్తం ఖమ్మం నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తన స్వయం పర్యవేక్షణలో ప్రత్యేకించి ఏర్పాటు చేసిన అంబులెన్స్ లలో తరలించి, మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు .
ఈ సందర్భంగా నామ నిమ్స్ డాక్టర్ల తో ప్రత్యేకించి మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన
నాణ్యమైన వైద్యాన్ని అందించి,
బతికించాలని కోరారు.నామ బుధవారం రాత్రి నిమ్స్ ఆస్పత్రిలోనే ఉండి,
దగ్గరుండి క్షతగాత్రులకు
మెరుగైన వైద్యం అందేలా పర్యవేక్షణ చేస్తున్నారు .
బుధవారం మధ్యాహ్నం
ఫైర్ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో స్వయంగా చేర్పించి, తక్షణ చికిత్స అందేలా చర్యలు తీసుకున్న నామ నాగేశ్వరరావు , సాయంత్రం హుటాహుటిన అంబులెన్స్ లు ఏర్పాటు చేసి, వారితో కలిసి హైదరాబాద్ నిమ్స్ కు చేరుకుని,క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, డిప్యూటి మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ తదితరులతో నామ సంప్రదించి,మెరుగైన చికిత్స కు చర్యలు తీసుకున్నారు.
క్షతగాత్రులు త్వరగా కోలుకుని క్షేమంగా ఇంటికి చేరుకుంటారని బాధిత కుటుంబాలకు నామ భరోసా కల్పించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ఎంపీ నామ నాగేశ్వరరావు కు బాధిత కుటుంబాలు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశాయి.