
*ఖబర్దార్ కోమటిరెడ్డి*
*తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలి*
భువనగిరి పార్లమెంటు సభ్యులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుల అహంకారంతో, కండకావరంతో మదం ఎక్కి పిచ్చి పట్టినట్టు డాక్టర్ చెరుకు సుధాకర్ని నానావిధాలుగా దుర్భాషలాడి,చంపేస్తానని, నీ చావు నీ కొడుకు చావు వారం రోజుల్లోనే మా యొక్క అనుచరులు చేతుల్లో ఉంటుందని, నీ యొక్క హాస్పటల్ ను కూల్చివేస్తానని సెల్ ఫోన్ లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 40 సంవత్సరాల నుండి ప్రజల కోసం, ప్రజా జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని, తెలంగాణ ఉద్యమంలో అప్పటి ప్రభుత్వo చే పీడీ యాక్ట్ పెట్టబడి, జైలు జీవితాన్ని అనుభవించిన ఏకైక తెలంగాణ ఉద్యమకారులు చెరుకు సుధాకర్.
అంతటి త్యాగధనున్ని ఒక పిచ్చి పట్టిన కోతి లాగా తన ఇష్టానుసారంగా మాట్లాడటం,బెదిరింపులకు పాటుపడటం కడు శోచనీయం. ఇలాంటి పిచ్చి కూతలకు,తాటాకు చప్పుళ్ళకు భయపడే వ్యక్తి కాదు డాక్టర్ చిరు సుధాకర్. అతను ఒక దీశాలి. వెంటనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మాటలను వెనక్కి తీసుకొని, డాక్టర్కు బహిరంగ క్షమాపణ చెప్పనియెడల తెలంగాణ ఉద్యమకారుల ఆగ్రహానికి గురికాక తప్పదని బిసి ఎస్సి ఎస్టి మైనారిటీ ప్రజాసంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది.ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక చైర్మన్ డాక్టర్ కెవి కృష్ణ రావు, కన్వీనర్ గుంతెటి వీరభద్రయ్య, కో కన్వీనర్స్ పెరుగు వెంకటరమణ, బానోత్ బద్రు నాయక్, అబ్దుల్ రెహమాన్, షేక్ నజీమా, వల్లపు సోమరాజ్, మాల మహానాడు నాయకులు దాసరశ్రీనివాస్,కే రామారావు, మహిళా నాయకులు రమ్య, ఉపేంద్ర, బాసటి హనుమంతరావు, షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.