KhammamTelangana

ఖమ్మం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు

ఖమ్మం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు

ఖమ్మం ప్రాంతం ఇలా రద్దీలేమీ లేని రోజుల్లో వందల సంవత్సరాలు వెనక్కి వెళితే చిన్న చిన్న నివాసాలు, మామూలు రహదారులు ఊరికి మధ్యలో ప్రధానంగా కనిపిస్తూ ఓ పెద్ద గుట్ట, దానిపై నారసింహ స్వామి గుడి అది ఎవరు కట్టించారు ఎప్పటినుండి వుంది అనేవివరాలేమీ తెలియదు. అసలాగుడి ఎప్పుడో త్రేతాయుగం నాటినుంచి కూడా అలాగే వుండేదనికూడా జనాల్లో ఒక నమ్మకం. గుడి అంతా ఒక కొండ శిఖరం మీద వుండగా కొండ క్రింద నిలువుగా వున్న ఒక రాయి స్థంభం లాగా కనిపించేది. అందుకే ఈ ప్రాంతాన్ని స్థంభశిఖరి అని పిలిచేవారు. దూరప్రాంతాలనుంచి గుర్రాలపూ ప్రయాణం చేసుకుంటూ వచ్చిన వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నామఫలకాలేమీ చూపించాల్సిన అవసరంలేకుండానే తాము అప్పుడు ప్రవేశించిన వూరు స్థంభ శిఖరి అని చాలా సులభంగా తెలిసిపోయేందుకు కూడా వీలుగా వుండేది. అసలే రాజ్యల స్థిరత్వం తక్కువగా వున్న రోజులు, వీరులు ప్రయాణాలు ఎక్కువగా చేసేరోజులు ఈ ఊరి ప్రత్యేకతలే దూరప్రాంతం వారికి సైతం సులభంగా తెలిసేలా పెట్టుకోవడం ఆనవాయితా ఉండటం ఏమాత్రం ఆశ్చర్యం కాదేమో. చాలా దూరం వరకూ కనిపించే ఆద్యాత్మిక శోభతో విలసిల్లే మహిమాన్వితమని చెప్పబడే శిఖరము. దాని కళను ఇనుమడింపజేస్తూ కీర్తి పతాకాన్ని ఎగరేసేందుకు నిలబడందా అన్నట్లున్న స్థంభము. హిరణ్య కశిపుడిని స్థంభం లోనుంచి బయటకు వెల్వడిన నరసింహుడే చీల్చాడనేదే ఐతిహాసిక కథ కదా. అందుకే నరసింహ క్షేత్రంతో పాటు సహజసిద్దంగానే నిలబడ్డ స్థంభం సైతం జనాలకు ఆరాద్య మయ్యింది. ఖంబా అనేది కూడా స్థంబానికి మరో పర్యాయ పదం. బహుశా సీమ ప్రాంతాలనుంచి కాకతీయుల సామ్రాజ్యం చేరుకోవాలంటే ఈ ప్రాంతం నుంచే వెళ్ళలి. ఖమ్మం వరకూ వస్తే ఇక ప్రయాణంలో ఓరుగల్లు ప్రాంతానికి చేరుకున్నట్లే అక్కడికోక మెట్టు చేరుకున్నట్లే. ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాన్ని మొత్తంగా అప్పట్లో ‘‘ ఖమ్మంమెట్టు’’ అని కూడా పిలిచేవారు. మహాత్మాగాంధీ ఈ ప్రాంతాన్ని సందర్శించినపుడు వార్తలలో గమనించినా, `1953 లో జిల్లాగా ఏర్పడినప్పుటి పేరును గమనించినా ‘ఖమ్మంమెట్టు’ గానే వుంది. తర్వాతి కాలం లోని రెండక్షరాల అపభ్రంశ పేరుతో కేవలం ‘ఖమ్మం’ గా మిగిలింది. ఏదేమైనా అతి చారిత్రకమైన పేరును వేలసంవత్సరాలుగా నిలబెట్టుకుంటూ వస్తున్న ఘనతమాత్రం ఈ జిల్లా ప్రత్యేకం.
భౌగోళికంగా చక్కటి పీఠభూమి ప్రాంతం, పైగా అత్యంత కఠినమైన పురాతనమైన నల్లరాతి నిల్వలున్న ప్రాంతం. నరసింహ స్వామి గుట్టకు కూతవేటు దూరంలో, ఉదయపు దైవనమస్కారాలను ఉదయం కళ్ళు తెరవగానే చేసుకునేంత దగ్గరలో ఒక నల్లరాతి బండల అందమైన కొండ. పెద్దపెద్ద రాళ్ళ తరలింపులేమీ లేకుండా సులభంగా శత్రు దుర్భేద్యమైన నిర్మాణం చేసుకోగల చోటు.
అది క్రీస్తుశకం 591 ఖమ్మం ప్రాంతాన్ని మహదేవవర్మ అనే రాజు పరిపాలిస్తుండేవాడు. మనకి తెలుగు చరిత్రలో కూడా మొట్టమొదటిది అని చెప్పకుంటున్న కలమళ్ల శాసనాన్ని ఎరికల్ ముతురాజు అనే బిరుదు వున్న ధనుంజయుడు వేయించిన కాలం కూడా దీనికో పదిహేనేండ్ల పూర్వం క్రీస్తుశకం 575 కాలం. తెలుగు భాషకు ఎంత పూర్వచరిత్ర వుందో అప్పటినుండి చారిత్రక అస్తిత్వాన్ని బ్రతికించుకుంటూ వస్తున్న ఖమ్మం చరిత్ర నిజంగా గర్వకారణమే. ఈ మహ దేవ వర్మ వంశమే చాలా కాలం క్రమంగా పరిపాలించుకుంటూ వచ్చారట. మహదేవ వర్మ మహారాజు గారి తొమ్మిదవ వంశస్థుడైన మహదేవ రాజు 10వ శతాబ్ధంలో ఖమ్మం రాజ్యపాలన చేశాడు.
పరిపాలన సౌలభ్యం కోసం ఖమ్మాన్ని తమ సామ్రాజ్యానికి రెండో రాజధానిగా చేసుకున్నారు. ఈ సమయంలో కులీకుతుబ్‌షాహీ ఓటమి పాలైనా సీతాపతి ఖమ్మాన్ని కేంద్రంగా చేసుకుని ఈప్రాంతానికి తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. ఇక్కడ కూడా దండెత్తి ఇక్కడి ధనరాసులను గోల్కొండకు తరలించారు.
శకసంవత్సరం 1425 అంటే క్రీస్తుశకం 1503 నాటి ఓరుగల్లు శాసనం ప్రకారం ఖమ్మంకోటను పాలించిన వారిలో మరికొంత విశేషంగా చెప్పుకోవలసిన మహావీరుడైన సీతాపతి రాజు గురించి కొంత సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈయన నాగవంశానికి చెందిన భోగికులానికి చెందిన వాడట. తన భుజబల పరాక్రమాలతోనూ, బుద్ధికుశలతతోనూ మహ్మదీయులనుంచి ఏకశిలా నగరాన్ని స్వాధీన పరచుకుని హిందూ రాజ్య సముద్ధరణ తన ధ్యేయంగా పనిచేశాడు. ఓరుగల్లు లోని పాంచాలరాయ దేవాలయమును పునరుద్ధరించింది కూడా ఇతడే.
కానీ అతని బలం కోటను తన ధ్యేయాన్ని నిలబెట్టేందుకు చాలకపోయింది. సీతాపతి రాజు షితాబ్ ఖాన్ ముసుగుతో చెప్పుకోబడుతూ తనకు సాధ్యమయినంత మేర శిల్పసంపదనూ, వారసత్వ ప్రతీకలనూ భద్రపరిచేందుకు ప్రయత్నించాడు.
సాధ్యమయినంత చోటును గెలుచుకుంటూ వెళ్ళాలనే కంకణం కట్టుకున్న సుల్తాన్ కులీకుత్భుల్ ముల్క్ 1531 లో సీతాపతి రాజును ఓడించి ఖమ్మం కోటను స్వాధీనం చేసుకున్నాడు. దానితో ఈ దుర్గం కుతుబ్ షాహీల పాలనలోకి వెళ్ళిపోయింది. హిందుమతపరమైన చిహ్నాలనూ ఆధారాలనూ సహజంగానే తొలగించివేస్తారు కాబట్టి ఆతర్వాత ముస్లింపద్దతుల్లోకి కోట స్థూలరూపం మార్చబడింది. ఆ తర్వాత కూడా 17 వ శతాబ్ధంలొ ఇది అసఫ్ జాహీల పాలనలోకి వచ్చింది. ఒక కొండ పైన ఠీవిగా వుండే ఈ కోట అటు సాహసానికి, ఇటు వివిధ నిర్మాణ శైలుల మిశ్రమానికి ప్రతీక. ఈ ప్రాంతాన్ని వివిధ మతాలకు చెందిన వివిధ రాజవంశీకులు పరిపాలించిన౦దు వల్లనే ఈ మిశ్రమ శైలి ఏర్పడింది ఇదీ ఒక ప్రత్యకతేనేమో.
అబుల్ హసన్ తానీషా కాలంలో 21 సర్కారులు (ఇప్పటి జిల్లాల లాగా) ఉండేవి వాటికింద 356 పరగణాలు ఉండేవి. తరు వాత నైజం పాలనలో రావటంతో పరిపాలన సౌలభ్యం కోసం 21 సర్కారులను 40 సర్కారులుగా విభజించాడు. వాటిలో ఖమ్మం, వరంగల్ సర్కారులు ఉన్నాయి
పటిష్టమైన కోట నిర్మాణానికి అనుకోకుండా దొరికిన నిధి సాయం
అప్పుడు ఓరుగల్లు ప్రాంతాన్ని కాకతీయులు పరిపాలిస్తున్నారు. వెలుగుమట్ల అనే గ్రామంలో ముగ్గురు భూస్వామి రైతులు పొలం పనులు చేయిస్తుండగా వారికి అదృష్ట వశాత్తూ అపార సంపద దొరికింది. నిజమే కదా రాజులకు రాజ్యాలున్నా, సంపదలున్నా దాచుకునేందుకు ఇప్పటిలా పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థలేమీ లేని రోజులు కావడంతోనూ, రాజ్యాలపై దాడులూ, సంపదల దోపిడీలూ ఎక్కువగా వుండటంతోనూ తాము సంపాదించిన ధన,కనకాలను, విలువైన ఆభరణ వస్తు సామగ్రిని నిధి రూపంలోనే వివిధ ప్రదేశాలలో భద్రపరచుకోవలసి వచ్చేది. తమ వారసులకు తెలిపే అవకాశం కూడా మిగలక వారు చనిపోతే ఇలానే ఎవరో ఆ సమయానికి ఆ నిధిని కాలవశాత్తూ కనుక్కోవలసిందిగానే వుండేది. అందుకే ఇప్పటికీ అనేక దేవాలయాను నిధులుంటాయేమో నన్న అనుమానంతో వినాశనం చేస్తున్నారు.
ఓరుగల్లు ప్రాంతంలో ఇలా పొలం పనుల్లో నిధిని సంపాదించిన ముగ్గురూ రంగారెడ్డి, లక్ష్మారెడ్డి, వెల్మారెడ్డి ఈ సమాచారాన్ని కాకతీయ ప్రభువుకు తెలియజేసారు. సేద్యంలో దొరికిక ఈ అపార సంపదను మొత్తంగా తీసేసుకోవడం వల్ల వారిలో నిరాశవల్ల వ్యతిరేఖ భావన ఏర్పడుతుంది. లేదూ మొత్తం గా వాడేసుకొమ్మని వదిలేస్తే వృధాఖర్చులతో ప్రజలకు కంటగింపుగా మారే ప్రమాదం కూడా వుంది. అందేకే మహా మంత్రులతో మంతనాలైన పిదప ఈ ముగ్గురు రెడ్లకూ ఒక భాద్యతను అప్పగించి రాజహోదాను కట్టబెట్టాలనే నిర్ణయాన్ని చేసారు. ధనం దొరకటమే కాదు. ఈ నిర్ణయం కూడా ఖమ్మం చరిత్రకు ఒక చెరిగిపోని మైలు రాయిగా మారింది. అప్పటికే బౌద్దంతో విరాజిల్లుతున్న రాచరిక కేంద్రం నేలకొండపల్లి ప్రాంతానికి దగ్గరలో వుండి, కాకతీయ సామ్రాజ్యానికి ముఖ ప్రాంతంలా వుంటూ, ప్రవహించే నది, జనాల మనసులను కలిపి వుంచే ఆధ్యాత్మిక కేంద్రం వున్న ఖమ్మం ప్రాంతంలో కోట నిర్మాణం అనువుగా వుంటుందని చెప్పారు. నరసింహస్వామి గుట్ట పక్కనే వున్న తమ ఆధినంలోని రాజు పరిపాలనలో వున్న ఖమ్మంరాతిగుట్టమీద ఈ ధనంతో చక్కటి కోట నిర్మాణం చేసి, వారి జీవితాలకూ, వారి పిల్ల పిల్ల తరాలకూ నిలబడిపోయే పేరు తీసుకువచ్చేలా ఈ ధనాన్ని ఖర్చుపెట్టమనే నిర్ణయాన్ని కాకతీయ ప్రభువు చెప్పారు.
ఈ ముగ్గురు సోదరులు మహారాజు ఆదేశాను సారం నిధిరూపంలో దొరికిన సంపదసాయంతో తమ స్వీయ పర్యవేక్షణలో 950 లో కోట కట్టడం ప్రారంభించారు. మొదట్లో వీరు నిర్మాణం చేసింది సాధారణ మట్టికోట. అయినా సరే సహజంగా ధృఢంగా నిలబడిన రాతి దేహంతో అప్పడైనా ఎంతో శౌర్యప్రతాపాలున్న వీరుడిలాగానే ఈ కోట కనిపించేది.
ఈ ముగ్గురిలో లక్ష్మరెడ్డి తన ప్రత్యేకమైన శ్రద్దతో కోట పక్కనే ఒక తటాకాన్ని తవ్విచాడు లక్ష్యారెడ్డి చెరువే కాలక్రమాన లకారం చెరువుగా మారివుంటుంది. ఖమ్మం ప్రాంత వాసులు ఈ కోనేరు నీటినే పైపుల ద్వారా మళ్లించుకుని తాగు నీటిని పొందేవారు. నగరానికి జీవాన్ని జవసత్వాలనూ ఇచ్చేందుకూ ఈ కృత్రిమ తటాకం మునేరుకు కొంచెం దూరంగా వున్న ఖిల్లాప్రాంతంలో జనజీవనానికి సౌకర్యాన్ని కల్పించింది. కోటకు సంభందించిన సైన్యంతో పాటు వారి గజతురగాలన్నీ దాహార్తిని తీర్చుకునేందుకు ఇది సమాయకారి అయ్యింది.
997 లొ పరాక్రమవంతులైన గజపతులతో పాటు ఖమ్మానికి వచ్చిన కొండాపురానికి చెందిన అక్కిరెడ్డి, అస్కారెడ్డిలకు తమ పూర్వీక వంశానికి చెందిన వారు నిర్మించిన కోటను మరింత సౌందర్యవంతంగా మరింత శక్తిసామర్ధ్యాలతోనూ నిలబడివుండేలా తయారు చేయాలనిపించింది. తోమ్మిదేళ్ళ పాటు నిరంతరంగా కోట నిర్మాణాన్ని కొనసాగించారు. అదే కొండప్రాంతంలోని నల్లరాతి బండలను నిపుణులైన పనివాళ్ళతో సరైన ఆకారాలలో మలిచి చూట్టూ దుర్భేద్యమైన గోడ, ఆ గోడపై సైతం గుర్రాలతో తిరగేంత వెడల్పుతో దారి. కొండ ప్రాంతం కాబట్టి క్రిందనుంచి నీరు మళ్ళీ మళ్ళీ తొడుకోవటం చాలా క్లిష్టమైన పనిఅవుతుంది కాబట్టి కొటమొత్తంలో పడ్డ వర్షపు నీటిని ఒక్క చుక్కకూడా వృధాగా క్రిందికి కారిపోకుండా ఒడిసిపట్టుకుని ఏన్నో ఎగుడు దిగుళ్ళున్న దుర్గం పై భాగంలో అన్ని వైపుల నీటిని ఒక దగ్గరకు ప్రవహించేలా చేసారు. అలా నీళ్ళను సేకరించుకునే చోటు కూడా అత్యంత సహజంగా రాతి అడుగు భాగాన్నే కలిగివుంటుంది. ఎండతగిలేలా ఏర్పాట్లుకూడా వుండటంతో సంవత్సరం పొడవునా నిల్వవుండే నీరు పాకుడు పట్టిపోకుండా కూడా వుంటుంది. ఈ జలకాసారం వెయ్యిసంవత్సారాల క్రింత నిర్మాణమైనా ఇప్పటికీ అంతే సహజంగా తన నీటి నిల్వ సామర్ధ్యంతో వుంది.
చట్టూ 60 ఫిరంగులను మోహరించిగల ప్రదేశాలు అక్కడ ఫిరంగి వేర్వేరు దిశల్లో తిప్పి శత్రువుకు ఎక్కుపెట్టే అవకాశం వుంటుంది. అంతే కాకుండా శత్రువుల ఆయుధాలతో క్రిందనుంచి ఈ ఫిరంగులను నాశనం చేయటం దాదాపు అసాధ్యం అనుకునే చోట్లో పెట్టారు.
పహారా మూలలు, పర్యవేక్షణ రంధ్రాలూ ఎంతో ముందు చూపుతో చేసినవి వున్నాయిక్కడ సాయుదులైన సైనికులు కోట మీదనుండి దూరప్రాంతం వరకూ తమ దృష్టిపరిధినుంచి తప్పించుకోకుండా గమనింపులో వుంచుకునేలా కోటచుట్టూ వున్న వివిధ పహారా మూలలు ఏ ఒక్క దిక్కునూ వదలకుండా మొత్తంగా 360 డిగ్రీలలో చుట్టూ గమనింపులో వుంచుకునేలా వున్నాయి. అంతేకాకుండా సాధారణంగా 45 డిగ్రిలు లేదా క్రింది ప్రాంతం గమనించేందుకు కావలసినంత అనుకూలమైన కోణంలోనూ గోడల్లో అనేక చోట్ల ఈ పర్యవేక్షణ రంధ్రాలున్నాయి వీటిద్వారా కోట క్రింద ఏం జరుగుతోంది అనే విషయాలను జాగ్రత్తగా గమనించే అవకాశం వుంది.
కొటకు పది ద్వారాలున్నాయి ప్రధానంగా వున్న దర్వాజా రాతితో నిర్మించిన అతి పెద్ద దర్వాజా దీన్ని రాతి దర్వాజా లేదా పోత దర్వాజా అంటారు. దాని తలుపులు అమర్చేందుకు చేసిన రంధ్రాలూ, గడి కర్రలను పెట్టేందుకు గోడలో మిగిల్చిన రంధ్రాలూ ఇప్పటికీ గమనించి వచ్చు. ప్రధాన ద్వారాన్ని ఏనుగులతో ఢీకొట్టించి శత్రువులు పగలగొట్టే అవకాశం లేకుండా ముందు భాగంలో మలుపుని ఏర్పాటు చేసారు. రాతి గోడల పైభాగంలో రామప్పగుడిపై ఇటుకలతో నిర్మాణం చేసినట్లు కొన్ని వరుసల ఇటుక కట్టడం అదనంగా వుంటుంది. ఇప్పడు కోటపై నేతిబావిగా చెప్పబడుతున్న బావి లాంటి ప్రాంతం కాగడాలకు కావలసిన ద్రవ్యాన్ని నిల్వచేసేవారో, లేక నాటు పద్దతిలో చేసిన ఫిరంగులు బాంబులు వంటి వాటికి కావలసిన క్రొవ్వు పదార్ధాన్ని నిల్వవుంచటం వల్ల ఆ పేరు వచ్చిందో చారిత్రక ఆధారసహితంగా నిర్ధారణ కావలసివుంది. లేదా ఆయుధాలు,విలువైన భాండారాలనూ నిల్వవుంచే చోటు కానీ లేదా అత్యవసరపరిస్థితుల్లో రాణీవాసాన్ని తప్పించే సొరంగ మార్గం కానీ కూడా అయ్యివుండవచ్చు. ఒక సొరంగ మార్గం ఇక్కడినుంచి ఓరుగల్లు వరకూ నిర్మించారనే వదంతులు కూడా వున్నాయి. కోటపై నిర్మించిన మహల్ తాలూకు పునాది ఆకారం ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తుంది. అనేక సార్లు దండయాత్రలతోనూ, విలువైన సంపదలను దోచుకుపోగా, అనేక ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటూ నిలబడ్డ ఈ నాటి కోటను చూస్తూ మనకి కనిపించే ఈ కొద్ద అంశాలతోనే మనం ఆశ్చర్య పోతున్నాం నిజానికి అప్పట్లో మరెంత ఆశ్చర్చాన్ని కలిగించేంత అధ్భుత సౌందర్యంతో ఈ కోటను కట్టివుండకపోతే శ్రీకృష్ణదేవరాయలంతటి వాడు దీన్ని గెలవాలని చూస్తాడు. షితాబ్ ఖాన్ గా పేరుమార్చుకోవలసి వచ్చిన సీతాపతి దాచిపెట్టితే ఈమధ్య దొరికిన శిల్పాలూ, సంపదకంటే మరెన్ని రెట్ల వెలుగులను ఈ కోట ఒకప్పుడు వెదజల్లివుంటుందో కదా?
కోటవిశేషాలు సంక్షిప్తంగా
► గ్రానైటు రాళ్లతో నిర్మించిన ఈ పఠిష్టమైన కోట నాలుగు చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నది. కోటకు పది ద్వారాలున్నాయి.
► ఖిల్లా ప్రహరీ ఎత్తు 40 నుంచి 80 అడుగులు. వెడల్పు 15 నుంచి 20 అడుగులు.
► పశ్చిమం వైపున్న దిగువకోట ప్రధానద్వారం. తూర్పు వైపున్న ద్వారాన్ని రాతి దర్వాజా లేదా పాత దర్వాజా అంటారు. దీన్నే పోతదర్వాజ అని కూడా పిలుస్తారు.
► ఖిల్లాలోని పది దర్వాజాలలో పత్తార్‌ దర్వాజాగా పిలువబడే సింహద్వారం అతి పెద్దది.
► కోట చుట్టూ 60 ఫిరంగులు మొహరించే వీలుకలదు.
► కోట లోపల జాఫర్‌దౌలా కాలంలో నిర్మించిన ఒక పాత మసీదు, మహల్ ఉన్నాయి. 60 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉన్న జాఫర్‌దౌలా (బావి) ఉంది..
► కోటపై ముట్టడి జరిగినప్పుడు తప్పించుకోవటానికి ఒక రహస్య సొరంగం కూడా ఉన్నది.
► వర్షపు నీటిని నిలువ చేసుకోవటానికి నీటి కాలువలు కూడా ఉన్నవి.
► ఖిల్లాలోకి ప్రవేశించడానికి రెండు ముఖ ద్వారాలున్నాయి. లోపలి సింహద్వారం చదరంగా ఉండి 30 అడుగుల ఎత్తులో పెద్దపెద్ద రాళ్లతో నిర్మించారు.
► ప్రతి కోట బురుజు (గోడ)పై భాగం 45 అడుగుల వెడల్పుతో లోపలికి దిగడానికి మెట్లు కనబడతాయి.
► ప్రతి బురుజుపైనా రెండు ఫిరంగులున్నాయి. కిలోమీటర్ల దూరంలోని శత్రువును కనిపెట్టే గడీలు నేటికీ సజీవంగా వున్నాయి.
► సింహద్వారం సమీపంలో ఆరు అడుగుల ఫిరంగి ఉంది. ఫిరంగి గుండు తగిలినా చెక్కుచెదరని పటిష్ఠతతో నిర్మించారు ఈ రాతి కట్టడాన్ని.
► కోటగోడలపై ఉన్న చిన్నచిన్న గోడలను జాఫర్ దౌలా (ధంసా) నిర్మించారు.వీటిని ఇటుకలు, సున్నంతో కట్టారు.
► ఖిల్లాలో 80 అడుగుల వెడల్పుతో ఒక పెద్ద దిగుడు బావి ఉంది. లోపలికి దిగడానికి రాతి మెట్లు ఉన్నాయి.
► కోట సింహందాటి లోపలికి కొద్దిదూరం వెళ్లాక అసలు దుర్గం కన్పిస్తుంది. దీనిపైకి ఎక్కడానికి చిన్న మెట్లు ఉన్నాయి.
► ఈ మార్గంలో చిన్నచిన్న రాతిగోడలతో ద్వారాలున్నాయి. వీటిని దాలోహిస్వారు అంటారు.
► కొండపై కట్టిన ఈ ఖిల్లా విస్తీర్ణం మూడు చదరపు మైళ్లు.
► 15 బురుజులు శత్రుసైన్యం దాడులను తట్టుకునే విధంగా ఒకదానివెంట మరొకటి రెండు గోడలు నిర్మించారు. పెద్దపెద్ద రాళ్లను కోట నిర్మాణంలో నిలువుగా పేర్చి తాటికొయ్య ప్రమాణంలో నిర్మించారు. పక్కరాళ్లు అతకడానికి ఎలాంటి సున్నమూ వాడకపోవడం గమనార్హం. వాటి చుట్టూ లోతైన కందకం తీశారు.
► కాకతీయ పట్టణం ఓరుగల్లు నుంచి ఖమ్మం ఖిల్లా కోటకు సొరంగ మార్గం ఉందని, దాని ద్వారానే రాకపోకలు సాగేవని కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది.
► ఖిల్లాపై లభించిన శాసనాలు, రాతికట్టడాలు, బురుజులు, ఫిరంగులు, అన్ని కాలాల్లోనూ నిండుగా నీరుండే కోనేరు.. ఆరాజుల విజయగాథలను ప్రతిబింబిస్తున్నాయి.
► శత్రుసైన్యాల దాడినుంచి కాపాడుకునేందుకు నిర్మించిన ఈ రాతి కోటలు నిర్మితమై వెయ్యేళ్లు అవుతున్నా పెచ్చులు కూడా ఊడకపోవడం నాటి మానవ సాంకేతిక మేధస్సుకు సంకేతం. గుట్టల మధ్య చెరువులు, పరిపాలనకు అనుగుణంగా భవనాలు, రాజులు, చరిత్రకారులు, నక్షాలు (ప్రణాళిక) రూపొందించిన ఇంజనీర్ల పేర్లూ చెదిరిపోని అక్షరాల్లో దాగున్నాయి.
► కోటలు, చెరువులతో గ్రామాలు నెలకొన్నాయి. కోటలోని భవనాలు, కోనేరులు, ఫిరంగులు నాటి రాచరికాన్ని తెలిపితే.. వాటి చుట్టూ ఉన్న చిన్నచిన్న కోట కట్టడాలు నాటి సైనికుల పనితనానికి కొలమానంగా మిగిలాయి.
► నాటి కోటల నిర్మాణంలో మనిషితోపాటు సమానపాత్రధారిగా శ్రమించిన ఏనుగులు, గుర్రాల నమూనాలు కోటలముందు నేటికీ కన్పిస్తాయి.
అంతటి శ్రద్ధతో వీరు నిర్మించతలపెట్టిన గిరిదుర్గం క్రీస్తుశకం 1006 సంవత్సరం నాటికి నిర్మాణం పూర్తిచేసారు. నిధిదొరికించుకున్న పుణ్యఫలమో, శ్రధ్దాభక్తులతో నిర్మించిన ఫలితమో ఆ తర్వాత 300 సంవత్సరాల సుధీర్ఘకాలం పాటు రెడ్డి వంశీయుల పాలనలోనే ఖమ్మం ప్రాంతంతో పాటు ఈ గిరిదుర్గం కూడా వుంది. ఆ తర్వాత శౌర్యమున్న వానిదే రాజ్యమన్న సూత్రంతోనే వెలమ రాజులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. . నిర్మాణానంతర అనేక సొబగులను రెడ్డిరాజుల తర్వాత వెలమరాజులు అద్ది ఈ కోటను మరింత మెరుగు పరిచారట. ఆ తర్వాత నందవాణి, కాళ్ళూరు, గుడ్లూరు వంశాల చేతుల్లోకి వెళ్ళింది. కాకతీయులకు రెండో రాజధానిగా మొదట కాకతీయుల సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉన్న ఖమ్మం ఖిల్లా తదనంతరం స్వతంత్ర మండలి రాజ్యంగా రూపొందింది. కాకతీయుల సామ్రాజ్యం నశించిపోయిన తర్వాత తెలుగునేలను ఏకం చేయాలనే లక్ష్యంతో 74 మంది సామంతరాజులు ఏకమై ఖమ్మం సమీపంలో ఉన్న మూసురూలి నాయకత్వంలో పదేళ్లపాటు విరోచితంగా పోరాటం జరిపారు. ఓడ్ర గజపతిరాజు ఈ దుర్గాన్ని జయించి 1424లో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం మహేంద్ర వీరులైన కాపా నాయుడు, పోలా నాయుడు దీనిని పాలిం చారు.
షితాబ్‌ ఖాన్‌ అనే బిరుదు గల సీతా పతిరాజు క్రీ.శ 15 వశతాబ్దంలో ఈ కోటకు అధిపతిగా ఉన్నా డు. అనంతరం సీతాపతి కాలంలో ఖమ్మం ఖిల్లా తెలంగాణ ముఖ్యకేంద్రం అయింది. సీతాపతి బహమని సుల్తానుల సహాయంతో వరంగల్‌కు రాజప్రతినిధిగా ఎన్నికయ్యాడు. సీతాపతిరాజుకు మంత్రిగా పెద్దామాత్యుడు పనిచేసారట. పెద్దయ్యమాత్యుని సహాయంతో తెలంగాణలో తిరిగి తెలుగు సామ్రాజ్యం విస్తరింపచేశారు.
“గోల్కొండ సీమ కావ్యాలు”లో – “చిత్తాబ్జ ఖానుడు..అనే పదం వుంది అదేమిటంటూ పరిశోదించి అది మరెవరో కాదు చితాబ్ ఖాన్ అనే నామాంతరం కల సీతాపతిరాజే నని శ్రీ ఆదిరాజు వీరభద్రరావు గారు తన పరిశోధనలో తేల్చారు.
కాకతీయ సామ్రాజ్యం పతనమైన తరువాత రెండుశతాబ్దాలకు ఒక కోయ వీరుడు సీతాపతిరాజు – మహమ్మదీయులు అతని మతం మార్చి ‘షితాబుఖాన్’ అనే పేరు పెట్టారు- ‘జీర్ణ కాకతీయ రాజ్యస్థాపనాచార్య’ అనే బిరుదంతో వరంగల్‌ను పాలించి గొల్కోండ నవాబ్ కులీని గడగడలాడించాడు. ఖమ్మంమెట్టు, బెల్లంకొడ దుర్గాలను అతని నుండి లాక్కునేసరికి నవాబ్ కులికీ చావు తప్పి కన్నులొట్టపోయంది. సీతాపతిరాజు, ఓరుగల్లును కోల్పోయిన తరువాత, గజపతుల అధీనంలోగల కొండపల్లి కోటకు వచ్చి గజపతి విద్యాధరదేవ్ కుమారుడు, దుర్గ్ధాపతి రామచంద్రదేవ్‌ను నవాబుతో యుద్ధానికి సిద్ధం చేశాడు. కాని వారు ఓడిపోయి సంధి కుదుర్చుకున్నారు. ఈ సమయంలోనే కృష్ణదేవరాయలు దండెత్తివచ్చారు. గజపతుల ప్రతినిధిగా అతనితో తలపడి ఏలూరువద్ద సీతాపతిరాజు వీరమరణం పొందాడని ‘రాయవాచకం’ అని శౌర్యాన్ని కీర్తిస్తున్నది. కృష్ణాజిల్లా మాన్యుయల్ (1883) పన్నెండువేల విలుకాండ్ల బలానికి నాయకుడుగా సీతాపతిరాజును పేర్కొంటూ అతని పోరాటాలను అనేక సార్లు ప్రస్తావించింది.
సుల్తాన్ కులీకుత్బూల్ ముల్క్ 1531లో అప్పటి ఖమ్మం పాలకుడైన సితాబ్‌ఖాన్ (సీతాపతిరాజు)ను ఓడించి ఖమ్మంకోటను స్వాధీనం చేసుకున్నాడు.
వరంగల్ గణపురంలోని కోటగుళ్ళను సైతం కాపాడిన సీతాపతి
క్రీ.శ. 1504 నుంచి 1512వరకు ఓరుగల్లును పాలించిన షితాబుఖాన్ అనే సీతాపతి రాజు మహ్మదీయుల కంటపడి విధ్వంసం కాకుండా కాపాడి భూమిలో పూడ్పించిన 8అడుగుల శివ, విష్ణువు ద్వారపాలకుల విగ్రహాలు, రాజనర్తకి, సూర్య భగవాన్‌ల విగ్రహాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. వీటిని పురావస్తు శాఖ వారు గణపేశ్వరాలయ ప్రాంగణంలోని హరిత హోటల్ ముందు భద్రపర్చారు.

హరిత హోటల్ ముందు భద్రపరచిన విగ్రహాలు
సీతాపతి వీటినే భూగర్భంలో దాచి కాపాడాడు
పరిపాలన సౌలభ్యం కోసం ఖమ్మాన్ని తమ సామ్రాజ్యానికి రెండో రాజధానిగా చేసుకున్నారు. ఈ సమయంలో కులీకుతుబ్‌షాహీ ఓటమి పాలైనా సీతాపతి ఖమ్మాన్ని కేంద్రంగా చేసుకుని ఈప్రాంతానికి తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. ఇక్కడ కూడా దండెత్తి ఇక్కడి ధనరాసులను గోల్కొండకు తరలించారు.
శకసంవత్సరం 1425 అంటే క్రీస్తుశకం 1503 నాటి ఓరుగల్లు శాసనం ప్రకారం ఖమ్మంకోటను పాలించిన వారిలో మరికొంత విశేషంగా చెప్పుకోవలసిన మహావీరుడైన సీతాపతి రాజు గురించి కొంత సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈయన నాగవంశానికి చెందిన భోగికులానికి చెందిన వాడట. తన భుజబల పరాక్రమాలతోనూ, బుద్ధికుశలతతోనూ మహ్మదీయులనుంచి ఏకశిలా నగరాన్ని స్వాధీన పరచుకుని హిందూ రాజ్య సముద్ధరణ తన ధ్యేయంగా పనిచేశాడు. ఓరుగల్లు లోని పాంచాలరాయ దేవాలయమును పునరుద్ధరించింది కూడా ఇతడే.
కానీ అతని బలం కోటను తన ధ్యేయాన్ని నిలబెట్టేందుకు చాలకపోయింది. సీతాపతి రాజు షితాబ్ ఖాన్ ముసుగుతో చెప్పుకోబడుతూ తనకు సాధ్యమయినంత మేర శిల్పసంపదనూ, వారసత్వ ప్రతీకలనూ భద్రపరిచేందుకు ప్రయత్నించాడు.
సాధ్యమయినంత చోటును గెలుచుకుంటూ వెళ్ళాలనే కంకణం కట్టుకున్న సుల్తాన్ కులీకుత్భుల్ ముల్క్ 1531 లో సీతాపతి రాజును ఓడించి ఖమ్మం కోటను స్వాధీనం చేసుకున్నాడు. దానితో ఈ దుర్గం కుతుబ్ షాహీల పాలనలోకి వెళ్ళిపోయింది. హిందుమతపరమైన చిహ్నాలనూ ఆధారాలనూ సహజంగానే తొలగించివేస్తారు కాబట్టి ఆతర్వాత ముస్లింపద్దతుల్లోకి కోట స్థూలరూపం మార్చబడింది. ఆ తర్వాత కూడా 17 వ శతాబ్ధంలొ ఇది అసఫ్ జాహీల పాలనలోకి వచ్చింది. ఒక కొండ పైన ఠీవిగా వుండే ఈ కోట అటు సాహసానికి, ఇటు వివిధ నిర్మాణ శైలుల మిశ్రమానికి ప్రతీక. ఈ ప్రాంతాన్ని వివిధ మతాలకు చెందిన వివిధ రాజవంశీకులు పరిపాలించిన౦దు వల్లనే ఈ మిశ్రమ శైలి ఏర్పడింది ఇదీ ఒక ప్రత్యకతేనేమో.
అబుల్ హసన్ తానీషా కాలంలో 21 సర్కారులు (ఇప్పటి జిల్లాల లాగా) ఉండేవి వాటికింద 356 పరగణాలు ఉండేవి. తరు వాత నైజం పాలనలో రావటంతో పరిపాలన సౌలభ్యం కోసం 21 సర్కారులను 40 సర్కారులుగా విభజించాడు. వాటిలో ఖమ్మం, వరంగల్ సర్కారులు ఉన్నాయి.

అంతటి శ్రద్ధతో వీరు నిర్మించతలపెట్టిన గిరిదుర్గం క్రీస్తుశకం 1006 సంవత్సరం నాటికి నిర్మాణం పూర్తిచేసారు. నిధిదొరికించుకున్న పుణ్యఫలమో, శ్రధ్దాభక్తులతో నిర్మించిన ఫలితమో ఆ తర్వాత 300 సంవత్సరాల సుధీర్ఘకాలం పాటు రెడ్డి వంశీయుల పాలనలోనే ఖమ్మం ప్రాంతంతో పాటు ఈ గిరిదుర్గం కూడా వుంది. ఆ తర్వాత శౌర్యమున్న వానిదే రాజ్యమన్న సూత్రంతోనే వెలమ రాజులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. . నిర్మాణానంతర అనేక సొబగులను రెడ్డిరాజుల తర్వాత వెలమరాజులు అద్ది ఈ కోటను మరింత మెరుగు పరిచారట. ఆ తర్వాత నందవాణి, కాళ్ళూరు, గుడ్లూరు వంశాల చేతుల్లోకి వెళ్ళింది. కాకతీయులకు రెండో రాజధానిగా మొదట కాకతీయుల సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉన్న ఖమ్మం ఖిల్లా తదనంతరం స్వతంత్ర మండలి రాజ్యంగా రూపొందింది. కాకతీయుల సామ్రాజ్యం నశించిపోయిన తర్వాత తెలుగునేలను ఏకం చేయాలనే లక్ష్యంతో 74 మంది సామంతరాజులు ఏకమై ఖమ్మం సమీపంలో ఉన్న మూసురూలి నాయకత్వంలో పదేళ్లపాటు విరోచితంగా పోరాటం జరిపారు. ఓడ్ర గజపతిరాజు ఈ దుర్గాన్ని జయించి…

Collected from,
Srinivas Chekuri fb wall

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected