
ఖమ్మం పత్తి మార్కెట్లో ఘోర అగ్నిప్రమాదం
ఖమ్మం నగరంలో పత్తి మార్కెట్ యార్డ్ లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో సుమారు 1500 కు పైగా పత్తి బస్తాలు దగ్ధమైనట్లు తెలుస్తుంది.
పోలీసుల కథనం ప్రకారం మార్కెట్లో ఖరీదుదారుడు చిట్టూరు శ్రీనుకి సంబంధించిన నిల్వ ఉంచిన పత్తి బస్తాలు దగ్ధమైయ్యాయి.
ఈ సంఘటనలో వ్యాపారికి సుమారు 30 లక్షల రూపాయలు నష్టం వాటిల్లింది.
మంటలను అదుపు చేసేందుకు రెండు ఫైరింజన్ల సహాయంతో అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది.
విషయం తెలుసుకున్న త్రీటౌన్ సీఐ బత్తుల సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకొని విషయంపై ఆరా తీస్తున్నారు.