
దమ్ముంటే రేణుక చౌదరి నా పై పోటీ చేసి గెలవాలి:- మంత్రి పువ్వాడ
ఖమ్మం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు సభలో మంత్రి పువ్వాడ
బీఆర్ఎస్ కు కంచుకోట ఖమ్మం నియోజకవర్గం:- మంత్రి పువ్వాడ
రాష్ట్రంలో చరిత్ర సృష్టించి మూడోసారి సీఎం గా కేసీఆర్ గారు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు :-మంత్రి అజయ్ కుమార్
అజయ్ కుమార్ ని మాటలు అనడమే లక్ష్యంగా ఖమ్మం లో రాజకీయాలు చేస్తున్నారు :-మంత్రి అజయ్
ప్రత్యర్ధులకు కలలో కూడా నేనే వస్తున్న:- మంత్రి పువ్వాడ
రేణుక చౌదరి అంటే పబ్భులు,గబ్భులు:-మంత్రి అజయ్
కేంద్రమంత్రి గా చేసిన నువ్వు ఖమ్మం జిల్లాకు చేసింది ఏంది:- మంత్రి పువ్వాడ
ఖమ్మనికి గుండు సున్నా చూపించిన ఘనత రేణుక చౌదరి ది:- మంత్రి అజయ్
కేసీఆర్ గారి దర్శినికత వల్లే జాతీయ రహదారులు తెచ్చుకోగలుతున్నాం:- మంత్రి పువ్వాడ
దమ్ముంటే రేణుక చౌదరి నా పై పోటీ చేసి గెలవాలి:- మంత్రి పువ్వాడ
చిల్లరమల్ల మాటలు కాదు నువ్వు నా మీద రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా:- మంత్రి అజయ్
నాకు సంస్కారం ఉన్నది, నా తల్లిదండ్రులు నాకు అది నేర్పించారు,నాకు రేణుక చౌదరి లాగా మాట్లాడటం రాదు :- మంత్రి అజయ్
న్యాయపరంగా నీచుల పై పోరాటం చేస్తా :- మంత్రి అజయ్ కుమార్
చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డి మాటలు నమ్మడానికి ఖమ్మం ప్రజలు పిచ్చివాళ్ళు కాదు:- మంత్రి పువ్వాడ
బీఆర్ఎస్ విజయం చారిత్రక అవసరం:- మంత్రి అజయ్
సమన్వయంతో ముందుకు సాగుదాం..
ఊరూరా అభివృద్ధి.. గడపగడపకూ సంక్షేమం.
బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో శ్రేణులకు పిలుపునిచ్చిన మంత్రి పువ్వాడ.
రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అజేయ విజయాన్ని సొంతం చేసుకొని మూడోసారి సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి రావటాన్ని ఏ శక్తి ఆపలేదని, అందుకు నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి విజయాన్ని సాధించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు.
బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా BRS పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఅ ఆదేశాల మేరకు ఎర్పాటు చేసిన ఖమ్మం నియోజకవర్గ పార్టీ ప్రతినిధుల సమావేశంలో మంత్రి పువ్వాడ మాట్లాడారు.
కేసీఅర్ నాయకత్వంలో 9 ఏండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తద్వారా రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో గులాబీ నేతలు కృషి చేయలని సూచించారు.
రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీని మళ్ళీ గెలిపించి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని, మూడోసారి గెలిపించి మళ్ళీ సీఎం కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రజక సంఘం రాష్ట్ర నాయకులు రెగళ్ళ కొండల అధ్వర్యంలో పలువురు మంత్రి పువ్వాడ సమక్షంలో BRS పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
రఘునాధపాలెం మండలం వెపకుంట్ల గ్రామం నుండి Cpi ML పార్టీ నుండి శీలం మల్లయ్య అధ్వర్యంలో పలువురు BRS పార్టీలో చేరారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు ప్రజలకు వివరించాలని సూచించారు.
బీజేపీయేతర పాలిత రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ఎక్కడికక్కడ వివరించాలన్నారు.
సీబీఐ, ఈడీ, ఐటీలను కేంద్రం తన స్వార్థరాజకీయాల కోసం ఎలా వాడుకుంటున్నదో ప్రజలకు చెప్పాలని హితబోధ చేశారు.