గజిబిజి జీవితంలో బాధ్యత కలిగిన కుటుంబం

“బాధ్యత కలిగిన కుటుంబం “: డాక్టర్. పీటర్ నాయక్ లకావత్
1) బాధ్యత కలిగిన కుటుంబం నేడుకొన్ని కుటుంబ జీవితాలు చూసినప్పుడు వారిని అనుసరించాలి అనిపిస్తుంది. ఎందుకంటే భార్య భర్తను గౌరవించే విధానం చూసిన ప్రతిసారి వారిని గురించి విన్నా, ప్రతిసారి సంతోషం అనిపిస్తుంది. అట్టి ఆదర్శ కుటుంబాలను అనుసరించాలి అనుకోవడం సహజం. భర్త భార్యపట్ల కలిగిన ఉన్నా గౌరవం నా కుటుంబంలో ఎందుకులేదు అనే ఆలోచనకు తీసుకుకెళ్లుతాయి. అంతే కాదు మంచి భార్య భర్తలు పిల్లలపట్ల వ్యవహరించే తీరు నాకు నేను అట్టి మంచి వాతావరణం ఎందుకు చూడలేకప్తున్నాను అనే ఆశకూడా ఉంటుంది.
కానీ ఎంతగా ప్రయత్నించినా వారివలే సంతోషాన్ని అశ్వదించలేకపోతుంటాం! కారణం అనేకములు కలవు. నా భర్త నన్ను ప్రేమించాలి, గౌరవించాలి, లోబడాలి, అని భార్య అనుకుంటూనే కాలాన్ని వృధా చేస్తుంది. కానీ ఒక భార్యగా తాను మాత్రం జీవితంలో కొన్ని మార్పుల వలన భర్తకు అన్నివిధాలా వివేకంతో ఉండాలని, లేక భర్త మనసును ఆకట్టుకునేలా ఉండాలని ప్రయత్నం చేయడంలేదు.
అందుకే జీవితాంతం కుటుంబంలో గొడవలు, మనస్పర్ధాలు రాజ్యమేలుతుంటాయి. భార్య ప్రవర్తనపై కుటుంబ గౌరవం ఆధారపడి ఉంటుంటుంది. ఒక కుటుంబంలో భర్తను ఈ సమాజం గౌరవించాలన్నా, మంచి పురుషుడుగా సమాజంలో గుర్తింపు కలిగి జీవించాలన్నా, నలుగురిలో భార్య తన భర్తను అభిమానించే తీరుపై ఆధారపడి ఉంటుంది. భార్య ఓ సహనమూర్తి ఆమేకంటూ ఒక ప్రత్యేక ఉంది. ఆ ప్రత్యేకను అర్ధంచేసుకోలేని భార్య మాత్రమే నిత్యం భర్తతో గొడవలకు దిగుతుంది. కానీ తన ప్రత్యేకను గ్రహించి అర్ధం చేసుకునే ఏ భార్యకూడా అనాలోచనగా యుద్ధవాతావరణానికి దారితీసే చర్యలకు పునుకోదు. తన ప్రత్యేకను బజారుకి ఇడ్చెప్రయత్నం చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది.
ఎందుకంటే క్షణికపాటి ఆవేశంకంటే తన పరువు, భర్త పరువు, ముఖ్యంగా తన పిల్లల పరువు భవిష్యత్తునే ప్రామాణికంగా భావిస్తుంది. తాను ఎన్ని అవమానాలు పడినప్పటికి పెద్దమనసుతో క్షమిస్తుంది, భరిస్తుంది, సాధ్యమైనంతవరకు తన తొందరపాటుతోగాని, ఆవేశంతోగాని, తన కుటుంబం ఎట్టిపరిస్థితిలో రోడ్డునపడకుండా జాగ్రత్త వహిస్తుంది. అట్టి స్త్రీ నలుగురిలో ఎక్కడ నిలబడ్డ మంచి పేరు ప్రఖ్యాతికి అర్హత సాధిస్తుంది. ఎందుకంటే ఏమి ఉన్నా ఏమి లేకున్నా మంచి పేరు కలిగి తన పిల్లలకు ఆదర్శవంతురాలుగా ఉండేక్రమములో సహనాన్ని ఎప్పుడు కొలిపోకూడదు. అదే ఆమెలో ఉన్నా ప్రత్యేకతగా ప్రతి కుటుంబ యజమానురాలు గ్రహించాలి. అప్పుడే ఎంతటి కఠినత్ముడైన భర్త అయినా ఆయనలో మార్పువస్తుంది. జీవనపోరాటంలో వచ్చే ఛిన్న ఛిన్న సమస్యల్ని భార్యగా ప్రేమ, సహనం, ఓర్పు, గౌరవం, చిరునవ్వుతో జయించగలిగినప్పుడే ఆ కుటుంబంలో శాంతి సమాధానం, ఆనందం వారికి సొంతం.
భర్తలు కూడా ఎలాగు భార్యలకే గట్టి లెస్సన్ గా ఉంది అని సంకలుకొట్టుకోవద్దు భర్తగా నీకు కూడా చాలా బాధ్యతలు ఉన్నాయి. నా భార్య ఇలా వుండాలి, అలా ఉండాలి అని అజ్ఞాలు జారీ చేయడం పురుషుని లక్షణం కాదు. భర్త అంటేనే భరించేవాడు వేధించేవాడుకాదు అనే విషయాన్ని గుర్తించాలి… ఉచిత సలహాలు చాలామంది పురుష లోకం అనుకోవడం సహజం. కానీ ఒక పరిణితి చెందిన భర్తగా మనల్ని మనం ఎందుకు పరిశీలించుకోకూడదు? ఇందులో నేను నా భార్యకంటే గొప్పవాన్ని?
నాకు ఉన్నా స్వేచ్ఛ ఆమెకుకూడా ఉందని ఎందుకు భావించరాదు?
నాకు తెలిసి నేను ఎలా ఉంటే నా భార్యకూడా అలాగే ఉంటుంది. మా భార్యభర్తల మంచి నడవడికనే మా పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది అని నమ్మేవారిలో ఒక భారతీయ పురుషుడుగా ఎప్పుడు నా భార్యా మనసును నొప్పించే పరిస్థితులు రాకుండా జాగ్రత్త తీసుకుంటూ ఉంటాను. సరే భార్య గయ్యాళిదే అనుకుందాం! మరి భర్తకు ఎందుకు తక్కించుకునే స్వభావంలేదు? ఎప్పుడు భార్యనే మారాలి కానీ భర్త మారకూడదా? కచ్చితంగా ఇద్దరిలో ఎవరో ఒక మార్పుచెందాలి అప్పుడే ఆ కుటుంబంలో ఇద్దరిమధ్య సంతోషం ఉంటుంది. లేకపోతే ఈ ఇద్దరు భార్య భర్తల ప్రభావం కచ్చితంగా పిల్లలపై చూపుతుంది. “బాధ్యత కలిగిన కుటుంబంలో పురుషులకు చాలా బాధ్యతలు ఉన్నాయి.. రెండోవ భాగంలో కలుద్దాం..!
రచన: -డాక్టర్. పీటర్ నాయక్ లకావత్