
గడల శ్రీనివాసరావు అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి
ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి SAM రిజ్వి ఐఏఎస్ గారికీ వినితి ప్రతం అందజేసిన
LHPS రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్
GSP రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ
సికే న్యూస్ ప్రతినిధి
భారత రాజ్యాంగం ఐదవ షెడ్యూల్ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం షెడ్యూల్ ప్రాంతంలో ఉద్యోగాలు పూర్తిగా గిరిజన నిరుద్యోగులతోనే భక్తి చేయాల్సింది ఉండగా ఏజెన్సీ చట్టానికి విరుద్ధంగా హెల్త్ డైరెక్టర్ గాడల శ్రీనివాసరావు సమీప బంధువైన బిసి సామాజిక వర్గానికి చెందిన ఎస్ దుర్గ భవాని తండ్రి భాస్కరరావు అనే ఆమెను ఎలాంటి ప్రభుత్వ నోటిఫికేషన్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా గిరిజనేతురాలైన ఆమెకు ఏఎన్ఎం ఉద్యోగం ఇచ్చి తన బంధు ప్రీతిని సాటుకున్నారు
జిల్లా సెలక్షన్ కమిటీ ఆమోదం లేకుండా బహిరంగ నోటిఫికేషన్ లేకుండా దొంగ చాటుగా ఉద్యోగ అవకాశం కల్పించారు
కేవలం హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు లేక ఆదేశాలతో DMHO నోట్ 5 ద్వారా ఏజెన్సీ ఏరియాలో గిరిజనేతరాలు ఎస్ దుర్గాభవానికి ఏఎన్ఎంగా ఉద్యోగం కల్పించినారు
ఎస్ దుర్గాభవాని భర్త ఎస్ చంద్రగిరి అంజి హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు నిర్వహిస్తున్న జిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్టు కు మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు
ఇతను గడల శ్రీనివాసరావు సమీప బంధువు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో చంద్రగిరి అంజి ఆదేశాల మేరకు బదిలీలతో పాటు ప్రమోషన్లు ఇతర వ్యవహారాలు నడుస్తున్నాయి
తనకు రాజకీయంగా ఉపయోగపడాలనే నేపథ్యంతో ఇతర జిల్లాలో విధులు నిర్వహిస్తున్నా వైద్య సిబ్బందితో ఒప్పందం కుదుర్చుకొని కొత్తగూడెం జిల్లాలో డిప్యూటేషన్ పై నియామకాలు చేయడం జరుగుతుంది
గడల శ్రీనివాసరావు తన స్వార్థ ప్రయోజనాల కోసం తన ఇష్టానుసారంగా బదిలీ చేయడంలో ప్రధాన ఉద్దేశం కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రయత్నంలో భాగంగా అగ్రకులానికి చెందిన ఓసి సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ను డిఎమ్ హెచ్ఓ గా నియమించడం తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే నని అర్థమవుతుంది
ఈ విషయాలపై సమగ్ర విచారణ జరిపించి చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బద్రు నాయక్ అరుణ్ నాయక్